S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/10/2018 - 00:46

లా మాల్బై (కెనడా), జూన్ 9: గ్రూపు-7 దేశాల కూటమిలో రష్యా దేశాన్ని కలుపుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇక్కడ జరిగిన గ్రూపు-7దేశాధినేతల సదస్సులో ఆయన మాట్లాడుతూ రష్యాను చేర్చుకునే విషయమై గ్రూప్-7 దేశాలు ఆలోచించాలని కోరారు. 2014లో క్రెమియాను రష్యా సేనలు ఆక్రమించినందుకు ఆ దేశాన్ని గ్రూప్-7 దేశాల కూటమి నుంచి తొలగించారు.

06/09/2018 - 02:35

న్యూఢిల్లీ: రెండు రోజుల పాటు బాగా బలపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో స్వల్పంగా నష్టపోయాయి. ఇంధన, లోహ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 19 పాయింట్లు పడిపోయి, 35,443.67 పాయింట్ల వద్ద ముగిసింది.

06/09/2018 - 01:12

న్యూఢిల్లీ, జూన్ 8: భారత్‌లో విదేశీ పెట్టుబడులు 3 శాతం పెరిగాయని, దీని వల్ల 2017-18లో 61.96 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిఐపిపి కార్యర్శి రమేష్ అభిషేక్ తెలిపారు. అంతకు ముందు ఏడాది విదేశీ పెట్టుబడులు 60 బిలియన్ డాలర్లు వచ్చాయన్నారు. గత నాలుగేళ్లలో దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 222.75 డాలర్లని చెప్పారు.

06/09/2018 - 01:11

న్యూఢిల్లీ, జూన్ 8: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ముఖేష్ అంబానీ మరో ఐదేళ్ల పాటు కొనసాగే విధంగా తమ ఆమోదాన్ని తెలియచేయాలని ఆ సంస్థ తన వాటాదారులను కోరింది. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో 1977 నుంచి ఉంటున్నారు. 2002 జూలైలో రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ మరణించిన తర్వాత ముఖేష్ అంబానీ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు.

06/09/2018 - 01:10

ముంబాయి, జూన్ 8: బ్యాంకులను పటిష్టం చేసేందుకు అసెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీని (ఏఆర్‌సి) ఏర్పాటు చేయడంపై సిఫార్సులు చేసేందుకు ఒక కమిటీని నియమిస్తున్నామని, రెండు వారాల్లో ఈ కమిటీ నివేదిక ఇస్తుందని ఆర్థిక శాఖమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. శుక్రవారం ఆయన జాతీయ బ్యాంకుల చైర్మన్లతో సమావేశమై బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని సమీక్షించారు.

06/09/2018 - 01:02

న్యూఢిల్లీ, జూన్ 8: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఇ-కామర్స్ లావాదేవీలు నిర్వహించే సంస్థలపై వచ్చిన అభియోగాలను విచారించే బాధ్యత ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు, ఆర్‌బీఐకు అప్పగించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఈ అభియోగాలపై సరైన రీతిలో దర్యాప్తు చేసే అధికారం ఈ రెండు సంస్థలకు ఉందని ఆయన చెప్పారు.

06/09/2018 - 01:24

న్యూఢిల్లీ, జూన్ 8: వచ్చే రెండేళ్లలో భారత్ స్థూల జాతీయోత్పత్తి రేటు (జిడిపి) 8 శాతానికి చేరుకుంటుందని, దీని కోసం అవసరమైన సంస్కరణలను అమలు చేస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. వచ్చే ఏడేళ్లలో అమెరికాతో సమానంగా సాలీనా ఐదు ట్రిలియన్ డాలర్ల సైజుకు భారత్ ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుందని, దీనికి తగ్గట్టుగా కొత్త పారిశ్రామిక విధానాలను తేనున్నట్లు ఆయన తెలిపారు.

06/08/2018 - 17:04

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెనె్సక్స్ వంద పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ ఆరంభించింది. ఒకదశలో 130 పాయింట్లకు పైగా నష్టపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెనె్సక్స్ 19 పాయింట్ల నష్టంతో 35,444 వద్ద, నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 10,768 వద్ద స్థిరపడింది.

06/08/2018 - 13:38

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 154, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 67.54గా ఉంది.

06/08/2018 - 03:44

న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో దేశంలోని అన్ని విద్యుత్ మీటర్లను స్మార్ట్ ప్రిపెయిడ్ మీటర్లుగా మారుస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ చెప్పారు. వచ్చే మూడేళ్లలో స్మార్ట్ మీటర్లను అమర్చుతారని, దీని వల్ల కరెంటు బిల్లులు ఇంటింటికి తిరిగి ఇచ్చే విధానం ఉండదని ఆయన చెప్పారు.

Pages