S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/15/2018 - 04:34

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు.

03/15/2018 - 02:03

ముంబయి, మార్చి 14: లోహ, వాహన రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు స్వల్పంగా పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 21 పాయింట్లు పడిపోయి, 33,835.74 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 15.95 పాయింట్లు దిగజారి, 10,410.90 పాయింట్ల వద్ద స్థిరపడింది.

03/15/2018 - 02:02

హైదరాబాద్, మార్చి 14: లైఫ్ సైనె్సస్ ఇన్‌ఫ్రాస్టక్చర్ ఫండ్ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేస్తున్నట్టు టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని పరిశ్రమ భవన్‌లో బాలమల్లు అధ్యక్షతన టీఎస్‌ఐఐసీ పాలకవర్గ సమావేశం జరిగింది.

03/15/2018 - 02:01

న్యూఢిల్లీ, మార్చి 14: ప్రభుత్వం రానున్న సంవత్సరాలలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని విమానాలు, డ్రోన్లకు కూడా వర్తింప చేయనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు బుధవారం తెలిపారు. ప్రభుత్వం ఇంకెంత మాత్రం విమానాలు, డ్రోన్లు అన్నింటికి దిగుమతులపై ఆధారపడబోదన్నారు. వచ్చే కొనే్నళ్లలో దేశానికి 1,300 విమానాల అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

03/14/2018 - 04:11

న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు తగిన మద్దతిచ్చే రీతిలో ప్రణాళికలను రూపొందించాలని, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పౌర విమానయాన మంత్రిత్వశాఖ అధికార్లను కోరారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఆయన పౌర విమానయాన శాఖ అదనపు బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విధానానికి సంబంధించి రూపొందించిన ముసాయిదాను, అభిప్రాయాల కోసం ఇతర మంత్రిత్వశాఖలకు పంపామని మంత్రి తెలిపారు.

03/14/2018 - 01:38

న్యూఢిల్లీ, మార్చి 13: నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీల వల్ల దేశంలో డిజిటల్ చెల్లింపులు మరింత ఊపందుకున్నాయి. ఇదే పోకడ కొనసాగితే 2025 నాటికి దేశంలో వార్షిక డిజిటల్ లావాదేవీలు ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరగలవని ఒక నివేదిక అంచనా వేసింది. ఎసిఐ వరల్డ్‌వైడ్, ఎజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీలు సంయుక్తంగా రూపొందించిన ఈనివేదిక ప్రకారం 2025 నాటికి ప్రతి 5 లావాదేవీల్లో 4 డిజిటల్‌కు సంబంధించినవే ఉంటా యి.

03/16/2018 - 11:03

ముంబయి, మార్చి 13: సోమవారం ట్రేడింగ్‌లో దూసుకెళ్లిన మార్కెట్లు మంగళవారం తడబడ్డాయి. మొదట లాభాల్లో ప్రారంభమైనా మిడ్ సెషన్ తర్వాత అమ్మకాలు జోరందుకోవడంతో నష్టాల్లో ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 61.16 పాయింట్లు పడిపోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మాత్రం స్వల్పంగా 5.45 పాయింట్లు స్వల్ప లాభంతో ముగిసింది.

03/14/2018 - 01:35

న్యూఢిల్లీ, మార్చి 13: 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఆయిల్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీలు అత్యధిక లాభాలను నమోదు చేయగా, బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్ ఇండియా, ఎంటిఎన్‌ఎల్‌లు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే స్పష్టం చేసింది.

03/14/2018 - 01:33

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థల మధ్య మంగళవారం విత్తనాల సరఫరాకు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు నేతృత్వంలో మంగళవారం ఇక్కడ ప్రత్యేక సమావేశం జరిగింది.

03/14/2018 - 00:55

న్యూఢిల్లీ, మార్చి 13 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 మాసాల కాలంలో ఎస్బీఐ దేశవ్యాప్తంగా 41.16 లక్షల ఖాతాలు రద్దు చేసింది. ఖాతాదార్లు బ్యాంకు నిర్దేశిత కనీస నిల్వను నిర్వహించకపోవడమే ఇందుకు కారణం. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద రద్దు చేసిన ఖాతాలపై సమాచారం కోరినప్పుడు, ఎస్బీఐ అధికారి ఒకరు లేఖద్వారా వివరాలు వెల్లడించారు.

Pages