S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/03/2018 - 02:23

ముంబయి, ఏప్రిల్ 2: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజైన సోమవారం మార్కెట్లు కళకళలాడాయి. సెనె్సక్స్ 287 పాంయిట్లు పెరిగి 33,255 వద్ద ముగియగా, నిఫ్టీ 98.10 పాయింట్లు పెరిగి 210,211.80 వద్ద ముగిసింది. గత గురు, శుక్రవారాల్లో మహావీర్ జయంతి, గుడ్‌ఫ్రైడే సందర్భంగా మార్కెట్లకు సెలవులు. కాగా కొత్త ఆర్థిక సంవత్సరం, సోమవారం ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.

04/03/2018 - 02:21

ముంబయి, ఏప్రిల్ 2: దేశీయ ఔషధ మార్కెట్ బాగానే ఉన్నప్పటికీ, యుఎస్‌లో నెలకొన్న మాంద్యం, ఇతరులనుంచి ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో ఈ రంగ ఆదాయ వృద్ధి కేవ లం ఒకే అంకెకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2017-18 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో ఈ రంగం ఆదాయం 7-10 శాతం మధ్య ఉండవచ్చునని ఒక నివేదిక అంచనా వేసింది. గత ఐదేళ్లకాలంగా ఫార్మా రంగం రెండంకెల అభివృద్ధి సాధించింది.

04/03/2018 - 02:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రపంచంలో టాప్ 200 విశ్వవిద్యాలయాలలో భారత్‌కు చెందిన రెండు విద్యాసంస్థలు మాత్రమే చోటు దక్కించుకోగలిగాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఐఐటీ ఢిల్లీకి ఈ జాబితాలో స్థానం లభించింది.

04/03/2018 - 02:20

హైదరాబాద్, ఏప్రిల్ 2: కూరగాయలు పండించేందుకు విపరీతమైన రసాయన ఎరువులు, రసాయన పురుగుమందులను రైతులు ఉపయోగిస్తుండంతో ప్రజల ఆరోగ్యం పాడవుతోందని చాలా మంది తమ ఇళ్ల మిద్దెలపై తోటలు (రూఫ్ గార్డెన్) పెంచడం ప్రారంభించారు. మార్కెట్లో లభిస్తున్న ఆకుకూరలు, కాయగూరలపై రసాయన అవశేషాలు అధికంగా ఉండటంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు.

04/03/2018 - 02:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఎనిమిది కీలక రంగాలు ఫిబ్రవరి మాసంలో 5.3% వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా రసాయన ఎరువులు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్ రంగాల పనితీరు అద్భుతంగా ఉండటం వల్లనే ఇది సాధ్యమైంది. బొగ్గు, ముడి చమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలు 2017 ఫిబ్రవరిలో కేవలం 0.6 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.

04/02/2018 - 04:40

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అంతర్ రాష్ట్ర సరుకు రవాణాకు ఎలక్ట్రానిక్ వే బిల్లు (ఈ-వే బిల్లు) విధానం ఆదివారం అమలులోకి వచ్చింది. ఈ-వే బిల్లులను జారీ చేయడానికి ఉద్దేశించిన పోర్టల్ సజావుగా పనిచేస్తోందని వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్) అధికారులు తెలిపారు. అయితే, కర్ణాటక మాత్రం రాష్ట్రం లోపల సరుకు రవాణాకు కూడా ఈ-వే బిల్లు విధానాన్ని అమలు చేస్తోంది.

04/02/2018 - 04:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1:ప్రపంచ వ్యాప్తంగా తక్కువ సమయంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్, బెంగళూరు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. విఖ్యాత స్థిరాస్థి వ్యవహారాల కన్సల్టెన్సీ సంస్థ జెఎల్‌ఎల్ ‘30 గ్లోబల్ షార్ట్ టెర్మ్ గ్రోత్ సిటీస్’ నివేదికను విడుదల చేసింది. ఆ సంస్థ పేర్కొన్న ‘షార్ట్ టెర్మ్ మూమెంటమ్ ర్యాంకింగ్స్’లో భారతీయ నగరాలు మంచి స్థానాలను పొందాయి.

04/02/2018 - 04:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.12,700 కోట్లను జీఎస్‌టీ క్లైములకు తిరిగి చెల్లింపులకోసం మంజూరు చేసింది. ఇది అర్హులైన ఎగుమతి దారులు చేసిన క్లైముల్లో ఇది 80 శాతం. ఈ మేరకు మార్చి 15-31 మధ్యకాలంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ‘తిరిగి చెల్లింపు క్యాంపులను’ నిర్వహించింది.

04/02/2018 - 04:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధానం, స్థూలార్థిక గణాంకాలు, ప్రపంచ స్టాక్ మార్కెట్ల సరళి సోమవారం నుంచి మొదలయ్యే ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయని నిపుణులు అంచనా వేశారు. 3దేశీయ స్టాక్ మార్కెట్లలో ఏప్రిల్ నెలలో నెమ్మదిగా కదలిక వస్తుంది. సానుకూల గణాంకాల ఆధారంగా దిగువ స్థాయిలో ఉన్న మార్కెట్లు తిరిగి పుంజుకుంటాయి.

04/02/2018 - 04:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారి భగ్గుమన్నాయి. లీటరు పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ.73.73, రూ.64.58కి చేరుకున్నాయి. గత నాలుగేళ్ల కాలంలో ఇంతటి స్థాయిలో పెంచడం ఇదే ప్రథమం. పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తామని ప్రభుత్వం ఒక పక్క ప్రకటించినా, పెట్రోల్, డీజిల్ ధరలు దేశ రాజధాని ఢిల్లీలోఏకంగా లీటరుకు 18 పైసలు చొప్పున చమురు కంపెనీలు పెంచేశాయి.

Pages