S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/08/2018 - 00:45

న్యూఢిల్లీ, జూన్ 7: భారతీయ శ్రీమంతుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేష్ అంబానీ వరుసగా పదవ ఏడాది కూడా తన వార్షిక వేతనం రూ.15 కోట్లకే పరిమితం చేశారు. 2008-09 నుంచి తన వార్షిక వేతనం రూ.15 కోట్ల మేర ముఖేష్ అంబానీ డ్రా చేస్తున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తాజా నివేదికలో పేర్కొంది. ఇదే కంపెనీలో ఇతర సిఇవోల వేతనాలు అదే కాలంలో పెరుగుతూ వచ్చాయి.

06/08/2018 - 01:07

న్యూఢిల్లీ, జూన్ 7: పెట్రో, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. పెట్రోలు ధర లీటర్‌కు 9 పైసలు చొప్పున, డీజిల్ లీటర్‌కు 7 పైసలు చొప్పున తగ్గించారు. తొమ్మిదో రోజు కూడా వరుసగా ఇంధన ధరలు తగ్గాయి. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని, ఈ ధరలు సామాన్య మానవుడిపై భారం పడనివ్వకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

06/08/2018 - 00:43

* అంచనా వ్యయం రూ. 4 వేల కోట్లు * టెండర్లను ఆహ్వానించిన కేంద్రం

06/08/2018 - 01:09

న్యూఢిల్లీ, జూన్ 7: భారత్ ఆర్ధిక లోటు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 3.3 శాతానికి మించదని మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీసస్ ప్రకటించింది. బడ్జెట్‌లో నిర్దేశించిన విధంగా పెట్టుబడుల వినియోగం తగ్గినా ఆర్థికలోటు మాత్రం 3.3 శాతానికి మించి ఉండదని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు, సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ విలియమ్ పోస్టర్ తెలిపారు.

06/08/2018 - 00:40

న్యూఢిల్లీ, జూన్ 7: ఎయిరిండియా వాటాలను వేలానికి పెట్టినా ఒక్కరు కూడా కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో, మళ్లీ ఈ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు కొత్త ప్రతిపాదనలు తేవాలని కేంద్రం నిర్ణయించింది. కొనుగోలుకు సంబంధించి బిడ్డింగ్ మార్గదర్శకాలను సవరించనున్నారు. ఎయిరిండియా కొనుగోలుకు బిడ్డర్లు ముందుకు రాకపోవడానికి కారణాలపై కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ విశే్లషిస్తోం ది.

06/08/2018 - 01:10

ముంబయి, జూన్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు గురువారం లాభపడ్డాయి. ఇటీవల ధరలు పడిపోయిన స్థిరాస్తి, లోహ, ఇంధన, బ్యాంకింగ్ షేర్లను మదుపరులు విరివిగా కొనుగోలు చేయడంతో మార్కెట్ కీలక సూచీలు బాగా పుంజుకున్నాయి.

06/07/2018 - 16:37

ముంబయి: దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాలను లాభాలను నిలబెట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 280 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 10,700 మార్క్‌ను దాటింది.మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 284 పాయింట్లు ఎగబాకి 35,463 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 10,768 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.05గా కొనసాగుతోంది.

06/07/2018 - 02:05

న్యూఢిల్లీ: రెపో రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచడం వల్ల బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతాయని, దీనివల్ల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. ఆర్‌బిఐ బుధవారం రేపో రేట్లను పెంచడం వల్ల పెట్టుబడులపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలనే సంకేతాలు ఇచ్చినట్లయిందని కొంత మంది నిపుణులంటున్నారు. రెపో రేటును పెంచడం తొందరపాటు నిర్ణయమనే వాళ్లు కూడా ఉన్నారు.

06/07/2018 - 01:26

ముంబయి, జూన్ 6: నాలుగేళ్లలో మొదటి సారిగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపోరేటును ప్రస్తుతం అమలులో ఉన్న 6 శాతానికి అదనంగా 0.25 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. దీని వల్ల బ్యాంకుల గృహ రుణాలు, వాహనాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ముడి చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం వత్తిడితో రేపోరేటును పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ద్రవ్య పరపతి కమటీ ప్రకటించింది.

06/07/2018 - 01:27

న్యూఢిల్లీ, జూన్ 6: దివాళా ప్రక్రియ చట్టం పరిధిలో ఉన్న ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్ సంస్థ రూ. 7400 కోట్ల వాటాలను రుణాలు ఇచ్చిన సంస్థలకు కేటాయించింది. ఇందులో ఎస్‌బిఐకు 37 శాతం వాటాలను దక్కాయి. మైనింగ్ దిగ్గజం వేదాంత స్టార్ సంస్థ ఈ కంపెనీని టేకోవర్ చేయనుంది. 740 కోట్లను 26 మంది రుణదాతలకు కేటాయించారు. ఇందులో ఎస్‌బిఐకు దాదాపు 271.61 కోట్ల వాటాలు వచ్చాయి.

Pages