S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/25/2018 - 05:29

ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి ప్రమాదం తప్పింది. కోల్‌కతా నుంచి ఆదివారం బెంగళూరుకు బయలదేరిన ఈ విమానం కేటాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే కిటికీ పగిలిన విషయాన్ని గుర్తించారు. దీనితో విమానాన్ని తిరిగి కోల్‌కతా విమానాశ్రయంలో దింపేశారు. ఇండిగో సంస్థ నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదని కొంతకాలంగా వినిపిస్తున్న విమర్శలకు ఈ తాజా సంఘటన బలాన్నిస్తున్నది.

06/25/2018 - 05:28

ముంబయి, జూన్ 24: మార్టిగేజ్ ద్వారా రుణాలు అందజేసే మాగ్మా హౌసింగ్ పైనాన్స్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల పంపిణీని రెట్టింపు అంటే రూ.1200 కోట్లకు పెంచాలని తలపోస్తున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది కాలంలో వసూలు కాని రుణాలు పెద్దమొత్తంలో పేరుకుపోవడంతో, భవన నిర్మాణ రుణాలను చాలావరకు కంపెనీ తగ్గించివేసింది.

06/24/2018 - 02:08

న్యూఢిల్లీ, జూన్ 23: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా అర్జిత్ బసును కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇంతకాలం బ్యాంకు ఎండిగా ఉన్న రజనీష్ కుమార్ చైర్మన్‌గా పదోన్నతి లభించడంతో ఆ పోస్టులో ఆర్జిత్ బసును నియమించారు. ఎస్‌బీఐ చట్టం ప్రకారం ఎస్‌బీఐకు నలుగురు ఎండీలను నియమించవచ్చును. పదోన్నతి కంటే ముందు ఆర్జిత్ బసు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలు అందించారు.

06/24/2018 - 02:11

ముంబయి, జూన్ 23: ఈ వారం చివరి సెషన్‌లో వచ్చిన ర్యాలీతో వరుసగా అయిదో వారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ స్వల్పంగా 67.46 పాయింట్లు పుంజుకొని, 35,689.60 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 4.15 పాయింట్లు పెరిగి 10,821.85 పాయింట్ల వద్ద స్థిరపడింది.

06/24/2018 - 01:45

న్యూఢిల్లీ, జూన్ 23: దేశంలోని అన్ని విమానాశ్రయాలలో జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ఉత్పత్తుల స్టాల్‌లు ఏర్పాటు చేసేందుకు ఒక విధానాన్ని రూపొందించాల్సిందిగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు అధికారులను ఆదేశించారు. దేశంలో జీఐ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ చర్య దోహదపడుతుంది.

06/24/2018 - 01:44

న్యూఢిల్లీ, జూన్ 23: మొబైల్ టవర్ సంస్థ భారతి ఇన్‌ఫ్రాటెల్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా ఎస్.బాలసుబ్రమణియన్ నియమితులయ్యారు. ఆగస్టు 10వ తేదీన ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారని ఆ కంపెనీ శనివారం తెలిపింది. ప్రస్తుతం భారతి ఇన్‌ఫ్రాటెల్ సీఎఫ్‌ఓగా ఉన్న పంకజ్ మిగ్లానీ నుంచి బాలసుబ్రమణియన్ బాధ్యతలు స్వీకరిస్తారు. పంకజ్ మిగ్లానీ భారతి గ్రూప్‌లోనే ఇతర బాధ్యతలు స్వీకరించనున్నారు.

06/24/2018 - 01:42

న్యూఢిల్లీ, జూన్ 23: దుబాయ్-ముంబయి అంతర్జాతీయ విమానయాన మార్గానికి అత్యంత రద్దీ కలిగినదిగా గుర్తింపు లభించింది. విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల మేరకు 2017-18 సంవత్సరంలో ఈ మార్గంలో దాదాపు 2.5 మిలియన్ల మంది వలసదారులు ప్రయాణించి రికార్డు సృష్టించారు. భారత్ నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే అత్యంత రద్దీ కలిగిన 10 అంతర్జాతీయ విమానయాన మార్గాల్లో మొదటిదిగా ఈ రూటు గుర్తింపు పొందింది.

06/24/2018 - 02:09

లక్నో, జూన్ 23: పండ్లలో రారాజు ఎవరంటే మామిడిపండే. ఇలాంటివి 700 రకాల మామిడి పండ్లు ఒక్కచోట చేరితో ఎలా వుంటుంది. వాటిని చూసినవారు లొట్టలు వేయాల్సిందే. లక్నోలో రెండు రోజులపాటు నిర్వహించనున్న మామిడి పండ్ల ప్రదర్శనలో దాదాపు 700 రకాల మామిడి పండ్లు దర్శనమిచ్చాయి. ఇందులో ఇంకో విశేషం ఏమిటంటే ‘యోగి’ మామిడి పండు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరుమీద కొత్తరకం మామిడి పండును ఇక్కడ ప్రదర్శించారు.

06/23/2018 - 01:45

ముంబాయి: వస్తు సేవా పన్నును (జీఎస్‌టీ) అమలులోకి వచ్చి వచ్చే జూలై 1వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది కాలంలో ఆశించినట్లుగా ఆర్థిక వ్యవస్థను జీఎస్‌టీ బలోపేతం చేయలేకపోయిందని, ఒక దేశం, ఒక పన్ను అనే విధానం వల్ల నగదుకు డిమాండ్ పెరిగిందని ఒక ఆర్థిక రంగంలో విదేశీ బ్రోకరేజి సంస్థ నివేదికలో పేర్కొంది.

06/23/2018 - 01:36

లండన్, జూన్ 22: పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్) చమురు ఉత్పత్తులను పెంచే అంశంపై ఒక ఒప్పందానికి రావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక శాతం పెరిగాయి. ప్రధానమయిన బ్రెంట్ క్రూడ్ ధర అంతర్జాతీయ కాలమానం ప్రకారం 0925 గంటలకు బారెల్‌కు 1.05 డాలర్లు పెరిగి 74.10 డాలర్లకు చేరింది.

Pages