S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/09/2015 - 06:24

హైదరాబాద్, డిసెంబర్ 8: కాయలు.. పండ్లుగా మగ్గేందుకు ఎథిలిన్ చాంబర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మంగళవారం హైకోర్టుకు తెలిపాయి. పండ్లుగా మార్చేందుకు వ్యాపారులు ఆరోగ్యానికి హానికరమైన కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకుని ఈ అంశాన్ని హైకోర్టు విచారించింది.

12/09/2015 - 06:23

ముంబయి, డిసెంబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. వరుసగా నష్టాలపాలవడం ఇది ఐదోరోజవగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ మూడు నెలల కనిష్ట స్థాయికి పతనమైంది. పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తదితర బిల్లుల ఆమోదంపై నెలకొన్న ఆందోళనలు మార్కెట్‌ను కుంగదీశాయి.

12/09/2015 - 06:22

విశాఖపట్నం, డిసెంబర్ 8: శాస్త్ర విజ్ఞానం సమాజానికి ఉపయోగపడాలని డిఆర్‌డిఒ మాజీ డెరెక్టర్ జనరల్ వికే ఆత్రే అన్నారు. నిన్నమొన్నటి వరకు ఏ చిన్న విషయానికైనా ఆసుపత్రులకు పరుగులు తీసేవారమని, ఇక నుంచి మన ఆరోగ్యం ఎలా ఉందన్నదీ మన రిస్ట్ వాచీలతో తెలుసుకునే సదుపాయం కలగనుందన్నారు.

12/09/2015 - 06:21

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం నూతన రుణ హామీ పథకాన్ని తీసుకురానున్నట్లు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి అరవింద కుమార్ తెలిపారు. మంగళవారం ఇక్కడ ఈసిజిసి సంస్థ ఏర్పాటు చేసిన బీమా అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

12/08/2015 - 17:08

ముంబయి : స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 25,310 వద్ద అదేవిధంగా నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 7,702 సూచీ వద్ద ముగిశాయి.

12/08/2015 - 04:43

విశాఖపట్నం, డిసెంబర్ 7: విశాఖ సాగర తీరంలో బీచ్ కోత నివారణకు విశాఖ పోర్టుట్రస్ట్ సరికొత్త చర్యలు చేపట్టింది. నిన్న, మొన్నటివరకు కోతకు గురైన ప్రాంతాల్లో మట్టిని ఫిల్లింగ్ చేసేవారు. అలలు ఉద్ధృతంగా వచ్చినపుడు మట్టి తిరిగి సముద్రంలోకి కొట్టుకుపోయేది. దీని వల్ల ప్రయోజనం లేదని భావించిన అధికారులు శాశ్వత పరిష్కారానికి చెన్నైకి చెందిన ఎన్‌ఐఒటి నిపుణుల బృందంతో సర్వే జరిపించారు.

12/08/2015 - 04:42

అకాల వర్షాలతో అంచనాలు తారుమారు
దెబ్బతిన్న ఖరీఫ్‌తో ఇంకా మొదలుకాని రబీ
బక్కచిక్కిన గోదావరి నదీ ప్రవాహం
ఒడిశా నుండి నీటి విడుదలకు లభించని హమీ?

12/08/2015 - 04:42

వచ్చే ఏడాది కూడా తప్పని పప్పు ధాన్యాల కొరత
కంది, మినుము పంటలను దెబ్బతీసిన అకాల వర్షాలు
ఆందోళన వ్యక్తం చేస్తున్న వ్యాపార వర్గాలు

12/08/2015 - 04:41

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం సోమవారం బోనస్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. బోనస్ కోసం ఉద్యోగి వేతన సీలింగ్‌ను ప్రస్తుతమున్న 10,000 రూపాయల నుంచి 21,000 రూపాయలకు పెంచడంతోపాటు నెలసరి బోనస్ గణన సీలింగ్‌ను ప్రస్తుతమున్న 3,500 రూపాయల నుంచి 7,000 రూపాయలకు పెంచాలనే ప్రతిపాదనలతో ఈ బిల్లు లోక్‌సభకు వచ్చింది.

12/08/2015 - 04:40

అయనా.. స్థిరమైన ఔట్‌లుక్‌ను ప్రకటించిన ఫిచ్

Pages