S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/25/2018 - 03:21

విజయవాడ, ఏప్రిల్ 24: ఎన్నికలకు ముందు తిరుపతి సభలో నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు ప్రజలకు గుర్తొచ్చేలా తిరుపతి బహిరంగ సభను నిర్వహించాలని చిత్తూరు జిల్లా టీడీపీ నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తిరుపతి సభకు పోటీగానే విశాఖలో వైకాపా సభ నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు మృతితో ఏర్పడిన ఎమ్మెల్సీ స్థానం భర్తీలో గాలి కుటుంబానికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

04/25/2018 - 03:20

విజయవాడ, ఏప్రిల్ 24: మద్యం వ్యాపారులు ఆందోళనకు సమాయత్తమవుతున్నారు. మద్యం అమ్మకాలపై 20 శాతం ఉన్న కమీషన్ (మార్జిన్ మనీ)ను 10 శాతానికి తగ్గించటం తమకు గిట్టుబాటు కావటం లేదని, దీనిని కనీసం 16 శాతానికి పెంచాలనే ఏకైక డిమాండ్‌పై మద్యం వ్యాపారులు బుధవారం నుంచి డిపోల నుంచి మద్యం కొనుగోళ్లను నిలిపివేయనున్నారు. తమ వద్దఉన్న సరుకు అమ్ముడుపోయిన తర్వాత దుకాణాలను మూసివేయనున్నారు.

04/25/2018 - 03:19

గుంటూరు, ఏప్రిల్ 24: భారతీయ జనతా పార్టీకి సీనియర్ నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కు మంగళవారం తన రాజీనామా లేఖను పంపినట్లు విశ్వసనీయ సమాచారం. గత కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో కన్నా తన అనుచరులు, సన్నిహితులు, కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు.

04/25/2018 - 03:18

కడప, ఏప్రిల్ 24: ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో పనిచేస్తున్న ఎన్‌జివోలు రోడ్డెక్కి ఉద్యమం చేసే పరిస్థితి లేదనీ ఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా ఉద్యమం చేపట్టాయని, అయితే ప్రజల్లో ఉద్యమం పట్ల విశ్వసనీయత కలిగించకలేకపోతున్నాయని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రత్యేకహోదా ఏ రాజకీయపార్టీ తెస్తుందో తేల్చిచెప్పాలని ఆయన అన్నారు.

04/25/2018 - 03:18

అనపర్తి, ఏప్రిల్ 24: సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రోత్సాహంతోనే చిన్న వయసులోనే మంత్రినయ్యానని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మండపేట నియోజకవర్గంలోని ద్వారపూడిలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడారు.

04/25/2018 - 03:17

విజయవాడ, ఏప్రిల్ 24: రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో సంయుక్తంగా రూ.1600 కోట్లతో ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకం చేపట్టనున్నామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.

04/25/2018 - 03:17

విజయవాడ, ఏప్రిల్ 24: రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) పరిధిలోకి రాష్ట్రంలోని రైతులందరూ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

04/25/2018 - 03:16

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 24: రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రముఖ ఆలయ నాట్యాచార్యుడు సప్పా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం శాస్ర్తియ నృత్య నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆనం కళాకేంద్రంవద్ద 208 మంది శాస్ర్తియ నృత్యాన్ని ప్రదర్శించి, రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేశారు.

04/25/2018 - 03:14

తిరుపతి, ఏప్రిల్ 24: టీటీడీ ముఖ్య భద్రత, నిఘా అధికారి (సీవీఎస్‌ఓ) ఆకే రవికృష్ణను కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డీజీగా బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తిరుమల చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఆకె రవికృష్ణ 2017, జూలై 3న బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీటీడీ భద్రతా వ్యవస్థలో వినూత్నమైన మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా భద్రతా వ్యవస్థను పటిష్టం చేసే చర్యలకు శ్రీకారం చుట్టారు.

04/25/2018 - 03:13

విజయవాడ, ఏప్రిల్ 24: అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17తేదీ నుంచి సమ్మె చేస్తున్న సంచార చికిత్స (104) కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇక తమ సమ్మెను ఉద్ధృతం చేయాలని మంగళవారం విజయవాడలో జరిగిన యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సమ్మెలో 277 వాహనాలకు గాను 250 వాహనాల్లోని ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు.

Pages