S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/19/2018 - 00:08

మంగళగిరి, మే 18: పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లి సమీపంలో గోదావరిలో లాంచీ మునక దుర్ఘటన ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా మాదిరిగా బోటు మాఫియా తయారైందన్నారు.

05/19/2018 - 03:40

విజయవాడ, మే 18: నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలను మహానాడు వేదికగా ఎండగట్టాలని టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మహానాడు ద్వారా ప్రజలకు భరోసా ఇవ్వాలన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో మహానాడు ఏర్పాట్లపై సీఎం శుక్రవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల అభివృద్ధిని సమీక్షించాలని పేదల సంక్షేమాన్ని వివరించాలని తెలిపారు.

05/19/2018 - 00:07

విజయవాడ, మే 18: రాష్ట్రంలో అవినీతి తగ్గిందని సీఎంఎస్ సంస్థ నివేదిక ఇచ్చిందంటూ అధికారుల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. జూన్ నెలలో కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు జారీచేయనున్నట్లు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్‌లో పౌరసరఫరాల శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

05/19/2018 - 00:06

విజయవాడ, మే 18: ప్రఖ్యాత కథా రచయిత పెద్ద్భిట్ల సుబ్బరామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. 40ఏళ్ల పాటు అధ్యాపకుడిగా పనిచేస్తూనే సాహితీ రంగంలో తనదైన ముద్రతో శిఖరాగ్ర స్థాయికి ఎదిగారని, తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొంది తెలుగువారికి గర్వకారణంగా నిలిచారని సీఎం శ్లాఘించారు.

05/19/2018 - 00:04

విజయవాడ, మే 18: ఒక్క కలం పోటుతో కర్నాటక గవర్నర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని, భారత రాజ్యాంగాన్ని పట్టపగలు హత్యచేశారని, ప్రజాస్వామ్యవాదులు అంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ఉన్న గవర్నర్, బీజేపీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో యనమల ఆరోపించారు.

05/19/2018 - 00:03

విజయవాడ, మే 18: విద్యార్థుల కోరిక మేరకు నెలనెలా, మూడు నెలలకోసారి బస్‌స్టేషన్‌ల చుట్టూ తిరగకుండా ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచే వార్షిక బస్సు పాస్‌లు జారీ చేసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. సంస్థ నూతన చైర్మన్ వర్ల రామయ్య, ఎండీ సురేంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

05/19/2018 - 00:03

విజయవాడ, మే 18: రాష్ట్రంలో జల రవాణా కోసం ప్రత్యేక రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించిన విధి విధానాలను తక్షణమే రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో బోటు ప్రమాదాల నివారణపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న బోటు ప్రమాదాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

05/19/2018 - 00:02

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 18: డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకై నిర్వహించే డీసెట్ పరీక్షకు మొత్తం 52,935 మంది హాజరైనట్లు డీసెట్ కన్వీనర్ పి పార్వతి శుక్రవారం తెలిపారు. డీసెట్ పరీక్షలను 17, 18 తేదీల్లో ఆన్‌లైన్ నిర్వహించామని, విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.

05/19/2018 - 00:01

విజయవాడ, మే 18: కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఎన్నిక కావడాన్ని ఓర్వలేక విపక్షాలు అడ్డుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి ఆరోపించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నాటకలో బీజేపీ గెలుపును జీర్ణించుకోలేక వ్యతిరేక శక్తులు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.

05/18/2018 - 23:35

విజయవాడ, మే 18: అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నర్సరీ, రహదారి అభివృద్ధి పనుల పురోగతిని శనివారం ఉదయం తాను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. తనతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర ప్రభుత్వ ముఖ్యలు ఈ పర్యటనలో పాల్గొంటారని ఆయన తెలిపారు. వెలగపూడి సచివాలయంలో సీఆర్‌డీఏపై జరిగిన సమీక్షలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

Pages