S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/23/2018 - 01:35

ముంబయి, జూన్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం లావాదేవీలు ఊగిసలాటలో సాగినప్పటికీ సంస్థాగత మదుపరుల నుంచి కీలకమయిన మద్దతు లభించింది. దీంతో మార్కెట్లు మళ్లీ బలపడ్డాయి. మార్కెట్ కీలక సూచీలు బాగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్స క్స్ 257 పాయింట్లు పుంజుకొని 35,689.60 పాయింట్ల వద్ద ముగిసింది.

06/23/2018 - 01:19

ముంబయి/న్యూఢిల్లీ, జూన్ 22: బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో రుణాలను తీసుకుని వాటిని ఎగ్గొట్టడానికి విదేశాలకు పారిపోయిన బడా మోసగాళ్ల ఆటకట్టడానికి కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన ఫ్యుజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్‌ను మాల్యాపై ప్రయోగించడానికి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ తన తొలి అడుగు వేసింది.

06/22/2018 - 00:39

చెన్న: పారిశ్రామిక రంగంలో ఇటీవలి కాలంలో వచ్చిన ధోరణులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని తేనుంది. భారత్‌ను 2025-26 నాటికి అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయనుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం ఇక్కడ ఈ విషయం చెప్పారు.

06/22/2018 - 00:35

న్యూఢిల్లీ, జూన్ 21: దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజెడ్‌ల) నుంచి ఎగుమతులు మే నెలలో 38 శాతం పెరుగుదలతో రూ. 29,236 కోట్లకు చేరుకున్నాయి.

06/22/2018 - 00:22

ముంబయి, జూన్ 21: రెండు రోజుల పాటు లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ బలహీనపడ్డాయి. గురువారం తొలుత మార్కెట్లు లాభపడినప్పటికీ, ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చితికి తోడు దేశీయంగా స్థూల ఆర్థిక గణాంకాలు ప్రతికూలంగా ఉండటంతో మదుపరులు కొనుగోళ్లకు వెనుకంజ వేయడంతో చివరకు నష్టాలతో ముగిశాయి.

06/22/2018 - 00:21

న్యూఢిల్లీ, జూన్ 21: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గురువారం భారత మార్కెట్‌లోకి తన 6 సిరీస్ గ్రాన్ టురిస్మో మోడల్ డీజిల్ వేరియంట్ కారును విడుదల చేసింది. దీని ధర రూ. 66.5 లక్షల నుంచి మొదలవుతుంది.

06/22/2018 - 00:36

విశాఖపట్నం, జూన్ 21: దేశంలోనే తొలి వైద్య పరికరాల తయారీ కేంద్రం మెడ్‌టెక్ జోన్‌లో పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన పలువురు పారిశ్రామిక వేత్తలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు.

06/21/2018 - 16:27

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో 100 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌, చివరికి అమ్మకాల ఒత్తిడితో 115 పాయింట్ల మేర నష్టపోయింది. దీంతో 35,432 వద్ద సెన్సెక్స్‌ ముగిసింది. నిఫ్టీ సైతం 31 పాయింట్ల మేర నష్టాలు పాలై, 10,800 కింద 10,741 వద్ద స్థిరపడింది.

06/21/2018 - 01:01

న్యూఢిల్లీ: పుణేలోని రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎస్ కులకర్ణి, అతని భార్యపై నమోదయిన చీటింగ్ కేసులో పుణే పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం పోలీసులు బుధవారం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుత, మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు సహా ఆరుగురిని అరెస్టు చేశారు.

06/21/2018 - 00:56

ముంబయి, జూన్ 20: వరుసగా రెండు రోజుల పాటు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మంచి లాభాలను ఆర్జించాయి. ఒకవైపు ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల ప్రభావంతో పాటు ఇటీవల ధరలు పడిపోయిన లోహ, బ్యాంకింగ్ రంగాల షేర్లను దక్కించుకోవడానికి మదుపరులు ఉత్సాహం చూపడం వల్ల దేశీయ మార్కెట్ కీలక సూచీలు బాగా పుంజుకున్నాయి.

Pages