S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/15/2017 - 00:24

హైదరాబాద్, జూలై 14: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహానికి తగ్గట్లుగా దేశంలో ఎలక్ట్రానిక్ లావాదేవీలు పెరిగాయని నీతి ఆయోగ్ సభ్యుడు వికె సారస్వత్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ పిటిఐతో మాట్లాడిన ఆయన డిజిటల్ ఎకానమీపై సంతృప్తి వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలోనూ ఈ లావాదేవీలు పెరిగాయని చెప్పారు. ఒక్క భీమ్ యాప్‌పైనే 65 లక్షల లావాదేవీలు జరుగుతున్నట్లు వెల్లడించారు.

07/15/2017 - 00:24

న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ ఎగుమతులు గత నెల జూన్‌లో 4.39 శాతం పెరిగి 23.56 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రసాయనాలు, ఇంజినీరింగ్, మెరైన్ ఉత్పత్తుల ఎగుమతి పెరగడమే దీనికి కారణం. మరోవైపు దిగుమతులు కూడా 19 శాతం ఎగిసి 36.52 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 12.96 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

07/15/2017 - 00:23

న్యూఢిల్లీ, జూలై 14: టోకు ద్రవ్యోల్బణం గత నెల జూన్‌లో 0.90 శాతానికి పడిపోయింది. గడచిన ఎనిమిది నెలల్లో ఇదే అత్యంత కనిష్ట స్థాయి గణాంకాలు కావడం గమనార్హం. కాగా, అంతకుముందు నెల మేలో 2.17 శాతంగా నమోదవగా, నిరుడు జూన్‌లో ఇది మైనస్ 0.09 శాతంగా ఉంది.

07/14/2017 - 00:41

ముంబయ, జూలై 13: దేశంలోనే అతిప్దెద సాఫ్ట్‌వేర్ సర్వీసుల ఎగుమతి సంస్థ టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ (టిసిఎస్)నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6 శాతం మేర తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో కంపెనీ 6,317 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించగా, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అది రూ.5,945 కోట్లకు తగ్గిపోయింది.

07/14/2017 - 00:36

న్యూఢిల్లీ, జూలై 13: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్), ఆర్‌టిజిఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) చార్జీలను 75 మేరకు తగ్గించింది. ఈ తగ్గింపు చార్జీలు ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఎస్‌బిఐ వెల్లడించింది.

07/14/2017 - 00:33

న్యూఢిల్లీ, జూలై 13: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎయిరిండియాను ప్రైవేటీకరించాలన్న ప్రతిపాదన స్వాగతనీయమైనదేనని ఆ సంస్థకు చెందిన పైలెట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకునేముందు తమ వేతన బకాయిల అంశాన్ని పరిష్కరించి ప్రభుత్వం గతంలో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

07/14/2017 - 00:32

న్యూఢిల్లీ, జూలై 13: ఈ ఆర్థిక సంవత్సరం జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో తమ సంస్థ పన్ను చెల్లింపునకు ముందు లాభం 7 కోట్ల రూపాయలకు పెరిగినట్లు రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ సెక్యూరిటీస్ గురువారం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ పన్నుకు ముందు లాభం రూ .28 లక్షలుగా ఉంది. కాగా, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం 51 శాతం పెరిగి రూ.

07/14/2017 - 00:32

న్యూఢిల్లీ, జూలై 13: దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) రాకలో ఇబ్బందులను తొలగించే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రత్యక్ష పెట్టుబడుల విధానంపై సమీక్ష నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలో ఎఫ్‌డిఐ విధానాన్ని స్ట్రీమ్‌లైన్ చేయడం కోసం చేయనున్న మార్పులపై ఈ సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రజంటేషన్ ఇవ్వనుంది.

07/14/2017 - 00:31

న్యూఢిల్లీ, జూలై 13: దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రయాణికుల రవాణాకు ఉపయోగించే చిన్నపాటి వాణిజ్య వాహనం ‘జీతో’ మినీ వ్యాన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ముంబయిలో దీని (బిఎస్-4 డీజిల్ వేరియంట్) ఎక్స్-షోరూమ్ ధర రూ.3.45 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

07/14/2017 - 00:35

న్యూఢిల్లీ, జూలై 13: వ్యక్తులు అమ్మే పాత బంగారం, పాత వాహనాలపై ఎలాంటి వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) ఉండదని, ఎందుకంటే ఈ అమ్మకం వ్యాపారాన్ని పెంచుకోవడం కిందికి రాదని రెవిన్యూ డిపార్ట్‌మెంట్ గురువారం వివరణ ఇచ్చింది. బుధవారం రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చేసిన వ్యాఖ్యలపై రెవిన్యూ డిపార్ట్‌మెంట్ వివరణ ఇస్తూ ఒక ప్రకటన జారీ చేసింది.

Pages