S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/16/2018 - 02:06

న్యూఢిల్లీ, జూన్ 15: భారత్ వాణిజ్య లోటు నాలుగు నెలల కాలంలో గరిష్టంగా 14.62 బిలియన్ డాలర్లకు చేరుకుందని, దిగుమతులు 15 శాతం పెరిగాయని కేంద్రం తెలిపింది. ఎగుమతులు మే నెలలో 28.18 శాతం పెరిగాయని, వీటివిలువ 28.86 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. దిగుమతులు 14.85 శాతం పెరిగాయని, వీటివిలువ 43.48 డాలర్లకు చేరుకుందన్నారు.

06/15/2018 - 03:47

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో డేటా ఎంతవరకు సురక్షితమనే అంశంపై ప్రపంచ దేశాలు భారత్‌ను సునిశితంగా పరిశీలిస్తున్న తరుణంలో, గూగుల్ తన క్లౌడ్ ఫ్లాట్‌ఫామ్‌పై కస్టమర్ల భద్రతకు పూర్తి హామీ ఇచ్చింది. ‘కస్టమర్ల విశ్వాసాన్ని కోల్పోతే మా వ్యాపారం దెబ్బతింటుంది. అందువల్ల మా కస్టమర్ల డేటా భద్రతకు మేం పూర్తి బాధ్యత తీసుకుంటాం’ అని గూగుల్ క్లౌడ్ సొల్యూషన్స్ డైరెక్టర్ మైల్స్ వార్డ్ అన్నారు.

06/15/2018 - 02:02

హూస్ట్టన్, జూన్ 14: అమెరికాలో అతిపెద్ద మోటారు వాహనాల తయారీ కంపెనీ, జనరల్ మోటార్స్ (జీఎం)కు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా ఇండియన్-అమెరికన్ మహిళ దివ్య సూర్యదేవర నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కార్పొరేట్ ఫైనాన్స్‌కు వైస్-ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

06/15/2018 - 02:00

ముంబయి, జూన్ 14: దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజుల లాభాలకు తెరపడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం గురువారం స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో పాటు మే నెలలో టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠ స్థాయిలో 4.43 శాతం నమోదు కావడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.

06/15/2018 - 01:58

న్యూఢిల్లీ, జూన్ 14: టోకు ధరల ద్రవ్యోల్బణం మే నెలలో 14 నెలల గరిష్ట స్థాయి 4.43 శాతానికి చేరుకుంది. పెట్రోధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడమే దీనికి కారణమని, వీటి ధరల నియంత్రణకు కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. టోకుధరల సూచిక ప్రకారం ద్రవ్యోల్బణం గత ఏడాది ఏప్రిల్‌లో 3.18 శాతానికి, మే నెలలో 2.26 శాతం నమోదైంది. ఈ వివరాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.

06/15/2018 - 01:57

న్యూఢిల్లీ, జూన్ 14: అంతర్జాతీయంగా చమురు ధరలను హెచ్చుతగ్గులకు తావులేకుండా సమతౌల్యంగా ఉండే విధంగా చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాలు (ఒపెక్)దేశాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. చమురు ధరల నియంత్రణ సరిగాలేకపోవడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చమురు ధరలపై ఒపెక్ దేశాల రాయబారులతో కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చర్చించారు.

06/15/2018 - 01:56

ముంబయి, జూన్ 14: భారత్‌లో పత్తి ఎగుమతులు ఈ ఏడాది గణనీయంగా 43 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయి. దాదాపు 10 మిలియన్ బేల్స్ పత్తి ఎగుమతి కావచ్చని కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఏఐ) పేర్కొంది. చైనాకు పత్తి ఎగుమతి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. 2017-18లో 7 మిలియన్ బేల్స్ పత్తి ఎగుమతి అవుతోంది. ఇప్పటికే 6.2 మిలియన్ బేల్స్ పత్తి ఎగుమతైనట్లు సిఐఏ తెలిపింది.

06/15/2018 - 01:56

తడ/వరదయ్యపాళెం, జూన్ 14: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీ పారిశ్రామిక వాడలో వైండింగ్ వైర్ల తయారీ సంస్థ జి.కె వైండింగ్ లిమిటెడ్ నూతన ఉత్పత్తికేంద్రం నిర్మాణానికి గురువారం శ్రీసిటీలో భూమిపూజ చేశారు. ఈ సంస్థ నోయిడా ప్రధాన కేంద్రంగా 1975వ సంవత్సరంలో స్థాపితమైంది. ఈ సంస్థకు ఉత్తర భారతదేశంలో ఇప్పటికే 3 ఉత్పత్తికేంద్రాలు ఉన్నాయి.

06/15/2018 - 01:55

న్యూఢిల్లీ, జూన్ 14: పెట్రోలు, డీజిల్ ధరల్లో వరుసగా రెండో రోజూ కూడా ఎటువంటి మార్పు లేదు. అంతకు ముందు 15 రోజుల పాటు పెట్రో ధరలు వరుసగా ప్రతి రోజూ ఎంతో కొంత తగ్గిస్తూ వచ్చారు. ఈ నెల 12వ తేదీన లీటర్ పెట్రోలుపైన 15పైసలు, లీటర్ డీజిల్ పైన 10 పైసలు తగ్గించారు. లీటర్ పెట్రోలు ధర ఢిల్లీలో రూ.76.43 పైసలు, డీజిల్ రూ. 67.85పైసలకు విక్రయిస్తున్నారు.

06/14/2018 - 05:47

న్యూఢిల్లీ, జూన్ 13: ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ వద్ద రూ. 408.48 కోట్లతో నెలకొల్పనున్న ప్రత్యేక ఆర్థిక మండలికి (సెజ్) అనుమతి ఇవ్వాలని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కేంద్రాన్ని కోరింది. ఇక్కడ ఐటి, ఐటి ఆధారిత సేవల సంస్థలను నెలకొల్పేందుకు సెజ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌సిఎల్ పేర్కొంది. ఈ ప్రతిపాదనను వాణిజ్య శాఖ పరిశీలిస్తోంది. ఈ నెల 1వ తేదీన వాణిజ్య అంతరంగిక బోర్డు సమావేశమవుతోంది.

Pages