S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/19/2016 - 05:11

సింహాచలం, ఏప్రిల్ 18: శతాబ్ధాల చరిత్ర గల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆనువంశిక ధర్మకర్తగా కేంద్రమంత్రి అశోక గజపతిరాజు సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ ఆస్థాన మండపంలో దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ అశోక గజపతిరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారు.

04/18/2016 - 18:15

హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాలను అనుసంధానం చేస్తూ ఎపి ప్రభుత్వం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టుపై దాఖలైన ఓ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తిరస్కరించింది. టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ప్రాజెక్టు పూర్తయ్యాక కోర్టుకు రావడం ఎందుకని న్యాయస్థానం పిటిషనర్‌ను ప్రశ్నించింది.

04/18/2016 - 18:14

విశాఖ: విభజన చట్టంలో ఎపికి ప్రత్యేక రైల్వే జోన్ గురించి ప్రస్తావన ఉన్నప్పటికీ, ఆ విషయమై కేంద్రాన్ని నిలదీసే దమ్ము ఎపి ప్రభుత్వానికి లేదని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈరోజు ఇక్కడ మీడియాతో అన్నారు. రైల్వేజోన్ ఏర్పాటయ్యేంతవరకూ తమ పార్టీ ఉద్యమిస్తుందన్నారు.

04/18/2016 - 18:14

విజయవాడ: ప్రస్తుత వేసవిలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా మజ్జిగ అందజేయాలని ఎపి సర్కారు నిర్ణయించింది. ఈరోజు ఇక్కడ జరిగిన మంత్రిమండలి సమావేశంలో వేసవిలో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. మూలపడ్డ నీటి సరఫరా పథకాలకు 200 కోట్లు ఖర్చుచేయాలని నిర్ణయించారు. వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

04/18/2016 - 18:13

విశాఖ: విధుల నుంచి తమను తొలగించినందుకు నిరసనగా విశాఖలో ముగ్గురు టాక్సీ డ్రైవర్లు సోమవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఉబెర్ క్యాబ్స్ సంస్థలో పనిచేస్తున్న తమను తొలగించి కొత్తవారిని తీసుకోవడం అన్యాయమని వీరు అంటున్నారు. ముగ్గురు డ్రైవర్లు ఆత్మహత్యకు యత్నించడంతో స్థానిక రాంనగర్‌లో కలకలం మొదలైంది.

04/18/2016 - 18:12

విజయవాడ: తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఇక్కడ ఆ పార్టీ అధినేత, సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఎపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, వైకాపా నుంచి వలసలు తదితర అంశాలపై చర్చించారని సమాచారం.

04/18/2016 - 16:32

కర్నూలు: శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఇంజనీరింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు సోమవారం తనిఖీలు ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులను వారు పరిశీలిస్తున్నారు.

04/18/2016 - 16:32

విజయవాడ: దళితుల అభివృద్ధి కోసం రాష్టవ్య్రాప్తంగా పర్యటించి ప్రభుత్వానికి సూచనలు చేస్తానని, ఈ వర్గాలపై దాడుల్ని అరికట్టేందుకు కృషి చేస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. పేదవర్గాలకు నీడ కల్పించేందుకు అంబేద్కర్ జయంతి నాడు గృహనిర్మాణ పథకాలను సిఎం చంద్రబాబు ప్రారంభించడం హర్షణీయమన్నారు.

04/18/2016 - 16:31

విశాఖ: మామిడికాయలను రాత్రికిరాత్రి మగ్గబెట్టేందుకు కార్బయిడ్ వాడితే చట్టప్రకారం చర్యలు తప్పవని ఆహార భద్రత అధికారులు హెచ్చరించారు. విశాఖలోని పూర్ణామార్కెట్, జ్ఞానాపురం, ఎంవిపి కాలనీ తదితర ప్రాంతాల్లోని పండ్లమార్కెట్లను అధికారులు సోమవారం ఉదయం తనిఖీ చేసి మామిడిపండ్లను సేకరించారు. కృత్రిమంగా మగ్గపెట్టిన పండ్ల విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

04/18/2016 - 16:31

విజయనగరం: బొబ్బిలి వైకాపా ఎమ్మెల్యే సుజయకృష్ణ, ఆయన సోదరుడు బేబీనాయన ఈ నెల 20న విజయవాడలో సిఎం చంద్రబాబు సమక్షీంలో టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా టిడిపి నాయకత్వం భారీగా సన్నాహాలు చేస్తోంది. బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన టిడిపి నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

Pages