S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/05/2018 - 02:11

విజయవాడ, సెప్టెంబర్ 4: గత దశాబ్దాల తరబడి ఏపీఎస్ ఆర్టీసీ దాదాపు రూ. 3,900 కోట్ల నష్టాలతో కొట్టుమిట్టాడుతూ ముందుకు సాగుతుంటే కార్మిక, ఉద్యోగ, అధికారులు అందరూ కలిసి ఎంతగా శ్రమిస్తున్నా ఆశించిన ఫలితాలు చేకూరటం లేదంటూ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

09/05/2018 - 02:02

ముంబయి, సెప్టెంబర్ 4: సరళీకృత వాణిజ్య విధానాలను ప్రోత్సహించడం వల్ల వినియోగదారులపై మంచి మార్పు కనపడుతోందని డెలాయిట్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. రిటైల్ వ్యూహాలు మారుతున్నాయి. వినియోగదారులు డిజిటలీకరణ ప్రభావానికి లోనవుతున్నారు. విదేశీ పెట్టుబడులు పుంజుకుంటున్నాయని నివేదికలో పేర్కొన్నారు.
మంగళవారం ఇక్కడ రిటైల్ సీఎఫ్‌వో సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు.

09/05/2018 - 01:33

ముంబయి, సెప్టెంబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు మరింత బలహీనపడ్డాయి. ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, ప్రపంచ వాణిజ్య వివాదాలు వంటి అంశాలు దేశీయ మార్కెట్లను దెబ్బతీశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా అయిదో సెషన్ మంగళవారం కూడా పడిపోయింది. ఈ సూచీ వరుసగా ఇన్ని సెషన్ల పాటు దిగజారడం గత మూడు నెలల్లో ఇదే మొదటిసారి.

09/05/2018 - 01:31

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం మరో 37 పైసలు పడిపోయి, సరికొత్త కనిష్ట స్థాయి 71.58 వద్ద ముగిసింది. ఇక్కడి ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ (్ఫరెక్స్) మార్కెట్‌లో పౌండ్ స్టెర్లింగ్‌తో పోలిస్తే కూడా రూపాయి మారకం విలువ తగ్గిపోయింది. పౌండ్ స్టెర్లింగ్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 91.77 వద్ద ముగిసింది.

09/05/2018 - 01:29

ముంబయి, సెప్టెంబర్ 4: దేశంలో వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. ముంబయి బులియన్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల బంగారం ధర రూ. 25 పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడికి డిమాండ్ బలహీనంగా ఉండటంతో పాటు దేశీయంగా స్థానిక నగల వ్యాపారుల నుంచి కూడా డిమాండ్ అంతగా లేకపోవడంతో బంగారం ధర తగ్గింది. పారిశ్రామిక యూనిట్ల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో దేశంలో మంగళవారం వెండి ధర కూడా కిలోకు రూ. 510 తగ్గింది.

09/05/2018 - 01:29

ముంబయి, సెప్టెంబర్ 4: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మొదటిసారి గరిష్ఠ స్థాయిని తాకాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు వరుసగా పదో రోజు మంగళవారం ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రికార్డు గరిష్ఠ స్థాయిలో రూ. 79.31కి, డీజిల్ ధర రూ. 71.34కు చేరుకుంది. లీటర్ పెట్రోల్ ధర ముంబయిలో రూ.

09/04/2018 - 23:47

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 4: చుక్కలనంటుతున్న పెట్రోధరలకు కళ్లెం వేసేందుకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలనే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు, చమురు కంపెనీలు తెలిపాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడంతో, పెట్రో ధరలు మండుతున్నాయి. కరెంటు అకౌంట్ లోటు కూడా పెరుగుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.71.54పైసలకు చేరుకుంది. దీని వల్ల చమురు దిగుమతులపై భారం పడింది.

09/04/2018 - 23:46

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: 2,998.00 రూపాయలు
8 గ్రాములు: 23,984.00 రూపాయలు
10 గ్రాములు: 29,980.00 రూపాయలు
100 గ్రాములు: 2,99,800.00 రూపాయలు
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: 3,211.00 రూపాయలు
8 గ్రాములు: 25,688.00 రూపాయలు
10 గ్రాములు: 32,110.00 రూపాయలు
100 గ్రాములు: 3,21,10000 రూపాయలు
వెండి

09/04/2018 - 22:00

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్‌ 155 పాయింట్లు దిగజారి 38,158 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 62 పాయింట్ల నష్టంతో 11,520 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.47గా కొనసాగుతోంది.

09/04/2018 - 04:20

విశాఖపట్నం: హిందుస్థాన్ షిప్‌యార్డు సుమారు 40 సంవత్సరాల తరువాత వరుసగా మూడేళ్లు లాభాలను ఆర్జించిందని షిప్‌యార్డు సీఎండీ రియర్ అడ్మిరల్ ఎల్.వీ.శరత్‌బాబు తెలియచేశారు. మంగళవారం షిప్‌యార్డులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017-18 సంవత్సరానికి 69.80 కోట్ల రూపాయల ఆపరేటింగ్ ప్రోఫిట్స్ సాధించామని చెప్పారు. గత ఏడాదికన్నా ఇది 86 శాతం అధికమని ఆయన తెలియచేశారు.

Pages