S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/07/2018 - 01:30

న్యూఢిల్లీ: ఇంధన ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. గురువారం మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు పెంచాయి. దీంతో పాత రికార్డులను బద్దలుకొట్టి.. ఇంధన ధరలు సరికొత్త గరిష్ఠాలకు చేరాయి.

09/06/2018 - 04:24

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో సెషన్ బుధవారం మరింత బలహీనపడ్డాయి. రూపాయి విలువ మరింత పడిపోవడంతో పాటు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కరెన్సీ మార్కెట్లు ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల కారణంగా స్టాక్ మార్కెట్లలో మదుపరులు అమ్మకాలకు పూనుకున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు పతనమయ్యాయి.

09/05/2018 - 23:46

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో పాటు ఎథనాల్, మెథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాల్సిన అవసరం ఎంతయినా ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దిగుమతులను తగ్గించి, ఎగుమతులను పెంచడంతో పాటు కాలుష్యాన్ని రూపుమాపాలనేది తమ ప్రభుత్వ విధానమని ఆయన పునరుద్ఘాటించారు.

09/05/2018 - 23:44

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: దేశంలో వరుసగా పది రోజుల పాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం యథాతథంగా ఉన్నాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు బుధవారం వీటి ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. మంగళవారం పెంచిన ధరలనే కొనసాగించాయి. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయిలకు చేరుకొని ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 79.31గా ఉంది.

09/05/2018 - 23:42

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ.2,934.00
8 గ్రాములు: రూ.23,472.00
10 గ్రాములు: రూ.29,340.00
100 గ్రాములు: రూ.2,83,400.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ.3,137.968
8 గ్రాములు: రూ.25,103.744
10 గ్రాములు: రూ.31,379.568
100 గ్రాములు: రూ.3,13,796.80
వెండి
8 గ్రాములు: రూ.331.20

09/05/2018 - 23:42

ముంబయి, సెప్టెంబర్ 5: పత్తి కొనుగోళ్లకు సంబంధించి కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజీ మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ ఒప్పందం ఖరారు చేశారు. వచ్చే ఐదేళ్లపాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది.

09/05/2018 - 23:41

ముంబయి, సెప్టెంబర్ 5: వాల్‌మార్ట్-్ఫ్లప్‌కార్ట్ మధ్య 16 బిలియన్ డాలర్ల ఒప్పందం వల్ల దేశంలో చిన్న వర్తకులపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఈ ఒప్పందానికి నిరసనగా ఈ నెల 15వ తేదీ నుంచి 90రోజుల పాటు ఉద్యమాన్ని చేపడుతామని అఖిల భారత వర్తకుల సమాఖ్య ప్రకటించింది. ఈ నెల 28వ తేదీన భారత్ ట్రేడ్ బంద్ పాటిస్తామని ఆ సంస్థ ప్రకటనలో పేర్కొంది.

09/05/2018 - 23:41

హైదరాబాద్, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చెందడానకి టిఎస్‌ఐపాస్ కీలకపాత్ర పోషిస్తున్నదని చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. మెగా పారిశ్రామిక ప్రాజెక్టులతో పాటు కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులను త్వరితగతిగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. బషీర్‌బాగ్‌లో రూ.60 లక్షలతో కార్యాలయాన్ని ఆధునీకరించినట్లు ఆయన చెప్పారు.

09/05/2018 - 23:40

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: రూపాయి విలువ పతనం వరుసగా ఆరో రోజు బుధవారం కూడా కొనసాగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తాజాగా 17 పైసలు దిగజారి, మరో రికార్డు కనిష్ట స్థాయి 71.75 వద్ద ముగిసింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కరెన్సీలలో కొనసాగుతున్న బలహీన ధోరణి రూపాయిని దెబ్బతీశాయి.

09/05/2018 - 02:40

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను అమాంతం పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. కేంద్రం నిర్ణయంతో అదనపు పన్నులు పడడంతో పెట్రో మంటలు చెలరేగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. డీజిల్, పెట్రోల్‌ను జీఎస్‌టీ కిందకు తీసుకువచ్చి వెంటనే పెరిగిన ధరలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు.

Pages