S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/30/2018 - 00:42

విశాఖపట్నం, ఏప్రిల్ 29: రాష్ట్రంలో అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు వైసీపీలోకి వచ్చేందుకు తమతో చర్చలు జరుపుతున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెల్లడించారు. విశాఖలో సోమవారం జరగనున్న వంచన దీక్ష ఏర్పాట్లను పరిశీలించడానికి ఆదివారం ఇక్కడికి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, హోదా కోసం నాలుగేళ్ళ నుంచి వైసీపీ ఒక్కటే పోరాడుతోందని అన్నారు.

04/30/2018 - 00:40

విజయవాడ, ఏప్రిల్ 29: ఓటమి భయంతో 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గాన్ని వదలి కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కుంటున్నాడని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

04/30/2018 - 00:38

కర్నూలు, ఏప్రిల్ 29: రాష్ట్ర వ్యాప్తంగా ‘అన్న క్యాంటీన్’ పేరుతో అతి తక్కువ ధరలకే భోజనం, అల్పాహారాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే క్యాంటీన్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించే ప్రక్రియ పూర్తి కాగా ఆయా స్థలాల్లో క్యాంటీన్ల నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

04/30/2018 - 00:36

విజయవాడ, ఏప్రిల్ 29: రాష్ట్రంలోని లక్షలాది మంది పింఛన్‌దారులు తమ దైనందిన జీవితంలో ఏదోఒక కార్డు పోగొట్టుకోవటం సహజం. అయితే కార్డులు పోయిన సమయంలో ఏంచేయాలో అర్థంకాక చాలామంది పింఛన్‌దారులు ఆందోళన చెందుతుంటారు. ఏ కార్డు పోయినా కంగారుపడాల్సిన అవసరం లేదని పెన్షన్‌దారుల చర్చావేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర వీరయ్య చెప్పారు.

04/30/2018 - 04:05

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, ఢిల్లీ తరహా రాజధాని నిర్మాణం చేస్తామని నాడు ప్రధాని మోదీ ఇచ్చిన హామీకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని అయితే తిరుపతి ఎన్నికల సభలో ప్రత్యేక హోదా ఇస్తామని నాడు నరేంద్రమోదీ ప్రకటన చేయలేదని అయితే వెంకన్న సాక్షిగా ప్రకటన చేసినట్లుగా సీ ఎం చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదారి పట్టించేలా చేస్తున్న ప్రకటనలను మానుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీలు సోమువీర్రాజు, మాధవ

04/30/2018 - 00:33

విశాఖపట్నం, ఏప్రిల్ 28: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ డిమాండ్‌పై వచ్చేనెల మూడో తేదీన నగరంలో నాన్-పొలిటికల్ జేఏసీ సమావేశం ఉంటుందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఆర్‌కె బీచ్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి రాష్టమ్రంత్రి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.

04/28/2018 - 04:19

విజయవాడ(బెంజిసర్కిల్), ఏప్రిల్ 27: తన జీవితాంతం సినిమాలను మాత్రమే చేస్తానని రాజకీయాల వైపు అసలు చూడబోనని సూపర్‌స్టార్ మహేష్ బాబు స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకి విజయవాడ నగరం ఎంతో సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని గుర్తు చేసిన ఆయన ఇక నుండి తన ప్రతీ సినిమా కోసం ఇక్కడకు తప్పకుండా వస్తానని ప్రకటించారు.

04/28/2018 - 03:18

విజయవాడ, ఏప్రిల్ 27: కూర్చోటానికి కుర్చీ లేదు... రాజధాని లేదు... ఒక కార్యాలయం లేదు... ఇలాంటి పరిస్థితుల్లో తన అనుభవాన్ని అంతటినీ రంగరించి కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను గత నాలుగేళ్లుగా ప్రగతిపథంలో నడిపేందుకు అహర్నిశలు పాటుపడ్డానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఉద్వేగంతో చెప్పారు.

04/28/2018 - 03:25

విజయవాడ, ఏప్రిల్ 27: తెలుగుదేశం పార్టీ ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర ముగిసి ఐదేళ్లు అయిన సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడుకు తెలుగుదేశం పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. పాదయాత్రలో వెన్నంటి ఉండి ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ గరికిపాటి రాంమ్మోహనరావును సీఎం చంద్రబాబు నాయుడు సన్మానించారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కోసం విశేష కృషి చేసిన గరికిపాటిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

04/28/2018 - 02:54

కర్నూలు, ఏప్రిల్ 27: రాష్ట్రంలోకి రుతుపవనాల ప్రవేశం జూన్ 7 నుంచి 10వ తేదీ మధ్యలో ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు అండమాన్ తీరాన్ని మే చివరి వారంలో తాకుతాయని, ఆ తరువాత వారం రోజుల్లో కేరళ, 15 రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశిస్తాయని వారు పేర్కొంటున్నారు. రుతుపవనాల ప్రవేశం ఈ ఏడాది సకాలంలోనే ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

Pages