S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/18/2018 - 22:20

న్యూఢిల్లీ, జూలై 18: అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీల)కు మూలధనం సమకూర్చడానికి ఆమోదం తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా మరో రెండు నుంచి మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల అవసరాలను అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం చివరి నాటికి ఈ బ్యాంకులకు కొంత మూలధనాన్ని సమకూర్చనుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే అయిదు ప్రభుత్వ రంగ బ్యాకులకు రూ.

07/18/2018 - 22:18

న్యూఢిల్లీ, జూలై 18: వివాదస్పద ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్‌ఆర్‌డిఐ) బిల్లు 2017ను పార్లమెంటులో ఉపసంహరించుకునే యోచనలో కేంద్రం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. డిపాజిటర్ల ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఈ బిల్లు ఉందనే విమర్శలు రావడంతో ఈ బిల్లుపై కేంద్రం వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి మండలి కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.

07/18/2018 - 22:17

న్యూఢిల్లీ, జూలై 18: సమగ్ర వస్తు సేవాపన్ను కింద జూన్ 16వ తేదీ వరకు రూ.21,142 కోట్ల సొమ్మును చెల్లించినట్లు కేంద్రం ప్రకటించింది. ఐజిఎసీటీ కింద రూ.21,1422 కోట్లు, ఆర్‌ఎఫ్‌డీ-01ఏ కింద రూ.16,920 కోట్లను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు రాష్ట్రప్రభుత్వాలకు మంజూరు చేసింది. బుధవారం ఈ వివరాలను వాణిజ్య శాఖ మంత్రి సిఆర్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు.

07/18/2018 - 22:49

న్యూఢిల్లీ, జూలై 18: టాటా మోటార్స్ ఆగస్టు నుంచి తన ప్రయాణికుల వాహనాల (ప్యాసింజర్ వెహికిల్స్) ధరలను 2.2 శాతం వరకు పెంచనున్నట్టు బుధవారం వెల్లడించింది. ఉత్పాదక వ్యయం పెరగడం వల్ల వివిధ మోడళ్ల ప్రయాణికుల వాహనాల ధరలను పెంచుతున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. టాటా మోటా ర్స్ ఏప్రిల్ నెలలో వాహనాల ధరలను మూడు శాతం పెంచింది. ‘వ్యయం తగ్గించుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం.

07/18/2018 - 02:07

ముంబయి: రెండు రోజుల పాటు పడిపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మళ్లీ బలపడ్డాయి. చమురు, లోహ, పీఎస్‌యూ షేర్లలో వచ్చిన ర్యాలీ ఫలితంగా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 196 పాయింట్లకు పైగా పుంజుకొని 36,519.96 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమయిన 11,000 పాయింట్లకు పైన స్థిరపడింది.

07/17/2018 - 23:49

న్యూఢిల్లీ, జూలై 17: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొద్ది రోజులలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), కార్పొరేషన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సుమారు రూ. పది వేల కోట్ల నిధులు సమకూర్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

07/17/2018 - 23:47

హైదరాబాద్, జూలై 17: స్కిల్ డవలప్‌మెంట్ కేంద్రాలను ఐటిఐలకు అనుసంధానం చేయనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి కార్మిక, ఉపాధిశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం కార్మిక, ఉపాధిశాఖ కార్యకలాపాలపై సిఎస్ సమీక్షించారు. రాష్ట్రంలో 291 ఐటిఐలలో 73 వేవ మంది విద్యనభ్యసిస్తున్నారని సిఎస్ వివరించారు. అలాగే 16 ఐటిఐలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయన్నారు.

07/17/2018 - 23:45

న్యూఢిల్లీ, జూలై 17: జూన్ నెలలో నాలుగేళ్ల గరిష్ఠ స్థాయి అయిన 5.77 శాతానికి పెరిగిన టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని, 2019 మార్చి నాటికి ఇది 4.1 శాతానికి తగ్గుతుందని ఒక నివేదిక పేర్కొంది. మే నెలలో 4.43 శాతం ఉన్న డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం జూన్‌లో కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా వేగంగా 5.77 శాతానికి పెరిగింది.

07/16/2018 - 23:38

గత నాలుగు సంవత్సరాల్లో ఎన్నడూ లేని రీతిలో టోకు ధరల ద్రవ్యోల్బణ సూచి పెరిగిన ప్రభావం సోమవారం జరిగిన మార్కె ట్ లావాదేవీలపై తీవ్రంగా కనిపించింది. దీనితో ఇనె్వస్టర్లు ఆచితూచి అడుగు వేయడంతో భారీగానే షేర్ల విక్రయం జరిగింది. బ్యాంకిం గ్, ఫార్మా తదితర కంపెనీల షేర్ల అమ్మకాల కారణంగా ఇటు సెనె్సక్స్, అటు నిఫ్టీలు భారీగా పడిపోయాయి. సెనె్సక్స్ ఏకంగా 218 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 11వేల దిగువకు చేరుకుంది.

07/16/2018 - 23:37

న్యూఢిల్లీ, జూలై 16: ఐడిబిఐ బ్యాంకు లో మెజార్టీ షేర్లను కొనుగోలు చేసేందుకు బీమా సంస్థ ఎల్‌ఐసికి బోర్డు అమోదం లభించింది. ప్రాధాన్యతా షేర్ల ద్వారా ఐడిబిఐలో 51శాతం వాటాను ఎల్‌ఐసి సంతరించుకుంటుంది. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సి గార్గ్ సోమవారం నాడిక్కడ వెల్లడించారు. తాజా నిర్ణయం నేపథ్యంలో మూలధనాన్ని సమీకరించేందుకు ఎల్‌ఐసికి ఐడిబిఐ ప్రిఫరెన్సియల్ షేర్లను జారీ చేస్తుంది.

Pages