S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/13/2018 - 00:47

ముంబయి, జూన్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం బాగా బలపడ్డాయి. మార్కెట్ కీలక సూచీలు నాలుగు నెలల గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా తీర్చిదిద్దే అంశంపై అమెరికా, ఉత్తర కొరియాల మధ్య జరిగిన చరిత్రాత్మక శిఖరాగ్ర స్థాయి చర్చలు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి.

06/13/2018 - 00:46

న్యూఢిల్లీ, జూన్ 12: ఎయిర్ ఇండియాను ఏ విధంగానైనా వదిలించుకునేందుకు కేంద్రం కసరత్తును తీవ్రంగా చేసంది. ఈ సారి వంద శాతం వాటాలను అమ్మేయాలనుకుంటోంది. గతంలో 76 శాతం వాటాలను అమ్మేస్తామనుకుంది. కాని ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఒక్క బిడ్డర్ కూడా ముందుకు రాలేదు. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు వీలుగా నిర్దేశించిన మార్గదర్శకాల్లో మార్పులు తేనున్నారు.

06/12/2018 - 02:52

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వెనక్కి వచ్చిన నగదు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, అలాగే ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న రాని బాకీల పరిమాణం మొదలైన అంశాలతోపాటు ఇతరత్రా కీలక విషయాలపైన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను పార్లమెంటరీ ప్యానల్ మంగళవారంనాడు ప్రశ్నించబోతోంది.

06/12/2018 - 02:05

న్యూఢిల్లీ, జూన్ 11: పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.13వేల కోట్ల కుంభకోణంతో సంబంధమున్న నీరవ్ మోదీకోసం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని, సీబీఐ ఇంటర్‌పోల్‌ను కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు సీబీఐకు ఫిర్యాదు చేయడానికి ముందే నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయారు. స్విట్జర్లాండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి గ్రూప్ ఫోటోలో ఉన్న భారతీయ కార్పొరేట్ దిగ్గజాలతోపాటు నీరవ్ మోదీ కూడా ఉన్నారు.

06/12/2018 - 02:03

న్యూఢిల్లీ, జూన్ 11: టెక్నాలజీ రంగంలో ఉద్యోగావకాశాలను అనే్వషిస్తున్న వారికి బెంగళూరు ప్రధాన కేంద్రంగా మారిందని, ఈ రంగంలో ఉపాధి అవకాశాలను అందిస్తున్న నగరాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, పుణె నగరాలు రెండు మూడో స్థానంలో ఉన్నాయని తాజాగా జరిగిన ఓ సర్వేలో స్పష్టమైంది.

06/12/2018 - 02:01

ముంబయి, జూన్ 11: అంతర్జాతీయ పరిణామాలు, ఇతర అంశాలు సోమవారం భారత స్టాక్ మార్కెట్ లావాదేవీలపై మిశ్రమ ప్రభావం కనబరిచాయి. వీటి ఫలితంగా వివిధ దశల్లో ఊగిసలాడిన మార్కెట్లు స్వల్ప లాభంతో ముగిశాయి. ఒకపక్క జీ-7 పారిశ్రామిక దేశాల శిఖరాగ్ర సదస్సు, మరోవైపు అమెరికా-ఉత్తర కొరియా శిఖరాగ్ర భేటీ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఊగిసలాడాయి.

06/12/2018 - 01:59

న్యూఢిల్లీ, జూన్ 11: పరిశ్రమలకు అవసరమైన రీతిలో పాఠ్య ప్రణాళికను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల మధ్య కొనసాగుతున్న వివక్ష ఎంతోకాలం కొనసాగబోదని ఇది క్రమంగా తగ్గుముఖం పడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సమస్య ప్రధాని, రాష్టప్రతి స్థాయిలో పరిశీలనలో ఉన్నదన్నారు.

06/11/2018 - 16:52

ముంబయి: దేశీయ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 39.80పాయింట్లు లాభ పడగా.. నిఫ్టీ 19.30 పాయింట్లు లాభపడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్స్‌క్స్‌ 39.80 పాయింట్లు లాభపడి 35,483.47వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 19.30పాయింట్లు లాభపడి 10,786.95వద్ద ముగిసింది.

06/11/2018 - 03:31

న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల పారిశ్రామికోత్పత్తి సహా కీలకమయిన స్థూలార్థిక గణాంకాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల కదలికలు, రుతుపవనాల పురోగతి వంటి అంశాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ ధోరణిని నిర్దేశిస్తాయనేది నిపుణుల అంచనా. 3అమెరికా ఫెడ్ పాలసీపైనే మదుపరుల దృష్టి నెలకొని ఉంటుంది.

06/11/2018 - 01:17

ముంబయి, జూన్ 10: వచ్చే దీపావళి పండగ నాటికి బంగారం ధరలు పెరిగే అవకాశాలున్నాయి. పదిగ్రాముల బంగారం రూ. 34వేలకు చేరుకుంటుంధని కామెంట్రెజ్ రిస్క్ మేనేజిమెంట్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ త్యాగరాజన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా చోటు చేసుకుంటున్న మార్పులు, రూపాయి మారకం విలువ తగ్గడం తదితర కారణాల వల్ల పసిడి ధరలు పెరుగుతాయన్నారు.

Pages