S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/17/2018 - 02:09

లండన్, జూన్ 16: విజయ్ మాల్యా కేసులో లండన్‌కోర్టులో భారత్ బ్యాంకులకు కొంత ఉపశమనం లభించింది. బ్యాంకులకు కోర్టు ఖర్చుల కింద రెండు లక్షల పౌండ్లను చెల్లించాలని లండన్ కోర్టు మద్యం వ్యాపారి, ఇంగ్లాండ్‌లో ఆశ్రయం పొందుతున్న విజయ్ మాల్యాను ఆదేశించింది. భారత్‌కు చెందిన 13 బ్యాంకులను రూ.9వేల కోట్ల మేర మోసం చేసి చెల్లించకుండా లండన్‌కు మద్యం వ్యాపారి విజయ్ మాల్యా ఉడాయించిన విషయం విదితమే.

06/17/2018 - 02:07

ముంబాయి, జూన్ 16: ఐసిఐసిఐ బ్యాంకు సిఇవో, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్‌పై వచ్చిన ఆర్థిక అభియోగాలకు సంబంధించి విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ అంగీకరించారు. తన భర్త పెట్టుబడి పెట్టిన కంపెనీకి ఆర్థిక ప్రయోజనాలు కల్పించే విధంగా చందా కొచ్చర్ వ్యవహరించారనే అభియోగాలు వచ్చిన విషయం విదితమే.

06/17/2018 - 02:05

రామగిరి, జూన్ 16: అడ్రియాల గనికి ప్రతినెల బొగ్గు ఉత్పత్తి 2లక్షల టన్నుల లక్ష్యాన్ని యాజమాన్యం కేటాయించింది. దేశంలోనే అతి పెద్ద గనిగా పేరొందిన అడ్రియాల గనిలో ఉత్పత్తి వేగం పుంజుకుంది. రూ.1226 కోట్లతో ఈ గనిని నిర్మించారు. 2014 అక్టోబర్ 15న ఈ గనిని ప్రారంభించారు. మొదటి ఫ్యానల్‌లో బొగ్గు తీయడం సక్సెస్ అయ్యింది. ప్రస్థుతం దేశంలో అన్ని భూగర్బ గనులు 300 మీటర్ల లోతును దాటలేదు.

06/17/2018 - 02:04

హైదరాబాద్, జూన్ 16: రానున్న వర్షాకాలంలో సైతం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కల్గకుండా జాగ్రతలు తీసుకోవాలని సంస్థ డైరెక్టర్ భట్టిప్రోలు భాస్కర్‌రావు ఏరియా మేనేజర్లకు సూచించారు. శనివారం సింగరేణి భవనంలో ఏరియా మేనేజర్లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

06/16/2018 - 02:38

ముంబయి: వస్తుసేవల పన్ను ఆదాయం పెరగడం, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు అదనంగా రూ.37,426 కోట్ల ఆదాయం గడిస్తాయని ఎస్‌బిఐ రీసెర్చి సంస్ధ ప్రకటనలో పేర్కొంది. దేశంలోని 24 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో కనీస పన్ను వృద్ధి రేటు కంటే ఎక్కువగా 14 శాతం మేరకు పన్నుల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటాయి.

06/16/2018 - 02:12

ముంబయి, జూన్ 15: అమెరికా-చైనాల మధ్య మళ్లీ వాణిజ్య వివాదం తలెత్తడంతో దాని ప్రతికూల ప్రభావం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అయితే, సెషన్ చివరలో ఐటీ, ఫార్మా షేర్ల కొనుగోలుకు మదుపరులు పూనుకోవడంతో కీలక సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. రూ.

06/16/2018 - 02:11

న్యూఢిల్లీ, జూన్ 15: అమెరికా, భారత్‌కు చెందిన వాణిజ్య అధికారులు త్వరలో సమావేశమై ఇరు దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఎగుమతులపై రాయితీలు, ఉక్కు, అల్యూమినియం, వైద్య పరికరాల దిగుమతులపై సుంకాల ఎత్తివేత, వీసా సమస్యలు చర్చకు వస్తాయని ఆయన చెప్పారు. గత వారం మంత్రి సురేష్ ప్రభు అమెరికాలో పర్యటించారు.

06/16/2018 - 02:09

న్యూఢిల్లీ, జూన్ 15: ప్రభుత్వ రంగ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.20 లక్షల కోట్ల మేర మొండి బకాయిలను రద్దు చేయడంతో, నష్టాల ఊబిలో కూరుకుని పోయాయి. బ్యాంకుల మొండి బకాయిలు పేరుకుపోవడంతో నిరర్ధక ఆస్తుల విలువ పెరిగింది. దీనికి నష్టాలు తోడయ్యాయి. ఈసమయంలో ఇక ఎప్పటికీ వసూలు కాని బకాయిలను మాఫీ చేశారు. దీనివల్ల నష్టాలు ఒకటిన్నర రెట్లు పెరిగాయి.

06/16/2018 - 02:08

ముంబయి, జూన్ 15: భారత్‌లో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో వృద్దిరేటు పుంజుకుంటుందని, రెండవ ఆరు నెలల్లో వత్తిడికి గురై వృద్ధిరేటు 7.5 శాతానికి చేరుకుంటుందని జపాన్‌కుచెందిన బ్రోకరేజి సంస్థ తెలిపింది.

06/16/2018 - 02:08

న్యూఢిల్లీ, జూన్ 15: దేశంలో 2018 తొలి త్రైమాసికంలో అమ్ముడు పోయన మొత్తం స్మార్ట్ ఫోన్లలో 38 శాతం ఆన్‌లైన్ ద్వారానే విక్రయాలు జరిగాయ. దేశంలో ఇ-కామర్స్ వ్యాపారం వృద్ధిచెందుతోందని, ఆన్‌లైన్ కొనుగోళ్లకు ప్రజలు మొగ్గుచూపుతున్నారని మార్కెట్ మానిటర్ సర్వీసు అనే సంస్థ పేర్కొంది. కాగా స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ఫ్లిప్‌కార్ట్ వాటా 54 శాతం నమోదైంది.

Pages