S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/29/2018 - 05:01

జురిచ్/న్యూఢిల్లీ: స్విస్‌కు నల్లధనం తరలిపోకుండా కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా ఆగడం లేదు. 2017లో స్విస్ బ్యాంకులో రూ.7వేల కోట్ల ధనాన్ని భారతీయులు దాచుకున్నారు. అంతకుముందు మూడేళ్ల పాటు స్విస్‌కు నల్లధనం ప్రవాహం తగ్గగా పళ్లీ పెరిగినట్లు స్విస్ బ్యాంకు వర్గాలు తెలిపాయి. అంతకు ముందుతో పోల్చితే 50 శాతం మేర నిధుల డిపాజిట్ పెరిగింది.

06/29/2018 - 00:51

ముంబయి, జూన్ 28: డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో పాటు జూన్ నెల డెరివేటివ్‌ల కాంట్రాక్టుల గడువు ముగియడం గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బాగా పెరగడం రూపాయిని బలహీనపరచింది. మార్కెట్ కీలక సూచీలు పడిపోవడం ఇది వరుసగా రెండోరోజు.

06/29/2018 - 00:47

న్యూఢిల్లీ, జూన్ 28: స్టాకిస్టులు భారీగా కొనుగోళ్లకు పూనుకోవడం వల్ల టోకు ధాన్యం మార్కెట్‌లో గురువారం బాస్మతి బియ్యం ధర క్వింటాలుకు రూ. 200 వరకు పెరిగింది. పిండి మిల్లుల నుంచి కొనుగోళ్లు పెరగడం వల్ల గోధుమల ధర కూడా పెరిగింది.

06/29/2018 - 00:46

న్యూఢిల్లీ, జూన్ 28: వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తులు లేదా సంస్థల వివరాలను వెల్లడించడం సాధ్యం కాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) స్పష్టం చేసింది. వెంకటేశ్ నాయక్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు ఈ ప్రకటన విడుదల చేసింది.

06/29/2018 - 00:45

అమరావతి, జూన్ 28: గ్రామీణ రోడ్ల అనుసంధాన ప్రాజెక్టు కింద రహదార్ల నిర్మాణానికి నాబార్డు రుణసహాయం అందించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 108 రోడ్లకు 274 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది.

06/29/2018 - 00:45

న్యూఢిల్లీ, జూన్ 28: కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన మూడు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల (పీఎస్‌జీఐసీల) విలీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లను విలీనం చేయాలని ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో ప్రతిపాదించింది.

06/28/2018 - 16:07

ముంబయి: స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ 188 పాయింట్లు క్షీణించి 35,028 వద్ద, నిఫ్టీ 83 పాయింట్లు నష్టపోయి 10,588 వద్ద కొనసాగుతోంది.

06/28/2018 - 01:10

ముంబయి, జూన్ 27: వాణిజ్య వివాదాల కారణంగా ఇప్పటికే నెలకొన్న అంతర్జాతీయ అనిశ్చితికి తోడు ముడి చమురు ధరలు మరింత పెరగటం, రూపాయి మరింత బలహీనపడటం వంటి అంశాలు బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఒక్క సెషన్‌లోనే 273 పాయింట్లు పడిపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 10,700 పాయింట్ల స్థాయికన్నా దిగువకు దిగజారింది.

06/28/2018 - 00:57

ముంబయి, జూన్ 27: దేశంలో రిటెయిల్ రుణాల మార్కెట్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో వేగంగా పెరిగిందని, ఈ రుణాలు 25 శాతం వరకు పెరిగాయని, ఈ రుణాల ఖాతాల సంఖ్య నికరంగా 32 శాతానికి పైగా పెరిగిందని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తన నివేదికలో పేర్కొంది. ఆస్తుల నాణ్యత కూడా పెరిగిందని తెలిపింది.

06/28/2018 - 00:54

హైదరాబాద్, జూన్ 27: ఫ్యాషన్, ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్‌టైల్, ఇంటీరియర్స్ రంగాల్లో ఉన్నతమైన కేరీర్ కోరుకునే విద్యార్ధులకు హైదరాబాద్‌లో ఇటాలియన్ ఫ్యాషన్ కోర్సులు ప్రారంభం అయ్యాయి. సామన కాలేజీ ఆఫ్ డిజైన్ స్టడీస్ ఈ అవకాశాన్ని విద్యార్ధులకు కల్పించింది. జెఎన్‌ఎఫ్‌ఏయు , నాగార్జున యూనివర్శిటీలతో అనుబంధ గుర్తింపు పొందిన సామన ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ స్టడీస్ కొత్త అకాడమి ప్రారంభించింది.

Pages