S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/30/2017 - 00:33

హైదరాబాద్, నవంబర్ 29: ఆయిల్‌పాం రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎపిసి, వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి కోరారు.

11/29/2017 - 00:52

నాగ్‌పూర్, నవంబర్ 28: శ్రీలంకతో టెస్టు క్రికెట్ సిరీస్ ముగిసిన తర్వాత వనే్డ సిరీస్‌కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోనున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ తర్వాత పర్యాటక జట్టుతో జరిగే ట్వంటీ-20 సిరీస్‌లోనైనా బరిలోకి దిగుతాడా? లేదా? అన్న దానిపై అనిశ్చితి కొనసాగుతోంది.

11/29/2017 - 00:42

న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా స్వచ్ఛమైన రీతిలో నిజాయితీగా వ్యాపార కార్యకలాపాలు సాగించేందుకు కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన దివాళా ఆర్డినెన్స్ ఎంతగానో ఉపకరిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

11/29/2017 - 00:41

గత ఎనిమిది రోజులుగా దూకుడుగా సాగిన స్టాక్‌మార్కెట్‌కు మంగళవారం బ్రేట్ పడింది. స్థూల జాతీయ ఉత్పత్తి సెప్టెంబర్ త్రైమాసిక వివరాలు ఆవిష్కృతం కానున్న తరుణంలో ఇనె్వస్టర్లు ఆచీతూచీ అడుగేశారు. గురువారం నాడు డెరివేటర్ల కాంట్రాక్టు పూర్తికానున్న దృష్ట్యా కూడా ఇనె్వస్టర్లు దూకుడును తగ్గించినట్టుగా స్పష్టమవుతోంది. మార్కెట్ పరిణామాలను ప్రతిబింబిస్తూ సెనె్సక్స్ 105.85 పాయింట్లు తగ్గిన 33,618.

11/29/2017 - 00:40

అమరావతి, నవంబర్ 28: ఐటీ దిగ్గజం, హెచ్‌సీఎల్ అధినేత శివనాడార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈసందర్భంగా వారిద్దరి మధ్య హెచ్‌సీఎల్ క్యాంపస్ ఏర్పాటుపై చర్చ జరిగింది. విజయవాడ విమానాశ్రయం వద్ద నిర్మించే నూతన భవన డిజైన్లపై శివనాడార్ సీఎంకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

11/29/2017 - 00:37

న్యూఢిల్లీ, నవంబర్ 28: బ్యాంకు రుణాలను భారీగా ఎగవేసినవారి బాకీలను మాఫీ చేయలేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. రుణాలను ఎగవేసిన పెట్టుబడిదారుల బాకీలను బ్యాంకులు మాఫీ చేశాయంటూ వస్తున్న వదంతులను జైట్లీ తిరస్కరించారు.

11/28/2017 - 00:43

కాకినాడ, నవంబర్ 27: నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా వైఫల్యం చెందింది. అధిక ధరలకు సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. కూరగాయల నుండి పప్పుదినుసులు, గుడ్లు, వంటనూనె ధరలు అమాంతం పెరిగిపోవడంతో అన్ని వర్గాల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోర పరాజయం పాలయ్యింది.

11/28/2017 - 00:41

ముంబయి, నవంబర్ 27: వరుసగా ఎనిమిదో సెషన్‌లో కూడా సెనె్సక్స్ ఎలాంటి పాయింట్లు నష్టపోకుండా స్వల్పంగా రాణించింది. ఎస్‌అండ్‌పీ రేటింగ్ యథాతథంగా కొనసాగడంతో మార్కెట్‌లో సరికొత్త ఉత్సాహం లేకపోయినా రాబోయే పరిణామాలపై ఇనె్వస్టెర్లు దృష్టి సారించి ఆచితూచి వ్యవహరించారు. చివరి క్షణంలో జరిగిన ఆకస్మిక కొనుగోళ్ల ఫలితంగా సెనె్సక్స్ 45.20 పాయింట్లు పెరిగి 33,724.44 పాయింట్ల వద్ద ముగిసింది.

11/28/2017 - 00:40

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశంలో గత నెల వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు భారీగా తగ్గాయి. సెప్టెంబర్ రూ.92 వేల కోట్లకు పైగా ఉన్న ఈ వసూళ్లు అక్టోబర్‌లో రూ.83,346 కోట్లకు పడిపోయాయి. జీఎస్‌టీలోని చాలా వస్తువులపై ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గించడమే ఇందుకు కారణం.

11/28/2017 - 00:39

న్యూఢిల్లీ, నవంబర్ 27: రేషన్ దుకాణాలతో పాటు మధ్యాహ్న భోజనం లాంటి పథకాల ద్వారా చిరు ధాన్యాలను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్‌కే.పట్నాయక్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. చిరు ధాన్యాలకు ‘న్యూట్రీ సిరియల్స్’గా ప్రచారం కల్పించి దేశవ్యాప్తంగా వాటి వినియోగాన్ని పెంపొందించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన తెలిపారు.

Pages