S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/14/2018 - 23:50

న్యూఢిల్లీ, జూలై 14: భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)తో ప్రపంచంలోనే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు. ‘మున్ముందు మంచి రోజులు రాబోతున్నాయి. దేశంలో మంచి పని జరిగింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునే దశలో ఉంది.

07/14/2018 - 23:47

హైదరాబాద్, జూలై 14: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ ఇన్ఫీ 33 స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఈ ఫోన్‌ను రూ.5049లకే వినియోగదారులకు అందిస్తోంది. 5.34 అంగుళాల డిస్‌ప్లే, 1.3 గెగాహెడ్జ్ క్యాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 128జీబి స్టోరేజ్ కలిగి ఉంటుంది.

07/14/2018 - 23:46

జైపూర్, జూలై 14: వాణిజ్య లావాదేవీలు సులువుగా జరిగేందుకు వీలుగా కంపెనీ చట్టాన్ని సరళీకృతం చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. శనివారం ఇక్కడ ఆయన వాణిజ్యవేత్తల సమావేశంలో మాట్లాడుతూ, వాణిజ్య లావాదేవీలకు సంబంధించి చీటికిమాటికీ న్యాయపరమైన సమస్యలు, ప్రాసిక్యూషన్ తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాని తప్పిదాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

07/14/2018 - 23:45

న్యూఢిల్లీ, జూలై 14: కేరళ కాలికట్ విమానాశ్రయంలో పెద్ద విమానాలు ల్యాండయ్యేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. గతంలో ఈ విమానాశ్రయం నుంచి పెద్ద విమానాల రాకపోకలు ఉండేవి. కాని 2015 మే నెలలో పెద్ద విమాన సర్వీసులను రద్దుచేశారు. డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాశ్రయాలు ఉండాలని ఆయన చెప్పారు.

07/14/2018 - 23:45

ముంబయి, జూలై 14: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారం లాభపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో గణనీయంగా 883.77 పాయింట్లు పుంజుకొని 36,541.63 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 246.25 పాయింట్లు పెరిగి, మానసికంగా కీలకమయిన 11,000 పాయింట్ల స్థాయికి పైన 11,018.90 పాయింట్ల వద్ద స్థిరపడింది.

07/14/2018 - 03:10

హైదరాబాద్: ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధానాన్ని మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందని సెమినార్‌లో పలురువు ఛార్టర్ అకౌంటెట్స్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలో ఇక్కడ ది ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెట్స్ అండ్ ఇండియా (ఎస్‌ఐఆర్‌సీఐ) ఆధ్వర్యలో ‘వన్ ఇయర్ ఆఫ్ జీఎస్‌టీ- లెర్నింగ్, ఆన్‌లెర్నింగ్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.

07/14/2018 - 01:48

న్యూఢిల్లీ, జూలై 13: ప్రభుత్వ రంగ సంస్థ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)ను మూసివేసే సమస్యే లేదని కేంద్ర షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. విశాఖపట్నం ఓడరేవు సహా మూడు పోర్ట్‌లు డీసీఐలోని ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయడానికి ప్రణాళిక ఉందని ఆయన వివరించారు. ‘డిపార్ట్‌మెంట్ స్థాయిలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం.

07/14/2018 - 01:47

ముంబయి, జూలై 13: బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గురువారం సాధించిన సరికొత్త ముగింపు రికార్డు స్థాయి నుంచి శుక్రవారం స్వల్పంగా దిగజారి 36,541.63 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లను ఉత్తేజపరిచే ప్రపంచ పరిణామాలు బలంగా ఉన్నప్పటికీ, ఇటీవల ధరలు పెరిగిన షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల ఊగిసలాటలో సాగిన లావాదేవీల మధ్య కీలక సూచీలు పుంజుకోలేకపోయాయి.

07/14/2018 - 01:46

న్యూఢిల్లీ, జూలై 13: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) చైర్మన్ ముకేశ్ అంబానీ శుక్రవారం ఈ-కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాను వెనక్కి నెట్టి ఆసియా ఖండంలోనే అతి పెద్ద సంపన్నుడి స్థానాన్ని ఆక్రమించారు. చమురు శుద్ధి నుంచి టెలికం వరకు బహుళ రంగాలకు విస్తరించి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో 1.6 శాతం పెరిగి, రూ. 1,099.8కు చేరింది.

07/14/2018 - 01:45

న్యూఢిల్లీ, జూలై 13: భారత ఆర్థిక వ్యవస్థ వేసిన అంచనా ప్రకారం వృద్ధి చెందితే వచ్చే సంవత్సరం బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ వాణిజ్య యుద్ధం అంశాలు దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Pages