S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/19/2018 - 00:19

న్యూఢిల్లీ, జూన్ 18: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధార్‌ను గట్టిగా సమర్ధించారు. ప్రపంచలో అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు కార్యక్రమం అయిన ఆధార్ వల్ల ప్రయోజనాలు ఇప్పటికే స్పష్టమయ్యాయన్నారు. దీనివల్ల 121 కోట్లమంది ప్రజలు యూనిక్ ఐడీ నెంబరు హోల్డర్లకు లబ్ది చేకూరిందన్నారు.

06/19/2018 - 00:15

ముంబయి, జూన్ 18: 2019 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ రంగానికి రుణాలు స్థిరంగా ఉంటాయని అంచనా. అయితే ఎయిర్‌లైన్స్, టెలికామ్, రియల్ ఎస్టేట్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ, చక్కెర రంగాలు ఆదాయ పరమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశముందని ఒక నివేదిక పేర్కొంది. ‘్భరత కార్పొరేట్ రంగం, రుణ సమీక్ష-2019’ పేరిట ఇక్రా సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది.

06/19/2018 - 00:42

న్యూఢిల్లీ, జూన్ 18: శారదా పోంజీ మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం సతీమణి నళినీ చిదంబరంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీచేసింది. ఆమె జూన్ 20న కోల్‌కతాలోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుంది. గత మే 7న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ తనకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ సీనియర్ అడ్వకేట్ అయిన నళినీ చిదంబరం మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు.

06/18/2018 - 16:49

ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలను మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 73.88 పాయింట్లు కోల్పోయి 35,548.26 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 17.85 పాయింట్ల నష్టంతో 10,799.85 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.04గా కొనసాగుతోంది.

06/18/2018 - 04:41

న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య యుద్ధం వస్తుందేమోనని తాజాగా నెలకొన్న భయాందోళనలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల కదలికలు, రుతుపవనాల పురోగతి వంటి అంశాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా.

06/18/2018 - 02:17

న్యూఢిల్లీ, జూన్ 17: వచ్చే తరం మొబైల్ సేవల కోసం 6000 ఎంహెచ్‌జడ్ స్పెక్ట్రమ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు టెలికాం మంత్రిత్వశాఖకు చెందిన 5జి కమిటీ పేర్కొంది. ఈ నివేదికను కేంద్రానికి సమర్పించారు. ఈ నివేదికను ఆమోదిస్తే దేశంలో అతి పెద్ద స్పెక్ట్రమ్ అందుబాటులోకి వస్తుంది. ఈ వివరాలను నిపుణుల కమిటీ సభ్యుడు ఆరోగ్యస్వామి పాల్‌రాజ్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న డాటా స్పీడ్ 50 శాతం అదనంగా పెరుగుతుందన్నారు.

06/18/2018 - 02:17

హైదరాబాద్, జూన్ 17: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, చివరకు ప్రధాని మోడితో ఈ విషయంపై చర్చించక పోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ ఉక్కు ప్లాంట్ ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

06/18/2018 - 02:14

ముంబాయి, జూన్ 17: నిన్న మొన్నటి వరకు వెనకబడిన ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం వౌలికసదుపాయాలను అభివృద్ధి చేయడం, ఎయిర్ కనెక్టివిటీని పెంచడంతో పర్యాటకుల సంఖ్య పెరిగింది. పర్యాటకుల సంఖ్యలో ఈ ఏడాది కూడా 10 నుంచి 12 శాతం వృద్ధిరేటునమోదవుతుందని కాక్స్ కింగ్స్ హెడ్ రిలేషన్ షిప్స్ ప్రతినిధి కరణ్ ఆనంద్ చెప్పారు.

06/17/2018 - 04:16

న్యూ ఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయూష్మాన్ భారత్ నేషనల్ ఆరోగ్య బీమా పథకం కింద త్వరితగతిన క్లైమ్‌లను పరిష్కరించడంలో జాప్యం చేసే బీమా కంపెనీలపై పెనాల్టీలను విధించనున్నారు. ఈ ప్రతిపాదనను కేంద్రం చురుకుగా పరిశీలిస్తోంది. 15 రోజుల్లోగా క్లైమ్‌ను పరిష్కరించని పక్షంలో, క్లైమ్ సొమ్ముపై వారానికి ఒక శాతం చొప్పున పెనాల్టీని విధిస్తారు.

06/17/2018 - 02:11

ముంబయి, జూన్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో వారం లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో 178.47 పాయింట్లు పుంజుకొని, 35,622.14 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 74.03 పాయింట్లు పెరిగి 10,817.70 పాయింట్ల వద్ద స్థిరపడింది.

Pages