S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/02/2018 - 00:14

న్యూఢిల్లీ, మే 1: ఎయిర్‌సెల్ మాజీ ప్రమోటర్ సి.శివశంకరన్‌కు చెందిన కంపెనీలకు తమ బ్యాంకు ఇచ్చిన రుణాలకు సంబంధించిన పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తనిఖీ చేసిందని ఐడీబీఐ బ్యాంక్ సోమవారం తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఐడీబీఐ 2014 ఫిబ్రవరిలో యాక్సెల్ సన్‌షైన్ లిమిటెడ్‌కు ఇచ్చిన రుణం 2015 డిసెంబర్‌లో నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా మారింది. ఈ విషయాన్ని ఐడీబీఐ..

05/02/2018 - 00:11

న్యూఢిల్లీ, మే 1: సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీం కోర్టులో నెలకొన్న పరిస్థితిని ఒక విపత్తు అని సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోథా అన్నారు. రోస్టర్‌కు సర్వాధిపతి ప్రధాన న్యాయమూర్తి అని చెబుతూనే, వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా కేసుల కేటాయింపులో పారదర్శకత పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై రాజీలేదన్నారు.

05/01/2018 - 15:45

న్యూఢిల్లీ: వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చిన తరువాత 1.03 లక్షల కోట్ల పన్ను వసూలైనట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో పన్ను వసూలవ్వటం గమనార్హం. రానున్న నెలల్లో జీఎస్టీ మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

05/01/2018 - 01:15

పాలకొండ, ఏప్రిల్ 30: భవన నిర్మాణాలకు అవసరమైన ఇటుకులను తయారు చేసే వ్యాపారులు పెట్టుబడులకు వెనుకంజ వేయకుండా డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రోజురోజుకు విస్తరింప చేస్తున్నారు. గతంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో తయారైన ఇటుకలను భవన నిర్మాణాలకు తెచ్చుకొనేవారు. ప్రస్తుతం ప్రతి మండలంలోనూ ప్రధాన రహదారికి అనుసరించి బ్రిక్స్ ఇండస్ట్రీ విస్తరిస్తోంది.

05/01/2018 - 00:58

కొత్తగూడెం రూరల్, ఏప్రిల్ 30: కొత్తగూడెం ఏరియా 99 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించి ముందు భాగంలో నిలిచిందని ఏరియా జిఎం కెవి రమణమూర్తి అన్నారు. సోమవారం రుద్రంపూర్‌లోని ఏరియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం ఏరియాకు సంస్థ నిర్దేశించిన 9.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికిగాను 9.07 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి అగ్ర స్థానంలో నిలవటం అభినందనీయమని అన్నారు.

05/01/2018 - 00:33

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: మదుపర్లను తప్పుదోవ పట్టించే విధంగా షేర్ల ‘కొనుగోళ్ల’పై పెద్ద ఎత్తున ఎస్‌ఎంఎస్‌లు చేస్తున్న 28 సంస్థలను సెబీ నిషేధించింది. కల్పా కమర్షియల్ సంస్థకు (కేసీఎల్) చెందిన షేర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సిందిగా ఈ సంస్థలు పెద్ద ఎత్తున ఎస్‌ఎంఎస్‌లను మదుపర్లకు పంపాయి. ఈ షేర్లను కొంటే లాభాలు తప్పనిసరి అంటూ ఆ ఎస్‌ఎంఎస్‌ల్లో పేర్కొంటుండటంతో, కొందరు మధ్యవర్తులు

05/01/2018 - 00:31

ముంబయి, ఏప్రిల్ 30: వరుసగా మూడోరోజు కూడా మార్కెట్లు లాభాల్లో నడిచాయి. సోమవారం సెనె్సక్స్ 191 పాయింట్లు లాభపడి 35,160 మూడునెల్ల గరిష్ఠాన్ని నమోదు చేయగా, నిఫ్టీకూడా 47.05 పాయింట్లు ఎగసి 10,739.35 వద్ద ముగిసింది.

05/01/2018 - 00:29

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: నీతీ ఆయోగ్ కొత్త అభివృద్ధి అజెండాతో ముందుకు రానున్నది. ‘న్యూ ఇండియా- 2022’ పేరుతో ప్రవేశపెట్టనున్న ఈ అజెండాతో ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు అవసరమైన వ్యూహాలను నీతీ ఆయోగ్ ఇందులో వెల్లడించనున్నది.

04/30/2018 - 04:10

న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరంలో రత్నాలు ఆభరణాల ఎగుమతులు 8 శాతం మేర తగ్గి, 32.72 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకున్నాయి. యుఎస్ సహా పెద్ద మార్కెట్లలో డిమాండ్ పడిపోవడమే ఇందుకు కారణం. రత్నాలు ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జిజెఈపీసీ) సమాచారం ప్రకారం, రత్నాలు ఆభరణాల ఎగుమతులు 2016-17లో 35.47 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగాయి.

04/30/2018 - 02:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహింద్రా బ్యాంక్ వంటి బ్లూచిప్ కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు, ముడి చమురు ధరల సరళి, స్థూలార్థిక గణాంకాలు, రూపా యి చలనం వంటి అంశాలు సోమవారం నుంచి మొదలుకానున్న రానున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ సరళిని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా. మంగళవారం 3మహారాష్ట్ర దినోత్సవం2 కాబట్టి స్టాక్ మార్కె ట్లు పనిచేయవు.

Pages