S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/11/2018 - 02:01

కర్నూలు, జూలై 10: భారతీయ జనతా పార్టీ నేడు అమిత్ షా, నరేంద్ర మోదీల కారణంగా భారతీయ జగన్ పవన్ పార్టీగా మారిందని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ప్రజలనుద్ధేశించి మాట్లాడారు.

07/11/2018 - 01:59

అమరావతి, జూలై 10: ప్రజాప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు నాటకాన్ని కట్టిపెట్టాలని గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు హెచ్చరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో థర్డ్‌ఫ్రంట్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.

07/10/2018 - 23:45

విజయవాడ, జూలై 10: రేషన్ కార్డుపై రెండు కిలోల కందిపప్పు సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రచారానికే పరిమితం అవుతోంది. డబ్బు చెల్లించి, గోదాముల నుంచి కందిపప్పు తరలించేందుకు రేషన్ డీలర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రేషన్ దుకాణాల్లో కందిపప్పు కనిపించని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ నుంచి రేషన్ కార్డులపై కందిపప్పు పంపిణీ చేస్తున్నప్పటికీ, ఇండెంట్ శాతం సగటున 20కి మించకపోవడం గమనార్హం.

07/10/2018 - 23:44

విజయవాడ, జూలై 10: కోటప్పకొండలో డిసెంబర్‌లో మూడు రోజుల పాటు హిల్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని అసెంబ్లీ ఆవరణలో ఆయన అటవీ, పర్యాటక, దేవదాయ శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

07/10/2018 - 23:43

పాలకొండ, జూలై 10: కొండకోనల్లో జీవించే గిరిజనులే సమాజాభివృద్ధికి కొండంత బలమని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజనులు, ఐటీడీఏ ఉద్యోగులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. మైదాన ప్రాంతంతో పాటు ఏజెన్సీలో కూడా అనేకమైన సహజ వనరులున్నాయని వాటిని గిరిజనులకు ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

07/10/2018 - 23:43

తిరుపతి, జూలై 10: ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా అధికారంలో ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశం లేదని, అవసరమైతే మరోమారు అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు యోచిస్తామని టీడీపీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ వెల్లడించారు.

07/10/2018 - 23:42

విజయవాడ, జూలై 10: రాష్ట్ర రాజధాని విజయవాడ నగరానికి చెందిన నిమ్మగడ్డ వెంకట కృష్ణారావు ‘కాస్ట్ అండ్ ఎకౌంట్ మేనేజ్‌మెంట్‌‘ (సీఎంఏ) ఫైనల్ పరీక్షలో జాతీయ స్థాయిలో 38వ ర్యాంక్ సాధించాడు. ఆయన తండ్రి భానుప్రసాద్ ప్రస్తుతం ఇంజనీర్‌గా సేవలందిస్తున్నారు. తాత దివంగత వెంకట కృష్ణారావు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు.

07/10/2018 - 23:42

అమరావతి, జూలై 10: రాష్ట్ర ప్రభుత్వంచే 11వ వేతన సవరణ సంఘం కమిషనర్‌గా నియమితులైన అశుతోష్ మిశ్రా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

07/10/2018 - 23:41

అమరావతి, జూలై 10: రాజధాని తుళ్లూరు- అనంతవరం మధ్యగల ఈ-7 రహదారిలో కేటాయించిన 15 ఎకరాల స్థలంలో వచ్చే ఆరునెలల కాలంలో శాటిలైట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు బసవరామతారకం కేన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు వివరించారు. మంగళవారం విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో ప్రతినిధులు సమావేశమై పలు ప్రతిపాదనలు చేశారు. శాటిలైట్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన రోడ్డు, విద్యుత్, నీటి వసతుల కల్పనపై చర్చించారు.

07/10/2018 - 23:40

విజయవాడ, జూలై 10: రాష్ట్రంలో విశాఖ సహా 9 నగరాల్లో కాంప్రెహెన్సిల్ మొబిలిటీ ప్లాన్ తయారీని పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ప్రభుత్వం మంగళవారం నియమించింది. మానిటరింగ్ కమ్ అడ్వయిజరీ కమిటీగా దీనిని వ్యవహరిస్తారు. మొబిలిటీ ప్లాన్ తయారీని పర్యవేక్షించేందుకు వీలుగా నియమించిన కమిటీకి పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

Pages