S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/11/2018 - 00:40

న్యూఢిల్లీ, మే 10: విమానాల్లో ప్రయాణీకులకు మొబైల్ సేవలు అందించే విషయమై టెలికాం, పౌర విమానయాన శాఖాధికారుల మధ్య వచ్చే వారం ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఈ వివరాలను టెలికాం ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 1 వ తేదీన టెలికాం కమిషన్ విమానంలో మొబైల్ సేవలు అందించే ప్రతిపాదనకు అనుమతి ఇచ్చింది.

05/11/2018 - 00:39

న్యూఢిల్లీ, మే 10: ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో భారతీయ కంపెనీల స్వాధీనాలు, విలీనాల (ఎంఅండ్‌ఎలు) విలువ గతంతో పోలిస్తే 8 రెట్లు పెరిగాయి. ఇదే నెలలో నిర్వహించిన 40 లావాదేవీల విలువ 19.1 బిలియన్ యుఎస్ డాలర్లు. 2017 మార్చి తర్వాత కుదిరిన వివిధ డీల్‌లు అన్నింటికంటే ఇదే అధికమని గ్రాంట్ ధోర్న్‌టన్ నివేదిక వెల్లడించింది.

05/10/2018 - 17:02

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో సానుకూలంగా మొదలైనా చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 73 పాయింట్లు క్షీణించి 35,246 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు తక్కువగా 10,716 వద్ద ముగిశాయి.

05/10/2018 - 01:26

న్యూఢిల్లీ, మే 9: అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్, భారత్‌లోని అతిపెద్ద ఈ-కామర్స్ ప్లేయర్ ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసింది. ఈ మేరకు జపాన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి డీల్ కుదిరిందని సాఫ్ట్ బ్యాంకు సీఈఓ మసయోషి సన్, బుధవారం బ్యాంకు త్రైమాసిక ఫలితాలను ప్రకటించే సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఈ డీల్‌పై ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్‌ల నుంచి అధికారిక ప్రకటన వెలువడనున్నది.

05/10/2018 - 01:17

వాషింగ్టన్/న్యూఢిల్లీ, మే 9: వర్తమాన ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక ప్రగతి 7.4 శాతం నమోదుకానున్నదని, తర్వాత 7.8 శాతానికి పెరగనున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. వస్తుసేవల పన్ను (జీఎస్టీ), నోట్ల రద్దు ప్రభావాలనుంచి దేశం కోలుకుంటోందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక ప్రగతికి ఆసియా మంచి చోదకశక్తిగా ఉన్నదని, ప్రపంచ ప్రగతిలో 60 శాతం ఇక్కడే చోటుచేసుకుంటున్నదని పేర్కొంది.

05/10/2018 - 01:15

న్యూఢిల్లీ, మే 9: భారతీయ బ్యాంకులు విదేశీ ఆర్థిక సంస్థలనుంచి తక్కువ వడ్డీకే రుణాలను సమీకరించుకునే యత్నాల్లో పడ్డాయి. దేశంలో 210 బిలియన్ డాలర్ల మేర నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరించే దిశగా దేశం ముందుకు వెళుతున్నట్టు దీన్ని బట్టి తెలుస్తోంది. ఈ ప్రక్రియ వల్ల యాక్సిస్ బ్యాంకు లిమిటెడ్, ఇండస్‌లాండ్ బ్యాంకు లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ బ్యాంక్ లిమిటెడ్‌లు తక్షణం ప్రయోజనం పొందనున్నాయి.

05/10/2018 - 01:13

బీజింగ్, మే 9: భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత గట్టిపడాలంటే ఇరు దేశాల ఆకాంక్షలు, ఆసక్తులపట్ల పరస్పరం సానుభూతితో వ్యవహరించాలని భారత దౌత్యాధికారి గౌతమ్ బాంబేవాలా అభిప్రాయపడ్డారు. భారత్-చైనా 8వ ద్వైపాక్షిక చర్చలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయాల్సిన తరుణంలో, బాంబేవాలా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

05/10/2018 - 01:11

న్యూఢిల్లీ, మే 9: లింగమార్పిడి వర్గం కింద పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డు తీసుకోవాలనుకున్నా, ఉన్న పాన్‌ను లింగమార్పిడి వర్గం కిందకు మార్చుకోవాలనుకున్నా ప్రత్యేకమైన ధ్రువీకరణ పత్రమేదీ సమర్పించాల్సిన పనిలేదని ఆదాయ పన్నుల శాఖ స్పష్టం చేసింది.

05/09/2018 - 00:48

ముంబయి, మే 8: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఎదుగూ బొదుగూ లేకుండా ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బాగా పెరగడం తో పాటు భౌగోళిక రాజకీయ అనిశ్చితి నెలకొని ఉన్న పరిస్థితులలో మదుపరులు లాభా ల స్వీకరణకు పూనుకోవడం వల్ల దేశీయ మా ర్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ విలువ మంగళవారం సుమారు 7శాతం పెరిగింది.

05/09/2018 - 00:36

న్యూఢిల్లీ, మే 8: దేశంలో 174 జిల్లాల్లో సీఎన్‌జీ గ్యాస్, ఇంటింటికీ పైప్ ద్వారా వంట గ్యాస్‌ను సరఫరా చేసేందుకు సంబంధించి 86 అనుమతులను ఇచ్చేందుకు వీలు గా అతి పెద్ద బిడ్డింగ్ ప్రక్రియను కేంద్రం మంగళవారం ప్రారంభించింది. 174 జిల్లాలకు సీఎన్‌జీ గ్యాస్, పైప్ ద్వారా వంట గ్యాస్ సరఫరాకోసం 86 భౌగోళిక ప్రాంతాలను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 174 జిల్లాలు విస్తరించి ఉంటాయి.

Pages