S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/01/2015 - 07:01

న్యూఢిల్లీ, నవంబర్ 30: భారత వౌలిక రంగం పనితీరు ఈ ఏడాది అక్టోబర్ నెలలో 3.2 శాతంగా నమోదైంది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఇది 9 శాతంగా ఉండటం గమనార్హం. ముడి చమురు, ఉక్కు, బొగ్గు, ఎరువులు, సిమెంట్, విద్యుత్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులను కీలక రంగాలుగా పరిగణిస్తుండగా, దేశ జిడిపిలో వీటి వాటా దాదాపు 38 శాతంగా ఉంది.

12/01/2015 - 07:00

న్యూఢిల్లీ, నవంబర్ 30: భారత జిడిపి వృద్ధిరేటు ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7.4 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో ఇది 7 శాతంగా నమోదైంది. తాజా గణాంకాలతో ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటుతో దూసుకెళ్తున్న పొరుగు దేశం చైనాను భారత్ అధిగమించినట్లైంది. ఈ జూలై-సెప్టెంబర్‌లో చైనా వృద్ధిరేటు 6.9 శాతానికే పరిమితమవడం గమనార్హం. కాగా, తయారీ, గనులు, సేవా రంగాల్లో వృద్ధిరేటు పుంజుకుంది.

12/01/2015 - 07:00

న్యూఢిల్లీ, నవంబర్ 30: కేంద్ర ప్రభుత్వం సోమవారం బంగారం, వెండిపై దిగుమతుల టారిఫ్ విలువను తగ్గించింది. 10 గ్రాముల బంగారంపై 344 డాలర్లుగా, కిలో వెండిపై 461 డాలర్లుగా ఈ దిగుమతి టారిఫ్ విలువను నిర్ణయించింది. ఇంతకుముందు 10 గ్రాముల బంగారంపై 354 డాలర్లుగా, కిలో వెండిపై 470 డాలర్లుగా ఈ దిగుమతి టారిఫ్ విలువ ఉండేది.

12/01/2015 - 07:03

లాభాల్లో సెన్‌సెక్స్, నష్టాల్లో నిఫ్టీ

12/01/2015 - 06:56

న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశవ్యాప్తంగా ఉన్న నెస్లే ఉత్పాదక కేంద్రాల్లో నూడుల్స్ తయారీ పునఃప్రారంభమైంది. ఈ మేరకు నెస్లే ఇండియా సోమవారం ప్రకటించింది. మ్యాగీ నూడుల్స్‌లో ఆరోగ్యానికి హానికరం చేసేలా మోనోసోడియం గ్లూటమేట్, లెడ్ పదార్థాలు మోతాదుకు మించి ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ నిషేధం విధించినది తెలిసిందే.

12/01/2015 - 06:55

లక్నో, నవంబర్ 30: విద్యుత్ రంగ ఉద్యోగులు, ఇంజినీర్లు, కాంట్రాక్టు కార్మికులు డిసెంబర్ 8న దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. ఎలక్ట్రిసిటి సవరణ బిల్లు 2014కు వ్యతిరేకంగా ఈ ఒకరోజు సమ్మెకు దిగుతున్నట్లు అఖిల భారత విద్యుత్ ఇంజినీర్ల సమాఖ్య (ఎఐపిఇఎఫ్) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

11/30/2015 - 16:54

ముంబయి: దేశీయ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ స్వల్పంగా 17 పాయింట్లు లాభపడి 26,145 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ స్వల్పంగా 7.45 పాయింట్లు నష్టపోయి 7,935 పాయింట్ల వద్ద ముగిసింది.

11/30/2015 - 06:29

న్యూఢిల్లీ, నవంబర్ 29: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష, జూలై-సెప్టెంబర్ త్రైమాసిక జిడిపి గణాంకాలు ఈ వారం మార్కెట్ సరళిని శాసిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు సంబంధించిన పరిణామాలూ కీలకమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ మూడు అంశాలు ఈ వారం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని పేర్కొంటున్నారు.

11/30/2015 - 06:27

కడప, నవంబర్ 29: కడప జిల్లా పులివెందులలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ అధునాతన పశు పరిశోధనా కేంద్రాన్ని ఎనిమిదేళ్ల క్రితం ఏర్పాటు చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. అయతే ఇప్పుడిక్కడ పశు వ్యాక్సిన్ల తయారీకి రంగం సిద్ధమవుతోంది.

11/30/2015 - 06:26

న్యూఢిల్లీ, నవంబర్ 29: యోగా గురువు బాబా రామ్‌దేవ్ ప్రమోట్ చేస్తున్న ఎఫ్‌ఎమ్‌సిజి వెంచర్.. పతంజలి ఆయుర్వేద్ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు పిటిఐకి బాబా రామ్‌దేవ్ తెలిపారు. కాగా, 500 కోట్ల రూపాయలను ఇప్పటికే బ్యాంకులు మంజూరు చేశాయిని కూడా సంస్థ వర్గాలు తెలిపాయి.

Pages