S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/13/2018 - 02:46

న్యూఢిల్లీ, జూలై 12: దేశంలో వినియోగ వస్తువుల ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం జూన్ నెలలో అయిదు నెలల గరిష్ఠ స్థాయి అయిన అయిదు శాతానికి పెరిగింది. గురువారం సాయంత్రం విడుదల చేసిన అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అంతకు ముందు నెలలో ఈ చిల్లర ద్రవ్యోల్బణం 4.87 శాతం ఉంది.

07/13/2018 - 02:45

న్యూఢిల్లీ, జూలై 12: దేశంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు మే నెలలో ఏడు నెలల కనిష్ట స్థాయి అయిన 3.2 శాతానికి పడిపోయింది. మాన్యుఫాక్చరింగ్, పవర్ సెక్టార్ల పనితీరు బాగా లేకపోవడంతో పాటు ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) ఉత్పత్తి వృద్ధి ఈ కాలంలో బాగా పడిపోవడం వంటి అంశాలు ప్రధానంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి పడిపోవడానికి దారితీశాయి.

07/13/2018 - 02:45

న్యూఢిల్లీ, జూలై 12: దేశంలో సగటు తలసరి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, తలసరి ఆదాయం ఆశించిన స్థాయి కంటే తక్కువగా ఉందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. ప్రపంచంలో ఆరవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ ఎదుగుతుందని ముందే ఊహించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థికంగా బలమైన దేశంగా త్వరలోనే భారత్ అవతరిస్తుందన్నారు.

07/13/2018 - 02:44

వాషింగ్టన్, జూలై 12: బాలికలకు మనం సరైన విద్యాసౌకర్యం కల్పించకపోవడం వల్ల అంతర్జాతీయ సమాజానికి ఆర్థికంగా 15 నుంచి 30 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టం జరుగుతోందని ప్రపంచబ్యాంకు పేర్కొంది.

07/13/2018 - 02:44

ముంబయి, జూలై 12: ఉద్యోగుల వేతనాలు, రైతుల రుణమాఫీ, జీఎస్‌టీలో రెవెన్యూ తగ్గుదల వల్ల రాష్ట్రాల ద్రవ్యలోటు 2017-18 సంవత్సరంలో 0.35 శాతం మేర తగ్గి 3.1 శాతానికి చేరుకుందని ఆర్‌బీఐ పేర్కొంది. వరుసగా మూడో ఏడాది కూడా రాష్ట్రాల స్థూల ద్రవ్యలోటులో నుంచి బయటకు రాలేకపోతున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది.

07/12/2018 - 13:02

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల బాటలో దూసుకువెళుతున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు వెలువడటంతో సూచీలు జోరుమీద ఉన్నాయి. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా 11,000 మైలురాయిని దాటింది. సెనె్సక్స్ 247 పాయింట్లు ఎగబాకి 36,513వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో 11,022 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

07/12/2018 - 01:11

ముంబయి, జూలై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తొలి త్రైమాసికంలో అంచనాలను మించి ఆదాయాన్ని ఆర్జించడంతో ఆ కంపెనీ షేర్ల విలువ బుధవారం 5.47 శాతం పుంజుకొని జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన రూ. 1,979.60లకు చేరింది.

07/11/2018 - 23:27

న్యూఢిల్లీ, జూలై 11: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి ఈ నెల 21న జరిగే సమావేశంలో కొన్ని వస్తువులపై పన్ను రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. పన్ను హేతుబద్ధీకరణ కసరత్తులో భాగంగా ఆదాయం తక్కువగా ఉన్న వాటిపై పన్ను రేట్లను తగ్గించే అవకాశం ఉంది. పన్ను రేట్లు తగ్గే అవకాశం ఉన్న వస్తువులలో సానిటరి నాప్కిన్స్, హస్తకళలు, చేనేత వస్తువులతో పాటు కొన్ని సేవలు ఉన్నాయి.

07/11/2018 - 23:26

న్యూఢిల్లీ, జూలై 11: భారత్ ఫ్రాన్స్‌ను ఏడో స్థానంలోకి నెట్టి ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2017 సంవత్సరానికి ప్రపంచ బ్యాంకు సేకరించిన గణాంకాల ప్రకారం భారత్ ఈ ఘనత సాధించింది. 2017 సంవత్సరాంతం నాటికి భారత్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2.597 ట్రిలియన్ డాలర్లు కాగా, ఫ్రాన్స్ జీడీపీ 2.582 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

07/11/2018 - 23:25

జైపూర్, జూలై 11: స్థానిక సంస్థల ద్వారా ప్రజాసామ్యాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో 74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. 24 ఏళ్ల తరువాత కూడా పరిస్థితిలో ఆశించిన మార్పు రాలేదని నీతి ఆయోగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. 1992లో నగరపాలిక చట్టం (74వ సవరణ) చేయగా 1993 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

Pages