S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/30/2018 - 02:00

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: భారత ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రగతి 7.5 శాతంగా నమోదయ్యే అవకాశమున్నదని డచ్ బ్యాంకు అంచనా వేసింది. ‘2018-19 ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థిక ప్రగతి 7.5 శాతం ఉండబోతున్నదని మా అంచనా (ఆర్‌బీఐ అంచనా 7.4%) 2017-18లో నమోదైన 6.7 శాతం నుంచి ఈ స్థాయికి ఆర్థిక ప్రగతి చేరుకుంటుంది’ అని బ్యాంకు పేర్కొంది.

04/30/2018 - 01:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: పది అత్యంత విలువయిన భారతీయ కంపెనీలలోని ఏడు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (ఎం-క్యాప్) ఈ వారంలో రూ. 69,917.79 కోట్లు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) అత్యధికంగా లబ్ధి పొందింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రిల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, కోటక్ మహింద్రా బ్యాంక్ మార్కెట్ విలువ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో పెరిగాయి.

04/30/2018 - 01:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఈ నెలలో ఇప్పటి వరకు విదేశీ మదుపర్లు భారత మూలధన మార్కెట్ నుంచి రూ.15,500 కోట్ల మేర తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. రూపాయి బలహీన పడటం, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, యుఎస్-చైనాల మధ్య వాణి జ్య సంబంధాలు అస్థిరతకు లోనుకావడం ఇందుకు ప్రధాన కారణం. గత నెలలో రూ.11,654 కోట్ల మేర ఇన్‌ఫ్లో ఉండగా, రుణ మార్కెట్ నుంచి రూ.9,000 కోట్లు ఔట్‌ఫ్లో నమోదైంది.

04/29/2018 - 04:55

* 83శాతం మంది భారతీయ ఉద్యోగుల ధోరణి పఇండీడ్ జాబ్ సైట్ సర్వేలో వెల్లడి

04/29/2018 - 04:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కనీసం 7.5 శాతంగా ఉండనున్నదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అంచనా వేశారు. పెట్టుబడుల సైకిల్, సామర్ధ్య వినియోగం మెరుగుపడటం వల్ల ఇది సాధ్యం కాగలదన్నారు. గత 47 నెలలుగా చేపట్టిన సంస్కరణలను సంఘటితం చేయడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని కోరారు.

04/29/2018 - 05:07

కోల్‌కతా, ఏప్రిల్ 28: భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)తోనే రెండు దేశాల మధ్య మరింతగా వాణిజ్య విస్తరణ జరుగుతుందని చైనా పేర్కొంది. ‘వర్తకం మరియు పెట్టుబడుల విషయంలో రెండు దేశాల్లో కొన్ని అడ్డంకులు ఉన్నాయని నేను వింటున్నా. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరినట్లయితే రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా పరస్పర మార్పిడులకు అవకాశం ఏర్పడుతుంది’ అని కోల్‌కతాలోని చైనా కాన్సులేట్ జనరల్ మా ఝాన్‌వూ అన్నారు.

04/29/2018 - 05:08

ముంబయి, ఏప్రిల్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా అయిదో వారం బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారం 554.12 పాయింట్లు పుంజుకొని 34,969.70 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ మదుపరులకు మానసికంగా కీలకమయిన 10,700 పాయింట్ల స్థాయికి చేరువలో 10,692.30 పాయింట్ల వద్ద స్థిరపడింది.

04/29/2018 - 05:11

రాజేంద్రనగర్, ఏప్రిల్ 28: రానున్న నాలుగు సంవత్సరాల్లో దేశంలో వంటనూనెల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించేందుకు మిషన్ మోడ్‌లో కార్యక్రమాలు చేపడతామని కేంద్ర వ్యవసాయ, రైతుసంక్షేమశాఖ సహాయమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు.

04/29/2018 - 04:43

హైదరాబాద్, ఏప్రిల్ 28: వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే మరో46 ప్రత్యేక రైళ్లను శనివారం ప్రకటించింది. విశాఖపట్నం-సికింద్రాబాద్, విశాఖపట్నం-తిరుపతి మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించగా, నాందేడ్- పనె్వల్ మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది.

04/28/2018 - 00:23

కాసిపేట: ఆసిఫాబాద్ జిల్లా కుమ్రం భీం జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో మరో నూతన బ్రాండ్‌ను అధికారులు ఆవిష్కరించారు. దేవాపూర్ ప్లాంట్‌లో ఇప్పటి వరకు బిర్లా ఎ1 బ్రాండ్‌ను ఉత్పత్తి చేసిన ఓరియంట్ యాజమాన్యం నూతనంగా స్ట్రాంగ్ క్రీట్‌ను మొదటిసారిగా శుక్రవారం లాంచింగ్ చేసారు.

Pages