S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/28/2018 - 00:53

లండన్, జూన్ 27: మొక్కల్లో వ్యర్థ పదార్థాలను నైలాన్, ప్లాస్టిక్, రసాయనాలు, ఇంధనం తదితర విలువైన ఉత్పత్తులుగా మార్చే కొత్త రకం ఎంజైమ్‌లను ఇంగ్లాండ్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ పోర్ట్స్‌వౌత్ శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. ఈ పరిశోధనలను మరింత లోతుగా చేయాల్సి ఉందని, ప్రాథమికంగా కొత్త రకం ఎంజైములను కనుగొన్నామని శాస్తవ్రేత్త జాన్ మెక్ గెహన్ చెప్పారు.

06/27/2018 - 17:34

ముంబయి: దేశీయ మార్కెట్లు బుధవారం భారీగా పతనమయ్యాయి. ఏ దశలోనూ కోలుకోలేని సూచీ చివరకు 273 పాయింట్లు దిగజారి 35,217 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 98 పాయింట్ల నష్టంతో 10,671 వద్ద స్థిరపడింది.

06/27/2018 - 04:09

విజయవాడ, జూన్ 26: రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ హబ్‌గా తీర్చిదిద్దాలని చేస్తున్న ప్రయత్నాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో విజయం సాధించారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన ‘ఫ్లెక్స్’ (ఫ్లెక్స్‌ట్రానిక్స్) సంస్థ రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేలా ముఖ్యమంత్రి ఒప్పించారు.

06/27/2018 - 02:54

ముంబయి, జూన్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఊగిసలాటలో సాగిన లావాదేవీల మధ్య ఫ్లాట్‌గా ముగిశాయి. జూన్ నెల డెరివేటివ్‌ల కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనుండటంతో సెషన్ చివరలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల మార్కెట్ కీలక సూచీలు పెద్దగా పుంజుకోలేకపోయాయి.

06/27/2018 - 02:52

విశాఖపట్నం, జూన్ 26: ప్రముఖ పర్యాటక కేంద్రంగా చిత్తూరు జిల్లా మదనపల్లి హార్స్‌లీహిల్స్‌ను రూపొందించాలని ఏపీ పర్యాటక శాఖ నిర్ణయించింది. దేశ, విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా అధునాతన, వౌలిక వసతులతో కూడిన రిసార్ట్స్‌ను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది.

06/27/2018 - 02:50

ముంబయి, జూన్ 26: దేశ స్థూలార్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన నొక్కి చెప్పారు.

06/26/2018 - 05:58

ముంబయి: ప్లాస్టిక్ నిషేధం నేపథ్యంలో ప్యాకేజీలకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో మహారాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం వ్యాపారం పడిపోయిందని రిటైల్ వర్తకుల సంక్షేమ సంఘం సమాఖ్య వెల్లడించింది. గత శనివారం నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగ నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల కిరాణా దుకాణాల్లో వ్యాపారం 50 శాతం వరకు పడిపోయిందని సంఘం అధ్యక్షుడు వీరెన్ షా పేర్కొన్నారు.

06/26/2018 - 01:52

ముంబయి, జూన్ 25: అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్యపోరుతో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావడం, బలహీన పడిన రూపాయి దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా సెనె్సక్స్ 219 పాయింట్లు నష్టపోయి 35,470.35 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 59.10 పాయింట్లు నష్టపోయి 10,762.45 వద్ద ముగిసింది.

06/26/2018 - 01:51

ముంబయి, జూన్ 25: దేశంలో రాబోయే దశాబ్దకాలంలో వౌలిక సదుపాయాల కల్పనకు 4.5 ట్రిలియన్ యుఎస్ డాలర్లు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సోమవారం వెల్లడించారు. నిజానికి ఇది ఎంతో సవాలైనప్పటికీ, దేశానికి అవసరమైన ఈ నిధులకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదన్నారు.

06/26/2018 - 01:44

హైదరాబాద్, జూన్ 25: ఈ ఏడాది ప్రీమియం కలెక్షన్లను మరో 29 శాతం పెంచాలని బజాజ్ అలియాన్జ్ లైఫ్ ఇన్యూరెన్స్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ‘గత ఏడాది మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.7,578 కోట్లు కాగా వీటిల్లో రూ.4,291 కోట్లు కొత్త ప్రీమియం కలెక్షన్లు. 2018 ఆర్థిక సంవత్సరంలో కొత్త ప్రీమియం కలెక్షన్లు 29 శాతం పెరిగాయి.

Pages