S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/02/2018 - 04:22

హైదరాబాద్, ఏప్రిల్ 1: దక్షిణ మధ్య రైల్వే ముగిసిన 2017-18 ఆర్ధిక సంవత్సరానికి సరుకు రవాణా ద్వారా రూ.8627.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఈ మొత్తం 2016-17తో పోలిస్తే 10.3 శాతం అధికమని పేర్కొన్నారు.

04/02/2018 - 04:37

సత్తుపల్లి, ఏప్రిల్ 1: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జలగం వెంగళరావు (జేవీఆర్) ఓపెన్‌కాస్ట్ బొగ్గుగని 2017-18 సంవత్సరానికి గాను సింగరేణి చరిత్రలోనే అత్యధిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కేవీ రమణమూర్తి తెలిపారు. 2017-18 సంవత్సరానికి నిర్దేశించిన 55లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను ఈ గని 57.98 లక్షల టన్నులు సాధించిందన్నారు.

04/01/2018 - 04:56

న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 2030 నాటికి తన చమురు శుద్ధి సామర్థ్యా న్ని సుమారు రెండింతలు చేసి, 150 మిలియన్ టన్నులకు పెంచడానికి సుమారు రూ. 1.43 లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు శనివారం తెలిపింది. 32040 నాటికి ఇంధన అవసరాలు సుమారు రెండింతలు పెరుగుతాయని అంచనా.

04/01/2018 - 03:32

వరంగల్, మార్చి 31: శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు వరంగల్‌లో అనూహ్యమైన స్పందన ఉందని శ్రీలంక ఎయిర్‌లైన్ తెలుగు రాష్ట్రాల మేనేజర్ చమ్మిక ఇడ్డగాడేజ్ అన్నారు. శనివారం వరంగల్ మార్కెట్‌పై సర్వే చేయడానికి ఇక్కడికి వచ్చిన సందర్బంగా ప్రత్యేకంగా ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తమ ఎయిర్‌లైన్ మెరుగైన సేవలు అందిస్తుందని అన్నారు.

04/01/2018 - 03:30

ముంబయి, మార్చి 31: సెలవులతో కుదించబడిన ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. మార్కెట్ కీలక సూచీలు పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారంలో 372.14 పాయిం ట్లు (1.14 శాతం) పుంజుకుంది. అయితే, ఈ సూచీ మానసికంగా కీలకమయిన 33,000 పాయింట్ల స్థాయికన్నా దిగువనే 32,968.68 పాయింట్ల వద్ద ముగిసింది.

04/01/2018 - 03:28

విజయవాడ, మార్చి 31: దశాబ్దకాలం పైగా నష్టాల ఊబిలో చిక్కుకుని సతమతమవుతున్న ఏపీఎస్‌ఆర్టీసీని నష్టాలు లేని సంస్థగా మార్చేందుకు సిబ్బంది సహకారంతో అనేక రకాలుగా ప్రయత్నాలు చేశానని రాష్ట్ర డీజీపీ డాక్టర్ ఎం.మాలకొండయ్య అన్నారు. ఏది ఏమైనా ప్రస్తుత ఎండీ సురేంద్రబాబు తన కంటే సమర్థుడని అన్నారు.

04/01/2018 - 03:25

విజయవాడ, మార్చి 31: కోస్తా ఆంధ్రాలో మల్టీస్పెషాలిటీ వైద్య సర్వీసులను అందిస్తున్న రమేష్ హాస్పిటల్స్ తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంఘమిత్ర హాస్పిటల్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.

04/01/2018 - 03:25

న్యూఢిల్లీ, మార్చి 31: ఈ వారంలో విలువయిన లోహాలు బంగారం, వెండి ధరలు పడిపోయాయి. సెలవుల వల్ల కుదించబడిన ఈ వారం బులియన్ మార్కెట్‌లో అధిక ధరల వద్ద మదుపరుల నుంచి ఆదరణ లభించకపోవడంతో పాటు నగల వ్యాపారులు, రిటెయిలర్ల నుంచి కూడా డిమాండ్ లేకపోవడంతో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావం కూడా దేశీయ బులియన్ మార్కెట్‌పై పడిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

03/31/2018 - 04:13

న్యూఢిల్లీ: ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రూ. 50వేలకు పైగా విలువ గల సరుకులను రవాణా చేయడానికి వ్యాపారులు, ట్రాన్స్‌పోర్టర్లు ఆదివారం నుంచి ఎలక్ట్రానిక్ వే బిల్లు (ఈ-వే బిల్లు)ను తీసుకోవడం తప్పనిసరి. పన్ను ఎగవేయకుండా ఈ-వే బిల్లు పద్ధతి దోహదపడుతుందని ప్రభు త్వం భావిస్తోంది. దీనివల్ల పన్నుల వసూళ్లు పెరుగుతాయని పేర్కొంటోంది.

03/31/2018 - 03:14

రాజ్‌కోట్, మార్చి 30: భారతీయ స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) మార్కెట్ క్రమంగా కోలుకుంటోంది. 2020 నాటికి ఇది మరింత మెరుగైన స్థితికి చేరుకుటుందని ఐకాన్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. గత కొనే్నళ్లుగా దేశంలో రియల్ ఎస్టేట్ రంగం మాంద్యంలో పడిపోయింది. కానీ 2020 నాటి కి ఈ రంగం బాగా పుంజుకుంటుందని నివేదిక స్పష్టం చేసింది.

Pages