S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/27/2018 - 00:03

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ప్రభుత్వం నుంచి రూ. 5,431 కోట్ల మూలధన సహాయాన్ని కోరనున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) బుధవారం తెలిపింది. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమయిన అన్ని రకాల సహాయం అందుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ భరోసా ఇచ్చిన మరుసటి రోజు పీఎన్‌బీ ఈ విషయం తెలిపింది. పీఎన్‌బీ బోర్డు సమావేశం గురువారం జరుగుతుంది.

09/26/2018 - 23:37

ముంబయిలో:
------------------
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి

09/26/2018 - 13:57

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు ప్రస్తుతం నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 266, నిఫ్టీ 61 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.73గా ఉంది.

09/26/2018 - 02:28

న్యూఢిల్లీ: బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టేవారిపై, అక్రమాలకు పాల్పడే వారిపై పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కఠిన వైఖరిని అవలంబించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ కోరారు. బ్యాంకుల పనితీరును ఆయన సమీక్షిస్తూ క్రమబద్ధీకరణమైన ఆర్థిక వ్యవస్థవల్ల 8 శాతం ఆర్థిక వృద్ధిరేటును సాధిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

09/26/2018 - 00:09

ముంబయి, సెప్టెంబర్ 25: వరుసగా అయిదు సెషన్ల పాటు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి బలపడ్డాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్ కీలక సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీలలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 347.04 పాయింట్లు (0.96 శాతం) పుంజుకొని, 36,652.06 పాయింట్ల వద్ద ముగిసింది.

09/26/2018 - 00:12

అమరావతి, సెప్టెంబర్ 25: జీరో పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త ఒరవడిని సృష్టించనుందని అంతర్జాతీయ సంస్థలు కితాబిచ్చాయి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఐసీఆర్‌ఏఎఫ్‌కు చెందిన ప్రపంచ ఆగ్రో ఫారెస్ట్రీ సెంటర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టోనీ సైమన్స్ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రశంసించారు.

09/25/2018 - 23:12

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 25: భారత్, పాకిస్తాన్ మధ్య వాణిజ్య లావాదేవీలు 37 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ వివరాలను ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొంది. ఇరు దేశాల మధ్య నిరంతరం ఉద్రిక్తతలు నెలకొనడం వల్ల వాణిజ్య రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం లోపించింది. ఈ నివేదికకు ఏ గ్లాస్ హాఫ్ ఫుల్ అని నామకరణం చేశారు.

09/25/2018 - 23:10

బులియన్
=======

09/25/2018 - 03:55

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ఉన్నతాధికారులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం సమావేశం కానున్నారు. నిరర్థక ఆస్తుల అంశమే ప్రధాన అజెండాగా ఉండనుందని సమాచారం. గత కొంతకాలంగా పీఎస్‌బీల లావాదేవీలపై దృష్టి పెట్టిన కేంద్రం, నిరర్ధక ఆస్తులను గణనీయంగా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఈ వ్యవహారంలో సాధించిన పురోగతిని ఈ సమావేశంలో జైట్లీ సమీక్షించే అవకాశం ఉంది.

09/25/2018 - 02:17

ముంబయి, సెప్టెంబర్ 24: ఈ వారం స్టాక్ ఎక్ఛ్సేంజ్ లావాదేవీలు పతనంతో మొదలయ్యాయి. మొదటి రోజునే సెనె్సక్స్ 535.58, నిఫ్టీ 168.20 పాయింట్ల పతనమై, వరుసగా రెండో వారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలనే చవి చూస్తాయనే అనుమానాన్ని కలిగిస్తున్నాయి. ఈ పరిణామంతో బ్యాంకింగ్, ఆటో రంగాలు భారీ నష్టాలను చవిశాయి.

Pages