S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/14/2018 - 17:06

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ కేవలం 20 పాయింట్లు మాత్రమే లాభపడి 35.556 వద్ద క్లోజైంది. నిఫ్టీ కూడా 10,806 మార్కు వద్ద సెటిలైంది. శుక్రవారం ముగింపుకు సోమవారం ముగింపుకు పెద్దగా మార్పేమీ లేదు.

05/14/2018 - 01:26

న్యూఢిల్లీ, మే 13: ఆర్థిక నేరాలకు పాల్పడుతూ, నిధులను మళ్లించే డొల్ల (షెల్) కంపెనీలకు చెక్ పెట్టాలని కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అనేక కంపెనీలు కాగితాలకే పరిమితమైన కంపెనీలను ఏర్పాటు చేసి నిధులను మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డొల్ల కంపెనీలకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించాలని కేంద్రం భావిస్తోంది.

05/14/2018 - 01:27

లండన్, మే 13: బ్రిటన్‌లోని ఐశ్వర్యవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న భారత సంతతికి చెందిన హిందూజ సోదరులు రెండవ స్ధానానికి దిగజారారు. ఆ దేశానికి చెందిన రసాయనిక పరిశ్రమల పారిశ్రామికవేత్త జిమ్ రాట్‌క్లిఫ్ మొదటి స్థానంలో నిలిచారు. బ్రిటన్ ఐశ్వర్యవంతుల జాబితాను సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకటించింది.

05/14/2018 - 01:28

న్యూఢిల్లీ, మే 13: ఇ రిక్షా టైర్లకు వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) 28 శాతం శ్లాబు వర్తిస్తుందని ముంబాయికి చెందిన అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇ-రిక్షా టైర్లను మోటార్ వాహనాల కేటగిరీలో మోటారు వాహనాల చట్టం కింద నమోదు చేశారు. అందు వల్ల ఇ-రిక్షాలు 28% జీఎస్‌టీ శ్లాబ్ పరిధిలో వస్తాయని ఏఏఆర్ పేర్కొంది.

05/14/2018 - 01:30

న్యూయార్క్, మే 13: విదేశాలకు వెళ్లి కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్మును ఇంటికి పంపించే దేశాల్లో భారత్ ప్రపంచం మొత్తం మీద అగ్రస్థానంలో ఉంది. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు జీవనోపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి పనిచేస్తారు. ఆసియా పసిఫిక్ రీజియన్‌లోని దేశాలకు 2017 సంవత్సరంలో 256 బిలియన్ల డాలర్లను ఇంటికి పంపించారు.

05/14/2018 - 01:00

న్యూఢిల్లీ, మే 13: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు, ముడి చమురు ధరల కదలికలు, కొన్ని బ్లూచిప్ కంపెనీల నాలుగో త్రైమాసిక (క్యూ4) ఫలితాలు వంటి అంశాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల సరళిని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా.

05/13/2018 - 00:37

న్యూఢిల్లీ, మే 12: బీఎస్‌ఎన్‌ఎల్‌కు (భరతీయ సంచార నిగమ్ లిమిటెడ్) నెట్‌వర్క్ రంగంలో విస్తరించేందుకు అద్భుతమైన అవకాశాలు ఉ న్నాయని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల నెట్‌వర్క్ కింద రూ. 150కోట్లను బిఎస్‌ఎన్‌ఎల్‌కు కేటాయించామని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. నెట్‌వర్క్ ఫర్ స్పెక్ట్రమ్, ఫైబర్ టు ది హోం లాంటి రంగాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ విస్తరణకు ప్రణాళికలను రూ పొందించినట్లు ఆయన చెప్పారు.

05/13/2018 - 00:25

విశాఖపట్నం, మే 12: గల్ఫ్ దేశాలకు వలసపోతున్న ఉత్తరాంధ్ర కార్మికుల సంఖ్య ప్రతి ఏడాది పెరిగిపోతోంది. దుబాయ్, షార్జా, కువైట్ దేశాల్లో ఉండే చమురు కంపెనీల్లో పనిచేసేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల కార్మికులు తరలివెళ్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడే విజయనగరం జిల్లా కరవుజిల్లాగానే ఉండిపోయింది.

05/13/2018 - 00:36

వాషింగ్టన్, మే 12: అమెరికాలో తయారైన ఔషధాలు, వైద్య పరికరాలకు ధరలను ఖరారు చేసే బాధ్యతను వాణిజ్య ధరల సంప్రదింపుల కమిటీ స్వీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఆదేశించారు. అమెరికా ఉత్పత్తులకు విదేశీ సంస్థలు ధరలు ఖరారు చేయడం సమ్మతం కాదని స్పష్టం చేశారు. అమెరికా సంస్థల్లో జరిగిన పరిశోధనలతో తయారైన ఔషధ, వైద్య పరికరాల ఉత్పత్తులకు విదేశీ సంస్థలు ధరలను నిర్ణయించడమేంటని ఆయన అన్నారు.

05/13/2018 - 00:34

ముంబయి, మే 12: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో మంచి లాభాలతో ముగిశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ మొత్తంమీద బుల్స్ ఆధిక్యమే కొనసాగి, కీలక సూచీలు బాగా పుంజుకున్నాయి.

Pages