S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/22/2019 - 00:26

విజయవాడ, జనవరి 21: పెథాయ్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని టన్నుకు 1550 రూపాయల చొప్పున పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

01/21/2019 - 23:45

ముంబయి, జనవరి 21: భారత స్టాక్ మార్కెట్ ఈవారం లాభాలతో మొదలైంది. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయిలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), ఇన్ఫోసిస్ వంటి భారీ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించడంతో, స్టాక్ మార్కెట్ పుంజుకుంది.

01/21/2019 - 23:43

ముంబయలో సోమవారం ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన
ఆటల పోటీల్లో గెలుపొందిన చిన్నారులతో భారత జాతీయ బాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్

01/21/2019 - 23:41

న్యూఢిల్లీ, జనవరి 21: బులియన్ మార్కె ట్ సోమవారం సానుకూల ధోరణులతో కొనసాగింది. ఆభరణాల తయారీదారులతోపాటు సంస్థాగత పెట్టుబడిదారులు కూడా ఆసక్తిని ప్రదర్శించడంతో, జాతీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 40 రూపాయలు పెరిగి 33,200 రూపాయలకు చేరింది. ఉదయం 33,160 రూపాయల వద్ద మొదలైన బులియన్ మార్కెట్ ట్రేడింగ్ నింపాదిగా ముందుకు సాగింది.

01/21/2019 - 23:41

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,188.00
8 గ్రాములు: రూ.25,504.00
10 గ్రాములు: రూ. 31,880.00
100 గ్రాములు: రూ.3,18,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,409.626
8 గ్రాములు: రూ. 27,277.008
10 గ్రాములు: రూ. 34,096.26
100 గ్రాములు: రూ. 3,40,962.6
వెండి
8 గ్రాములు: రూ. 330.40

01/21/2019 - 23:40

న్యూఢిల్లీ, జనవరి 21: సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా రాకేష్ శర్మను కొనసాగించాలని ఐడీబీఐ పాలక మండలి సోమవారం తీర్మానించింది. ఎల్‌ఐసీకి అనుబంధ సంస్థగా ఐడీబీఐ మారిపోయిన విషయం తెలిసిందే. ఐడీబీఐలో 51 శాతం వాటాలను కొనుగోలు ప్రక్రియను ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్‌ఐసీ ఇటీవలే పూర్తి చేసింది.

01/21/2019 - 23:40

న్యూఢిల్లీ, జనవరి 21: ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 153.21 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1,249.85 కోట్ల రూపాయలు నష్టపోయిన యూనియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో బలపడింది. కాగా, గత ఏడాది మూడో త్రైమాసికంలో బ్యాంక్ 9,133.58 కోట్ల రూపాయల నికర లాభాన్ని సంపాదించింది.

01/21/2019 - 23:39

బెంగళూరులో సోమవారం యాంటీ లాక్ బ్రేకింగ్ (ఎబీఎస్) విధానంతో ఉత్పత్తి చేసిన ఎఫ్‌జెడ్-ఎఫ్1,
ఎఫ్‌జెడ్‌ఎస్-ఎఫ్1 తరహా బైక్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసిన తర్వాత ఫొటోలకు ఫోజులిస్తున్న
యమహా మోటార్ ఇండియా చైర్మన్ మొటొఫుమీ షితారా

01/21/2019 - 23:37

న్యూఢిల్లీ, జనవరి 21: సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ వాటాలను తిరిగి కొనేందుకు అంగీకరించాలంటూ ఎల్ అండ్ టీ చేసిన ప్రతిపాదనను భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ బోర్డు ‘సెబీ’ తిరస్కరించింది.

01/21/2019 - 04:30

న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకొని, ఆతర్వాత ఉద్దేశపూర్వకంగానే వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారస్థుడు నీరవ్ మోదీ వ్యవహారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి తలనొప్పి వ్యవహారంగా మారింది. బ్యాంకులో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ ధోరణులను అరికట్టలేకపోయారన్న ఆరోపణలను బ్యాంకుకు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)లపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది.

Pages