S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/10/2018 - 02:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజిలో వ్యాపార లావాదేవీలు ఇదే తరహాలో కొనసాగితే, డిసెంబర్ మాసంతంలోగా నిఫ్టీ 12,000 పాయింట్లకు అసాద్యమేమీ కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నిఫ్టీ దూకుడును కొనసాగిస్తున్నది. మదుపరుల ఆసక్తి పెరగడంతో నిఫ్టీ లాభాల బాటపట్టింది.

09/10/2018 - 02:09

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: బంగ్లాదేశ్‌కు 300 మెగావాట్స్ విద్యుత్ సరఫరాను ఎన్‌టీపీసీ ఆదివారం అర్థరాత్రి ప్రారంభించింది. ఎన్‌టీపీసీ నిర్వాహణలోని విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ (ఎన్‌వీవీఎన్) ఈ సరఫరా బాధ్యతలను తీసుకుంది. బంగ్లాదేశ్ విద్యుత్ అభివృద్ధి బోర్డు (బీపీడీబీ)తో ఈనెల ఆరోతేదీన విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఎన్‌వీవీఎన్ కుదుర్చుకుందని ఎన్‌టీపీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

09/10/2018 - 02:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: రెడీమేడ్ వస్త్ర మార్కెట్ దిగ్గజయం జెనెసిస్ కలర్స్ లిమిటెడ్ (జీసీఎల్)లో రిలయన్స్ రీటైల్ అదనంగా మరో 16.31 శాతం వాటాలను కొనుగోలు చేసింది. 34.80 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వాటాలను పొందినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) తెలిపింది. ముఖేష్ అంబానీకి చెందిన రిల్‌లో రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్) అనుబంధ సంస్థగా ఉంది.

09/10/2018 - 02:07

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: జూన్ మాసంతో అంతమయ్యే ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసిక ఫలితాలను దాఖలు చేయని గీతాంజలి జెమ్స్ కంపెనీకి జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజి (ఎన్‌ఎస్‌ఈ) నోటీసులు జారీ చేసింది. మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి సంస్థ వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసిన విషయం తెలిసిందే.

09/09/2018 - 03:54

ముంబయి: వరుసగా ఆరు వారాల పాటు బలపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారంలో 255.25 పాయింట్లు పడిపోయి 38,389.82 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 91.40 పాయింట్లు పడిపోయి, 11,589.10 పాయింట్ల వద్ద స్థిరపడింది.

09/09/2018 - 02:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దేశవ్యాప్తంగా ప్రభుత్వ నేతృత్వంలో నడుస్తున్న విమానాశ్రయాల్లో తేనీరు, అల్పాహారాలను (టీ, స్నాక్స్) ఎమ్మార్పీ ధరలకే ఆందించేందుకు ఎయిర్‌పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

09/09/2018 - 02:09

ముంబయి, సెప్టెంబర్ 8: దేశంలో బంగారం ధరలు వరుసగా రెండో రోజు శనివారం తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. వంద తగ్గి, రూ. 31,350కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో పాటు స్థానికంగా డిమాండ్ అంతగా లేకపోవడంతో దేశంలో పసిడి ధర తగ్గింది. అయితే, వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండి ధర రూ. 275 పెరిగి, రూ. 37,775కు చేరుకుంది.

09/09/2018 - 02:08

బీజింగ్, సెప్టెంబర్ 8: చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అలీబాబా సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ జాక్ మా సోమవారం కంపెనీ పదవుల నుంచి రిటైర్ కావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ద న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్ మా ఈ విషయం వెల్లడించారు. విద్యారంగంపై కేంద్రీకరించి సామాజిక సేవ చేసేందుకు సమయాన్ని కేటాయించడం కోసం కంపెనీ పదవుల నుంచి రిటైర్ కావాలని జాక్ మా భావిస్తున్నారు.

09/09/2018 - 02:06

సంగారెడ్డి, సెప్టెంబర్ 8: పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్లుగా రీజినల్ రూరల్ బ్యాంక్ (ఏపీజీవీబీ)ల పరిస్థితి దాపురించింది. ప్రభుత్వాలే ఈ బ్యాంకులను ఏర్పాటు చేసి లావాదేవీలు కొనసాగిస్తున్నా అదే ప్రభుత్వాలకు సంబంధించిన డిపాజిట్లకు నోచుకోని వైనం నాలుగు దశాబ్దాలకుపైగా కొనసాగుతోంది. ఈ విషయమై అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోకపోవడం దురదృష్టకరం.

09/09/2018 - 02:06

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: గతంలో ఎన్నడూ లేని రీతిలో శనివారం తొలిసారి దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80 దాటింది. రూపాయి విలువ పతనమయి, దిగుమతులు ప్రియం కావడం వల్ల పెట్రోల్ ధర బాగా పెరిగింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం సవరించిన ధరల ప్రకారం దేశంలో లీటర్ పెట్రోల్ ధర 39 పైసలు పెరగగా, డీజిల్ ధర 44 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.38కి చేరుకుంది.

Pages