S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/28/2018 - 02:53

తిరుపతి, ఏప్రిల్ 27: టీటీడీలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారని పార్లమెంటరీ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ టీ సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని శుక్రవారం ఉదయం ఆయన దర్శించుకున్నారు.

04/26/2018 - 04:32

విశాఖపట్నం, ఏప్రిల్ 25: రిజర్వేషన్ పోరుకు మరో కుల సంఘం గళమెత్తుతోంది. మొన్నటి వరకూ కాపులను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలంటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడగా, ప్రభుత్వం కమిటీ వేసి కాపులను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. ఆపై మత్స్యకారులను ఏస్టీల్లో చేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార సంఘాలు దాదాపు రెండు నెలల పాటు ఉద్యమించాయి.

04/26/2018 - 04:32

విజయవాడ /నంద్యాల, ఏప్రిల్ 25: ఆళ్లగడ్డ పంచాయతీ మళ్లీ వాయిదా పడింది. బుధవారం సీఎం సమక్షంలో మంత్రి అఖిల ప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తమ వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే మంత్రి అఖిల ప్రియ రాజధానికి వెళ్లకపోవడంతో సమావేశం గురువారానికి వాయిదా పడినట్లు సమాచారం.

04/26/2018 - 04:31

గుంటూరు, ఏప్రిల్ 25: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆయన మధ్యాహ్నం 2గంటలకు తన అనుచరులు, సన్నిహితులు, వేలాది మంది కార్యకర్తలతో కృష్ణా జిల్లా ఉంగుటూరు వద్ద ప్రతిపక్ష, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని కలుసుకుని పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

04/26/2018 - 04:31

తిరుపతి, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించాలని, ఇందుకోసం పెద్దఎత్తున పోరాటాలను చేపట్టాలని, పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, ఆప్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి పిలుపునిచ్చారు.

04/26/2018 - 04:30

మారేడుమిల్లి, ఏప్రిల్ 25: తోటలో జీడి గింజలు సేకరించడానికి వెళ్లిన గిరిజనుడిపై ఎలుగుబంటి దాడిచేసి, తీవ్రంగా గాయపరిచింది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి గ్రామం ధారవాడలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మారేడుమిల్లి మండలం ధారవాడ గ్రామానికి చెందిన పల్లాల సోమిరెడ్డి (35) బుధవారం ఉదయం తన తోటలో జీడిమామిడి గింజలు సేకరించడానికి వెళ్లాడు.

04/26/2018 - 04:29

విజయవాడ, ఏప్రిల్ 25: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు కానున్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్) నిర్మాణ పనుల పురోగతి వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు.

04/26/2018 - 04:29

అనంతపురం, ఏప్రిల్ 25: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్.నరసింహన్ బతకనేర్చిన వ్యక్తి అంటూ అనంతపురం ఎంపీ జేసీ.దివాకర్ర్రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం అనంతపురంలోని తన కార్యాలయంలో విలేఖరులతో జేసీ మాట్లాడుతూ గతంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో నరసింహన్ సన్నిహితంగా మెలిగారన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రధాని మోదీకి దగ్గరయ్యారన్నారు.

04/26/2018 - 02:53

విజయవాడ, ఏప్రిల్ 25: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ సమక్షంలో రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈమేరకు మెప్మా ఎండీ చినతాతయ్య సంబంధిత సంస్థలతో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇందులో ఒకటి మహిళల ఆరోగ్యానికి, రెండోది మహిళల ఆర్థిక స్వావలంబనకు సంబంధించినవి.

04/26/2018 - 02:51

విజయవాడ, ఏప్రిల్ 25: అమరావతిలో వివిధ సంస్థల్లో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ఇతరుల కోసం రూ. 494 కోట్ల వ్యయంతో 1000 అపార్ట్‌మెంట్లు నిర్మించనున్నామని, వాటిని వేలం ద్వారా విక్రయించనున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పీ నారాయణ వెల్లడించారు. ఈ అపార్ట్‌మెంట్లను మూడు కేటగిరీల్లో నిర్మించనున్నామన్నారు. రాష్ట్రంలో 71 మున్సిపార్టీల్లో 203 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడించారు.

Pages