S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/16/2018 - 02:17

న్యూఢిల్లీ, మే 15: ఆదాయం పన్ను శాఖ ఐటిఆర్-2ను మంగళవారం ప్రారంభించింది. 2018-19 సంవత్సరానికి మూడవ ఆదాయ రిటర్న్ దరఖాస్తు ఫారాన్ని ఆదాయం పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, హిందూ అవిభక్త కుటుంబాలు తమ వ్యాపారం ద్వారా వచ్చే లాభాలపై కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయ వివరాలను ఐటిఆర్-2 ద్వారా తెలియచేయాల్సి ఉంటుంది.

05/16/2018 - 02:16

న్యూఢిల్లీ, మే 15: ఈ ఏడాది రెండవ అర్థ సంవత్సరంలో ద్రవ్యోల్బణం రేటు సగటున 5.1 శాతం నమోదు కావచ్చని, గత ఏడాది ఇదే కాలంలో 3.6 శాతం నమోదైందని హెచ్‌ఎస్‌బిసి పేర్కొంది. గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసస్ హెచ్‌ఎస్‌బిసి ఈ వివరాలను విడుదల చేసింది. చమురు ధరలు పెరిగే అవకాశం, రూపాయి క్షీణించడం, ఎక్కువ కరెన్సీ చలామణిలో ఉండడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది.

05/16/2018 - 02:15

హైదరాబాద్, మే 15: ఆటోమేషన్ మొబైల్ సేల్స్ రంగంలో దూసుకుపోతున్న వినిట్ సంస్థ తన సేవలను విస్తృతపరిచింది. భారతదేశంతో పాటు మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ ఆఫ్రికా దేశానికి విస్తరించింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఒలామ్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రసిడెంట్ సతీస్ కన్నన్ ఓ ప్రకటనలో తెలిపారు.

05/16/2018 - 02:14

కొత్తగూడెం, మే 15: సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రంతోపాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తికి చర్యలు చేపట్టిందని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్ శ్రీ్ధర్ ప్రకటించారు. 100 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మంగళవారం హైద్రాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గుర్తింపు కార్మిక సంఘం నాయకులతో స్ట్రక్చర్ సమావేశం నిర్వహించారు.

05/15/2018 - 02:26

ముంబయి, మే 14: దేశం మొత్తం మంగళవారం వెలువడబోయే కర్నాటక ఫలితాలపై దృష్టి కేంద్రీకరించడంతో, ఆ ప్రభావం సోమవారం దేశీయ మార్కెట్లపై పడింది. స్థూల ఆర్థిక డేటా కూడా నిస్తేజంగా ఉన్న ప్రభావం కూడా మార్కెట్లపై చూపింది. ఫలితంగా దేశీయ మార్కెట్లు సోమవారం స్తబ్దుగా ముగిసాయి. కర్నాటకలపై ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, భాజపాల మధ్య నువ్వానేనా అన్న రీతిలో పోటీ వున్నట్లుగా చూపాయి.

05/15/2018 - 02:25

బీజింగ్, మే 14: చైనా ప్రభుత్వ ఆధీనంలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) కేవలం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకోసం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసింది. వృద్ధి వేగం రెండంకెల స్థాయికి వేగంగా చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో, చైనా పెట్టుబడిదార్లకు, భారత్ మార్కెట్లు ఎంతో అనుకూలమని బ్యాంకు పేర్కొంది.

05/15/2018 - 02:23

న్యూఢిల్లీ, మే 14: గత ఏప్రిల్ నెలలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు బాగా పెరిగాయి. అంతకు ముందు నెలతో పోలిస్తే 1726 యూనిట్లు పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ ఏఎన్‌ఆర్‌ఓసీకె వెల్లడించింది. ఇదే ఏడు నగరాల్లో మార్చి నెలలో ఇళ్ల అమ్మకాలు 1382 యూనిట్లుగా నమోదయ్యాయి.

05/15/2018 - 02:21

విజయవాడ, మే 14: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రిలయన్స్ ఏడీఏ గ్రూపు అధినేత అనిల్ అంబానీ వెలగపూడి సచివాలయంలో సోమవారం భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య రాంబిల్లిలో ఆ గ్రూపు నిర్మించనున్న నేవల్ షిప్ బిల్డింగ్ యార్డుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

05/15/2018 - 02:17

విజయవాడ, మే 14: దాదాపు 4వేల కోట్ల రూపాయల భారీ నష్టాలతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఏపీఎస్ ఆర్టీసీని నష్టాల బారి నుంచి ఏదోవిధంగా బయట పడేసేందుకు యాజమాన్యం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. గత ఏడాదిగా ఎం మాలకొండయ్య, కొద్ది మాసాలుగా ప్రస్తుత ఎండీ ఎన్వీ సురేంద్రబాబు ఓవైపు ఆక్యుపెన్సీ రేషియో పెంపునకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి వాణిజ్య ఆదాయం పెంపుపై దృష్టి సారించారు.

05/15/2018 - 02:16

న్యూఢిల్లీ, మే 14: పదవీ విరమణ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దరఖాస్త్ఫురాలపై సెల్ఫీ ఫోటోలను ఉపయోగించవద్దని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎవరైనా అటువంటి ఫోటోలు ఉంచినట్లయితే వాటిని అనుమతించబోమని తెలిపింది. సివిల్ పింఛనుదార్లు ఏం చేయాలి, ఏం చేయకూడదనే వాటిపై నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం నల్లకళ్లద్దాలను ధరించిన కలర్ ఫోటోలను అనుమతించరు.

Pages