S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/27/2018 - 02:19

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: భారత ఆర్థిక వ్యవస్థ చురుకుగా పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 7 శాతం మేరకు ఉండొచ్చని మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5.7 శాతం మాత్రమే ఉన్న జీడీపీ ఆ తరువాత పుంజుకుని గడచిన జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి 6.3 శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే.

02/27/2018 - 02:18

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: నిర్దేశించుకున్న రంగం ఏదైనా రాణించేందుకు వ్యక్తిగత, వృత్తిపరమైన నైపుణ్యత ఎంతో అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. భాగస్వామ్య సదస్సు చివరి రోజు సోమవారం ‘ది యూనివర్శ్ ఆఫ్ స్టార్టప్స్’ అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది.

02/25/2018 - 02:17

న్యూఢిల్లీ, ఫివ్రబరి 24: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగంలోని రెండవ అతిపెద్ద బ్యాంకు పీఎన్‌బీలో రూ.11,400 కోట్ల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుపరం చేయాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది.

02/25/2018 - 02:16

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం దరిమిలా ఒడుదుడుకులకు లోనైన దేశీయ మార్కెట్ల లావాదేవీలు ఈ వారంలో లాభాలతో ముగిశాయి. శనివారం క్రయవిక్రయాలు ముగిసేసరికి బీఎస్‌ఈ సెనె్సక్స్ వారాంతానికి 34,142.15 పాయింట్లకు చేరుకుని 131.39 పాయింట్ల లాభాలను నమోదు చేసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,491.05 పాయింట్లకు చేరుకుని 38.75 పాయింట్లతో లాభాలు ఆర్జించింది.

02/25/2018 - 02:15

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన భారీ కుంభకోణంలో ప్రధాన నిందితులు నీరవ్‌మోదీ, అతడి బంధువు మెహల్ ఛోస్కీల పాస్‌పోర్టులను రద్దు చేశారు. ఈ మేరకు వారికి విదేశాంగ శాఖ అధికారులు సమాచారం పంపినట్లు తెలిసింది.

02/25/2018 - 02:12

ముంబయి/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలక సూత్రధారి, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ నివాసాలు, సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దాడులు కొనసాగుతున్నాయి. శనివారం కూడా ఈడీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 21 ఆస్తులను జప్తు చేశాయి. వాటిలో విలాసవంతమైన పెంట్‌హౌస్, ఫార్మ్‌హౌస్ ఉన్నాయి.

02/25/2018 - 02:11

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: ఆటోమొబైల్ రంగానికి ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలియచేశారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలిరోజు శనివారం జరిగిన బ్రేక్‌అవుట్ సెషన్‌లో ‘స్పేర్‌హెడింగ్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ నెక్ట్స్ జనరేషన్ ఆటోమొబైల్స్ ఫర్ ది గ్లోబల్ మార్కెట్’ అన్న అంశంపై మంత్రి మాట్లాడారు.

02/24/2018 - 07:11

ముంబయి, ఫిబ్రవరి 23: అమెరికా అధ్యక్షుడిగా తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడం తమ కుటుంబ వ్యాపారాలకు నిస్సందేహంగా వ్యతిరేక పరిణామమేనని అమెరికా స్థిరాస్తి వ్యాపార దిగ్గజం, ట్రంప్ పెద్దకుమారుడు డొనాల్డ్ జాన్ ట్రంప్ జూనియర్ అన్నారు. అయితే అధ్యక్ష బాధ్యతలు పూర్తయిన తరువాత ఆయన మళ్లీ వ్యాపార రంగంలోకి వస్తారని స్పష్టం చేశారు.

02/24/2018 - 07:09

భీమవరం, ఫిబ్రవరి 23: ఆక్వా రంగంపై దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిసారించాయి. ఈరంగం నుండి విదేశీ మారకద్రవ్యం అధికంగా లభిస్తుండటంతో అన్ని రాష్ట్రాల దృష్టి ఆక్వా అభివృద్ధిపై పడింది.

02/24/2018 - 07:08

ముంబయి, ఫిబ్రవరి 23: ఈ నెలంతా నష్టాలనే చూసిన దేశీయ మార్కెట్లు తొలిసారిగా గణనీయమైన లాభాలను శుక్రవారం నాడు ఆర్జించాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ 323 పాయింట్లు లాభపడి, ఈ వారంలో అత్యధికంగా 34,142 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ విపణి స్థిరంగా ఉన్న నేపథ్యంలో తాజా పరిణామం మార్చిలో లాభాల దిశగా క్రయవిక్రయాలు సాగుతాయన్న భరోసా కలిగించింది.

Pages