S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/25/2018 - 04:06

న్యూఢిల్లీ: పెట్రోలు ధర వంద రూపాయలకు చేరుకునే దిశగా పరుగులు తీస్తున్నది. రూపాయి మారకపు విలువ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడం వంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, పెట్రో ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో పెరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం ముంబయిలో లీటరు పెట్రోలు ధర 11 పేసలు పెరిగి, 90.14 రూపాయలకు చేరింది.

09/25/2018 - 01:58

ముంబయి, సెప్టెంబర్ 24: ద్రవ్య చలామణి వేగం తగ్గింది. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, ఆ మొత్తం విలువలో 99.99 శాతం మేర కొత్త నోట్లును రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. దీనితో క్రమంగా నోట్ల చలామణి పెరిగింది. అయితే, ఈ ఏడాది మే మాసం నుంచి సర్క్యులేషన్‌లో ఉన్న కరెన్సీ (సీఐసీ) తగ్గిందని తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది.

09/25/2018 - 01:56

ముంబయి, సెప్టెంబర్ 24: డాలర్‌కు రూపాయి విలువను 72.6927 రూపాయలుగా ఫైనాన్షియల్ బెంచ్‌మార్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌బీఐఎల్) నిర్ధారించింది. అదే విధంగా యూరో విలువను 85.2535 రూపాయలుగా ప్రకటించింది. ఈనెల 21వ తేదీన డాలర్ విలువ 71.8489 రూపాయలుగానూ, యూరో విలువ 84.6830 రూపాయలుగానూ నమోంది. రూపాయి విలువ మరింత పతనమవుతున్నందున విదేశీ మారకం విలువ పమెరుగుతునే ఉంది.

09/25/2018 - 01:55

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఒడిశాలో ఎన్‌టీపీసీ ప్రాజెక్టు విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడి తల్చెర్ థర్మల్ పవర్ స్టేషన్ విస్తరణ పనులకు అంచనా వేసిన 7,732.35 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి అంగీకరించింది.

09/25/2018 - 01:55

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,015.00
8 గ్రాములు: రూ.24,120.00
10 గ్రాములు: రూ. 30,150.00
100 గ్రాములు: రూ.3,04,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,224.599
8 గ్రాములు: రూ. 25,796.792
10 గ్రాములు: రూ. 32,245.990
100 గ్రాములు: రూ. 3,23,459.90
వెండి
8 గ్రాములు: రూ. 328.80

09/24/2018 - 17:35

ముంబయి: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ప్రస్తుతం సెనె్సక్స్ 423.39 పాయింట్ల నష్టంతో 36,418.21 వద్ద నమోదు అయింది. నిఫ్టీ 129.05 పాయింట్ల నష్టంతో 11,014.05 వద్ద ట్రేడ్ అవుతుంది.

09/24/2018 - 04:34

న్యూఢిల్లీ: అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదాలు, రూపాయి కదలికలు, ముడి చమురు ధరల తీరు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ)కు సంబంధించిన పరిణామాలను కూడా మదుపరులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

09/24/2018 - 03:47

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: డాలర్‌తో రూపాయి మారకం విలువను 68-70 మధ్య స్థాయికి పెంచడానికి ప్రభుత్వం అతి త్వరలోనే అత్యవసరం కాని సరుకుల దిగుమతులపై ఆంక్షలు విధించడం సహా రెండో దశ చర్యలను అమలు చేయనుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ తెలిపారు. అయితే రూపాయి మారకం విలువ సుమారు 12 శాతం పతనం కావడమనేది తాత్కాలికమేనని ఆయన పేర్కొన్నారు.

09/24/2018 - 03:45

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: 3ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్4లో ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకునేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈక్రమంలో వాణిజ్య పరమైన వివాదాలను నిర్ధేశిత కాలంలోగా సత్వర పరిష్కరించే విషయంలో న్యాయవ్యవస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ఆర్డినెన్స్‌ను తీసుకురానుంది.

09/24/2018 - 03:44

ముంబయి, సెప్టెంబర్ 23: రూపాయి విలువ పతనం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ప్రవేశపెట్టిన వివిధ నియంత్రణ చర్యల వల్ల స్థిరాస్తి రంగం ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐలకు) మరింత లాభప్రదమయినదిగా తయారయిందని నిపుణులు పేర్కొన్నారు. గత వారం రోజులుగా అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ సుమారు 73 వద్ద కదులుతోంది.

Pages