S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/27/2020 - 22:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: భారత్‌కు మాత్రమే కరోనా వైరస్ ప్రభావం పరిమితం కాలేదు. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల సూచీలు కూడా పతనమవుతున్నాయి. గత మూడు రోజుల సూచీలను పరిశీలిస్తే, భారత్‌లో సెనె్సక్స్ వరుసగా 1.96 శాతం, 0.20 శాతం, 0.97 శాతం నష్టపోయింది. జపాన్ మార్కెట్ నిక్కీకి సోమవారం సెలువు దినంకాగా, ఆతర్వాతి రెండు రోజుల్లో 3.3 శాతం, 0.78 శాతం చొప్పున నష్టాలను చవిచూసింది.

02/27/2020 - 22:56

ముంబయి, ఫిబ్రవరి 27: చైనా నుంచి వివిధ దేశాలకు వ్యాపిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లపైనా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకూ 2,750 మంది మృతి చెందగా, ఇది సోకిన సుమారు 80,000 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వార్తల నేపథ్యంలో మదుపరులు భయాందోళనలకు గురికావడంతో, అంతర్జాతీయంగా మార్కెట్ సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

02/27/2020 - 23:55

కర్నూలు సిటీ: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి క్రయవిక్రయాలు నిలిపివేయడంతో ఉల్లి రైతులు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం మార్కెట్ యార్డులో అన్ని పంటల ఉత్పత్తులను ఈ నామ్ ద్వారా క్రయవిక్రయాలు జరుపుతున్నారు. ఉల్లి పంటను మాత్రం బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉల్లి ఉత్పత్తిని కూడా ఈనామ్ పద్దతిలో క్రయవిక్రయాలు చేపట్టాలని మార్కెట్ కమిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

02/27/2020 - 05:15

న్యూఢిల్లీ: సీఎన్‌జీ వాహనాల వాడకంలో ఢిల్లీ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి ఢిల్లీలో 10,76,461 సీఎన్‌జీ వాహనాలు ఉన్నాయి. తర్వాతి స్థానాన్ని 10,01,698 వాహనాలతో గుజరాత్, దాద్రా నగర్ హవేలీ సంపాదించాయి. మహారాష్ట్ర 9,97,401 సీఎన్‌జీ వాహనాలతో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

02/26/2020 - 23:41

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రకటన జారీ చేసినందుకు ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ లిమిటెడ్‌పై ‘సెబి’ జరిమాన విధించింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్‌సీడీ)కి సంబంధించి ఈ సంస్థ ఇస్తున్న ప్రకటనలు సాధారణ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉందని సెబి ఓ ప్రకటనలో పేర్కొంది.

02/26/2020 - 23:15

ముంబయి, ఫిబ్రవరి 26: ఇటీవల సుమారు ఆరు నెలల పాటు చెలరేగిన కార్చిచ్చు కారణంగా లక్షలాది వన్యప్రాణులు సజీవ దహనమైన నేపథ్యంలో ఆర్థికంగా అతలాకుతలమైన ఆస్ట్రేలియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కార్చిచ్చు కారణంగా దెబ్బతిన్న పర్యాటక రంగంపై ఇప్పుడు దృష్టి సారించింది. ఈ రంగంలో భారీ పెట్టుబడుల కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

02/26/2020 - 23:11

ముంబయి, ఫిబ్రవరి 26: ప్రాణాంతకమయిన కరోనా వైరస్ ప్రపంచ స్టాక్ మార్కెట్లను గడగడలాడిస్తున్న సమయంలో అందుకు అనుగుణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా బుధవారం నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెన్సెక్స్ వరుసగా నాలుగో సెషన్ బుధవారం 392 పాయింట్లు దిగజారింది.

02/26/2020 - 23:09

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: గత ఏడాది డిసెంబర్‌లో విదేశీ డిపాజిట్లు పెరిగాయి. అధికారిక గణాంకాల ప్రకారం నవంబర్‌లో 1,32,669 మిలియన్ డాలర్ల ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు వచ్చి చేరగా, డిసెంబర్‌లో ఆ మొత్తం 1,33,135 మిలియన్ డాలర్లుగా నమోదైంది. 2018 డిసెంబర్‌లో ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు 1,25,773 మిలియన్ డాలర్లు. గత ఏడాది జనవరిలో 1,25,204 మిలియన్ డాలర్లు చేరుకోగా, ఫిబ్రవరిలో మరికొంత పెరిగి, 1,25,599 డాలర్లకు చేరింది.

02/26/2020 - 23:08

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: సైబర్ నేరాలను అరికట్టడంతోపాటు పలు సమస్యల నివారణ కోసం ఐటీ చట్టంలో భారీ మార్పులు తీసుకువచ్చే ప్రతిపాదన ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 20 ఏళ్ల నాటి ఈ చట్టంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

02/26/2020 - 04:40

విశాఖపట్నం: ఎట్టకేలకు విశాఖ పారిశ్రామికవేత్తలు, సరకు ఉత్పత్తి, ఎగుమతిదార్ల కోరిక నెరవేరింది. విశాఖ నుంచి ప్రత్యేక సరకు రవాణా విమాన సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. విశాఖ నుంచి ప్రత్యేక సరకు రవాణా విమాన సర్వీసు నడపాలని స్థానికుల నుంచి ఎంతోకాలంగా డిమాండ్ ఉంది. రవాణా విమాన సర్వీసుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా స్పైస్‌జెట్ సంస్థ ముందుకు వచ్చింది.

Pages