S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/25/2016 - 03:06

హైదరాబాద్, మార్చి 24: దేశంలో వినిమయ వాహనాల (యుటిలిటీ వెహికల్స్)ను తయారు చేస్తున్న అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ‘మహీంద్రా’ రానున్న 18 నెలల కాలంలో ఆఫ్రికాకు తమ భారీ, వాణిజ్య (హెవీ, కమర్షియల్) వాహనాలను ఎగుమతి చేయాలని యోచిస్తోంది. మహీంద్రా సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు.

03/25/2016 - 03:06

ముంబయి, మార్చి 24: హోలీ పండుగను పురస్కరించుకుని గురువారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ), నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి (ఎన్‌ఎస్‌ఇ), ఫోరెక్స్, మనీ, బులియన్ మార్కెట్లతో పాటు ప్రధానమైన ఇతర కమోడిటీ మార్కెట్లన్నీ మూతబడ్డాయి. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కూడా వీటికి సెలవు ప్రకటించారు.

03/25/2016 - 03:05

న్యూఢిల్లీ, మార్చి 24: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ అమెరికా మదుపరులు నేరుగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో భారత్ చైనాను అధిగమించేసింది. అమెరికా ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలను బట్టి అమెరికా విదేశీ ఈక్విటీ పెట్టుబడుల్లో భారత్ వాటా 1.8 శాతానికి పెరగ్గా, చైనా వాటా 1.6 శాతమే ఉంది.

03/25/2016 - 03:04

భీమవరం, మార్చి 24: జిల్లాను ఆక్వా హబ్‌గా తీర్చిదిద్దుతానని పదేపదే ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చడంలేదని పశ్చిమ గోదావరి జిల్లాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆక్వాకల్చర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. వస్తుంది వస్తుందని ఊరించిన వనామీ తల్లి రొయ్య ఉత్పత్తి కేంద్రం సిక్కోలు తరలిపోవడంతో ఆక్వా రైతులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...

03/24/2016 - 08:23

న్యూఢిల్లీ/ముంబయి: ప్రధాన మంత్రి పసిడి నగదీకరణ పథకంలో టన్నులకొద్దీ బంగారాన్ని డిపాజిట్ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి).. ఇందుకు వడ్డీని నగదు కంటే బంగారం రూపంలోనే కావాలంటోంది. పసిడి నగదీకరణ పథకంలో భాగంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో బంగారాన్ని టిడిడి డిపాజిట్ చేస్తుండగా, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయమైన టిటిడి వద్ద 7 టన్నుల పుత్తడి ఉంది.

03/24/2016 - 08:21

హైదరాబాద్, మార్చి 23: మహీంద్ర గ్రూప్‌లో భాగమైన ట్రక్, బస్ డివిజన్ నూతన వాణిజ్య వాహనం (హెచ్‌సివి) ‘బ్లాజో’ను ఆవిష్కరించింది. బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేసిన ఈ వాహనంలో ఫ్యూయల్ స్మార్ట్ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణతో, మల్టీ డ్రైవ్ మోడ్ ఫీచర్లతో సిఆర్‌డిఇ ఇంజిన్‌ను పరిచయం చేస్తున్నట్లు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నళిని మెహతా తెలిపారు.

03/24/2016 - 08:20

అనంతపురం: రైతులు, చేనేత కార్మికులు రుణమాఫీ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రైతులకు 2014 డిసెంబర్‌లో మొదటి విడత రుణమాఫీ నిధులు విడుదలవగా, చేనేతలకు సంబంధించి మాత్రం ఇప్పటికీ ఆ శాఖ జాబితా తయారీలోనే తలమునకలై ఉంది. దీంతో రుణమాఫీకి అర్హత సాధించిన రైతులు, చేనేత రుణమాఫీలో అర్హత కోసం చేనేత కార్మికులు బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

03/24/2016 - 08:19

చిత్తూరు: నల్లబెల్లం కొనుగోలుకు మార్క్‌ఫెడ్ సన్నద్దమైంది. దీంతో చెరకు రైతులకు ఊరట లభించినట్లయింది. చిత్తూరు జిల్లాలో నల్లబెల్లంపై ఆంక్షలు, మరో పక్క సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడడంతో చెరకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారినది తెలిసిందే. జిల్లాలో వేరుశనగ తరువాత మామిడి, చెరకు ప్రధాన వాణిజ్య పంటలు. సుమారు 20వేల హెక్టార్లలో చెరకు సాగవుతోంది.

03/24/2016 - 08:19

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల మధ్య ఆర్థిక సంస్కరణలతో భారత జిడిపి వృద్ధిరేటు అదనంగా 1-2 శాతం పెరగగలదన్న విశ్వాసాన్ని బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. మైనారిటీల ఆర్థిక సాధికారతపై 8వ వార్షిక ఎన్‌సిఎమ్ ప్రధానోపన్యాసం చేస్తూ అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు కలిసొచ్చేవేనని అన్నారు.

03/23/2016 - 07:36

విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో దాదాపు రూ. 120 కోట్లతో చేపట్టిన సరికొత్త టెర్మినల్ కృష్ణా పుష్కరాల నాటికి వినియోగంలోకి వస్తుందని ఎయిర్‌పోర్టు డైరక్టర్ జి మధుసూదనరావు తెలిపారు. విమానాలను నిలిపేందుకు మరో పది పార్కింగ్ బేలు సిద్ధమవుతున్నాయని, ఇప్పటివరకు విఐపిల విమానాలు వచ్చినప్పుడు పార్కింగ్ కోసం ఇతర ప్రాంతాలకు పంపించాల్సి వస్తోందన్నారు.

Pages