S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/05/2018 - 00:35

న్యూఢిల్లీ, మే 4: చక్కెరపై సెస్ విధింపును జీఎస్టీ కౌన్సి ల్ వ్యతిరేకించింది. ఇదే సమయంలో డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహకాల అంశాన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు వదిలేసింది. శుక్రవారం ఇక్కడ జీఎస్టీ కౌన్సిల్ 27వ సమావేశం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా దీన్ని పూర్తి ప్రభుత్వ అధీన సంస్థగా మార్చేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశ వివరాలను అరుణ్ జైట్లీ వివరించారు.

05/04/2018 - 16:47

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల కారణంగా ఒక దశలో200పాయిం‍ట్లకుపైగా క్షీణించిన సెన్సెక్స్‌ 188 పాయింట్లు పతనమై 34,915వద్ద నిఫ్టీ61 పాయింట్లు నష్టపోయి 10,618 వద్ద ముగిసింది. వారాంతంలో దాదాపు అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

05/04/2018 - 00:11

ముంబయి, మే 3: కారుబొగ్గు (పెట్ కోక్), బొగ్గు, డీజిల్ ధరలు పెరగడం వల్ల సమీప భవిష్యత్తులో సిమెంట్ కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, వాటి రుణాలపైనా ప్రభావం చూపనుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో పేర్కొంది.

05/04/2018 - 00:15

ముంబయి, మే 3: నాలుగు రోజుల పాటు పెరిగిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ధోరణి ప్రభావం వల్ల గురువారం పడిపోయింది.

05/04/2018 - 00:12

న్యూ ఢిల్లీ, మే 3: రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెరగకపోవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంకేతాలు ఇచ్చింది. కాగా జూన్ నెలలో ప్రకటించే ద్రవ్య విధానంలో రెపోరేట్‌ను పెరిగే అవకాశాలు లేకపోలేదని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య ఇటీవల సూత్రప్రాయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే వడ్డీ రేట్లు పెరిగాయి.

05/04/2018 - 00:01

విశాఖపట్నం, మే 3: ఏజెన్సీ ప్రాంతాల్లో వాహనచోదకులకు పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంచేందుకు, గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఏపీలో 20 పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేయాలని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 13 పెట్రోల్ బంక్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ప్రతి ఏడాది వంద కోట్లకు పైగానే ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

05/04/2018 - 00:14

విజయవాడ, మే 3: నూతన ఆవిష్కరణలకు, సాంకేతికతకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రయోగశాలగా ఎంపిక చేసుకోవచ్చునని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనంద్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. వెలగపూడి సచివాలయంలో సీఎంను గురువారం రాజన్ కలిశారు. ఈ సందర్భంగా సీఎం తమ పాలనలోను, భద్రతా చర్యలలోనూ వినియోగిస్తున్న సాంకేతికతను గూర్చి వివరించారు.

05/03/2018 - 23:58

విశాఖపట్నం, మే 3: గుంటూరు రైల్వే డివిజన్‌లో సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎం.ప్రసాద్, కాంట్రాక్టర్ వద్ద నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి విశాఖ సీబీఐ అధికారులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిర్యాదిదారుడు రైల్వేలో పారిశుధ్య కాంట్రాక్టర్.

05/03/2018 - 23:57

ముంబయి, మే 3: కర్ణాటక ఎన్నికలు, వృద్ధి రేటు పెరుగుదల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి కరెన్సీ, నోట్లరద్దుకు పూర్వపు స్థాయికి చేరుకుంటోందని, ఒక నివేదిక వెల్లడించింది. ‘కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలు, నామమాత్ర కార్యకలాపాల వల్ల నగదుకు డిమాండ్ కు బహుశా కారంణం కావచ్చు’ అని జపాన్‌కు చెందిన బ్రోకరేజ్ సంస్థ నోమురా వెల్లడించింది.

05/03/2018 - 14:22

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 64, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 66.62గా ఉంది.

Pages