S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/19/2018 - 01:16

ముంబయి, సెప్టెంబర్ 18: పసిడి ధర మంగళవారం దాదాపు స్థిరంగా కొనసాగింది. పది గ్రాముల బంగారం సోమవారం 31,600 రూపాయల వద్ద ముగియగా, మంగళవారం కేవలం పది రూపాయలు పెరిగి, 31,610 రూపాయలకు చేరింది. మదుపరులు స్టాక్స్ కంటే బంగారం కొనుగోలుకు మొగ్గు చూపడం, రూపాయి మారకపు విలువ బలహీన పడడం వంటి అంశాలు ఇటీవల కాలంలో ధర పెరగడానికి కారణమయ్యాయి. అయితే, ఈవారం ప్రారంభంలో ఈ పరుగుకు బ్రేక్ పడింది.

09/19/2018 - 01:15

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: సౌందర్య సాధనాలు కేవలం మహిళలకే అనుకునే రోజులు పోయాయి. పురుషులకు కూడా అందంగా కనిపించాలన్న తాపత్రయం పెరుగుతున్నది. అందుకే, పురుషుల కోసం ప్రత్యేకంగా సౌందర్య సాధనాలను తయారు చేస్తున్న కంపెనీలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి. వినియోగ వస్తువుల తయారీలో పేరెన్నిక గల గాడ్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జీసీపీఎల్) ఈ రంగంలో ముందుకు దూసుకెళుతున్నది.

09/19/2018 - 01:13

ముంబయి, సెప్టెంబర్ 18: చందాకొచ్ఛర్, ఆమె భర్తతో వ్యాపార లావేదేవీలపై వచ్చిన ఆరోపణలపై ఐసీఐసీఐ స్పందించింది. సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది. ఈ విషయాన్ని మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ మంగళవారం ధృవీకరించింది.

09/19/2018 - 01:12

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య పెరగడంతో, విదేశాలకు చేస్తున్న చెల్లింపులు కూడా క్రమంగా పెరుగుతునే ఉన్నాయి. ఈ ఏడాది జూలై మాసంలో 343.6 మిలియన్ డాలర్లను విదేశాలకు చెల్లింపులు జరిగాయి. ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించిన నివేదికను అనుసరించి, 2017 జూలైలో 179 మిలియన్ డాలర్లుగా ఉన్న విదేశాల్లో చదువుల కోసం చేసిన చెల్లింపులు ఏడాది కాలంలో దాదాపు రెట్టింపు అయ్యాయి.

09/18/2018 - 23:47

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,998.00
8 గ్రాములు: రూ.23,984.00
10 గ్రాములు: రూ. 29,980.00
100 గ్రాములు: రూ.2,99,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,206.417
8 గ్రాములు: రూ. 25,651.336
10 గ్రాములు: రూ. 32,064.170
100 గ్రాములు: రూ. 3,20,641.70
వెండి
8 గ్రాములు: రూ. 329.20

09/18/2018 - 13:36

ముంబయ: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయ. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 23 పాయింట్లు నష్టంతో 37,558 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్లు నష్టంతో 11,368 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 72.49గా ఉంది.

09/18/2018 - 03:16

హైదరాబాద్: సింగపూర్, తైవాన్, చైనా, మలేషియా, జపాన్ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ సెమీ కండక్టర్ టెక్నాలజీ సంస్థ మైక్రాన్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టబోతుంది. హైదరాబాద్ కేంద్రంగా ఇండియాలో కార్యకలాపాలను నిర్వహించబోతున్నట్టు మైక్రాన్ సంస్థ ప్రకటించింది.

09/18/2018 - 02:55

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌లో జరుగుతున్న మోసాలపై నిఘా పెట్టడంతోపాటు, మార్కెట్‌లో కీలక పాత్రధారులు జవాబుదారీతనం వహించేలా చర్యలు తీసుకోవడం ప్రధాన అజెండాగా మంగళవారం సెబీ బోర్డు సమావేశం జరగనుంది. ఇన్‌ట్రా ట్రేడింగ్ వల్ల వాస్తవ మదుపరులు భారీగా నష్టపోవడం ఇటీవల కాలంలో పెరుతున్నది.

09/17/2018 - 23:45

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: షేర్ బైబ్యాక్ విధానాలను సెబీ సవరించింది. అదే విధంగా బహిరంగ ప్రకటనలపై స్పష్టతనిచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన మార్పుల ప్రకారం క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఇతరత్రా కార్యకలాపాల జోలికి వెళ్లవు. పబ్లిక్ ఇష్యూలకు సంబంధించిన సెక్యూరిటీలకు ఈ సంస్థలు రేటింగ్‌ను ఇస్తాయి.

09/17/2018 - 23:45

ముంబయి, సెప్టెంబర్ 17: గత వారాంతంలో కొద్దిగా తగ్గిన పసిడి ధర సోమవారం మళ్లీ పెరిగింది. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాన్ని అమెరికా మరింత పెంచనున్నట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నీరసించాయి. దీనితో బంగారంపై మదుపరులు ఆసక్తి చూపారు. జ్యుయెలరీ తయారీదారుల నుంచి డిమాండ్ ఏర్పడడం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమయ్యాయి.

Pages