S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/13/2018 - 23:08

నెల్లూరు, జూలై 13 : నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి కలెక్టర్ ముత్యాలరాజుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా అధికారుల సంఘం నాయకుల పిలుపు మేరకు శుక్రవారం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సామూహిక సెలవుపై వెళ్లారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి విధులకు గైర్హాజరైయ్యారు.

07/13/2018 - 23:07

అమరావతి, జూలై 13: ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా శ్రీకాకుళంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేష్‌కుమార్ అధ్యక్షతన వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. స్వాతంత్య్ర వేడుకలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు.

07/13/2018 - 02:42

విశాఖపట్నం, జూలై 12: ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో శుక్రవారం అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఒడిశాను ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం యథావిధిగా కొనసాగుతోంది.

07/13/2018 - 01:53

విజయవాడ: ఎన్నికల మేనిఫెస్టోలో అన్నింటినీ నెరవేర్చామని, చెప్పనివి కూడా చేశామని, ఎవరైనా అడిగితే దబాయించి చెప్పాలని, చెప్పిన దానికన్నా అధికంగా చేశామని చెప్పాలని పార్టీ నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై లేనిపోని అనుమానాలు పెంచి, ఆ ప్రాజెక్టును బలిపశువును చేసే యత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు.

07/13/2018 - 01:50

విజయవాడ, జూలై 12: రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో గతంలో కన్నా పోరాటం మరింత ఉద్ధృతంగా చేయాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలతో గురువారం రాత్రి ఆయన చర్చించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ కేంద్రంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీవ్రతరం చేయాలన్నారు.

07/13/2018 - 01:48

విజయవాడ, జూలై 12: తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రిని చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల ఎద్దేవా చేశారు. ఉండవల్లిలో గురువారం జరిగిన టీడీపీ వర్కుషాపులో ఆయన మాట్లాడుతూ ఏదోరకంగా టీడీపీని దెబ్బతీయాలని ఆనాడు కాంగ్రెస్ పని చేసిందని, ఇప్పుడు బీజేపీ అదే పని చేస్తోందని ఆరోపించారు.

07/13/2018 - 01:45

విజయవాడ, జూలై 12: సమష్టిగా పని చేస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు సహకరిస్తున్నారని, భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో పని చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్‌లో మొదటి స్థానం దక్కడంపై కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రిని కలిసి అభినందించారు.

07/13/2018 - 01:43

విజయవాడ, జూలై 12: నాలుగేళ్ల కళాశాల చదువు ఆ తరువాత నలభై ఏళ్ల కెరీర్‌కు ఏ విధంగా ఉపకరిస్తుందో మేధోమథనం చేసి ప్రభుత్వానికి తగు సూచనలు ఇవ్వాలని వివిధ వర్సిటీల వైస్‌చాన్సలర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలోని వివిధ వర్సిటీల వీసీలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏపీని వైజ్ఞానిక కేంద్రంగా తీర్చిదిద్దే కృషిలో భాగస్వాములు కావాలన్నారు.

07/13/2018 - 01:42

విజయవాడ, జూలై 12: రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులకు వర్తిస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం కాల పరిమితిని డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో నెం 291ను గురువారం జారీ చేసింది.

07/13/2018 - 01:42

విజయవాడ, జూలై 12: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ (తెలుగు డెవలప్‌మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులనిచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి తెలుగు భాషోద్యమ సంస్థ అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్‌బాబు ధన్యవాదాలు తెలిపారు.

Pages