S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/11/2017 - 00:55

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి మూడు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపిఒ) రానున్నాయి. దాదాపు 6,600 కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ మూడు ఐపిఒలు వస్తుండగా, మ్యాట్రిమొని డాట్‌కామ్, క్యాపసిటి ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, ఐసిఐసిఐ లాంబార్డ్ సంస్థలు వీటిలో ఉన్నాయి.

09/11/2017 - 00:55

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: భారతీయ స్టాక్ మార్కెట్లకు వివిధ దేశాలకు చెందిన పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ) నెమ్మదిగా దూరమైపోతున్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్ల నుంచి దాదాపు 3,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోవడమే దీనికి నిదర్శనం.

09/09/2017 - 23:57

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఆన్‌లైన్ పండగలొస్తున్నాయ్. ఈ-కామర్స్ మార్కెటింగ్ సంస్థలు బంపర్ బొనాంజాలతో సిద్ధమయ్యాయ. రాబోయే దసరా సందర్భంగా నెటిజన్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ఆఫర్లను గుప్పిస్తున్నాయ. దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. బిగ్ బిలియన్ డేస్‌తో వస్తుండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌తో రానుంది.

09/09/2017 - 23:55

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: పెట్రోల్, డీజిల్, గ్యాస్ స్టేషన్ల వద్ద జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి చమురు మార్కెటింగ్ సంస్థలు హై-సెక్యూరిటీ డివైజ్‌లను రంగంలోకి దించుతున్నాయి. ఈ మేరకు శనివారం కేంద్ర వినియోగదారుల సంబంధాల శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాణ్ తెలిపారు. ఎప్పట్లోగా ఈ పరికరాలను పెట్రోల్, గ్యాస్ స్టేషన్లలో ఏర్పాటు చేయాలనే దానిపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

09/09/2017 - 23:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ద్వైపాక్షిక ఎగుమతుల పురోగతికి భారత్-చైనాలు నడుం బిగించాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటును పూడ్చేలా పారిశ్రామిక క్రీయశీలక బృందాల ఏర్పాటుకు అంగీకరించాయి. ఈ మేరకు శనివారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. చైనాతో భారత్ వాణిజ్య లోటు అంతకంతకూ పెరిగిపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన చైనాకు భారత్ నుంచి ఎగుమతులు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

09/09/2017 - 23:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)లో లగ్జరీ, ఎస్‌యువి, పెద్ద కార్లపై సెస్సును పెంచడంపట్ల లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, ఆడీ, జెఎల్‌ఆర్ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ 21వ సమావేశంలో మధ్యశ్రేణి, భారీ కార్లు, ఎస్‌యువిలపై సెస్సును 7 శాతం వరకు పెంచుతున్నట్లు నిర్ణ యం తీసుకున్నారు.

09/09/2017 - 23:52

హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ నెలకొల్పేందుకు వీలుగా తుది వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) రూపొందించాలని వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సి పార్థసారథి ఆదేశించారు. పలు శాఖల నుంచి వచ్చిన సూచనలు, మార్పులు చేర్పులను పరిగణనలోకి తీసుకుని డిపిఆర్ తయారు చేయాలని చెప్పారు.

09/09/2017 - 23:51

సిరిసిల్ల, సెప్టెంబర్ 9: నిలిపివేసిన బతుకమ్మ చీరల సేకరణకు ఎట్టకేలకు విముక్తి లభించింది. దీంతో సిరిసిల్లలో ఈ చీరలను ఉత్పత్తి చేస్తున్న మరమగ్గాల మ్యాక్స్ సంఘాలు ఊపిరి పీల్చుకున్నాయి. సిరిసిల్లలో మరమగ్గాలపై ఉత్పత్తి చేస్తున్న బతుకమ్మ చీరలను ఖరీదు చేయడానికి ఈ నెల 5వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది.

09/09/2017 - 00:33

దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర.. శుక్రవారం ఈ-ఆల్ఫా పేరిట సరికొత్త ఈ-రిక్షాను
మార్కెట్‌కు పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 1.12 లక్షల రూపాయలు.
భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తమకంటూ ప్రత్యేక స్థానంపై దృష్టి పెట్టిన మహీంద్ర..
వీలైనంత ఎక్కువగా కొత్త వాహనాలను పరిచయం చేస్తోంది. ఇప్పటికే ఈ-వెర్టియో, ఈ-20 ప్లస్ వంటి

09/09/2017 - 00:31

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఇవూమి.. శుక్రవారం భారతీయ మార్కెట్‌లోకి రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది.
మి 3, మి 3ఎస్ పేరిట పరిచయమైన వీటిలో మి 3 ధర 5,499 రూపాయలవగా, మి 3ఎస్ ధర 6,499 రూపాయలు.
మి 3లో 2జిబి ర్యామ్, 16జిబి స్టోరేజ్ సామర్థ్యం, మి 3ఎస్‌లో 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజ్ సామర్థ్యం ఉన్నాయ.

Pages