S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/21/2018 - 06:46

ముంబయి, ఫిబ్రవరి 20: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)కి తాను చెల్లించాల్సిన 11,400 కోట్ల బకాయిల విషయంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ చేతులెత్తేశారు. అసలు తానంత మొత్తాన్ని బాకీపడలేదని, తాను చెల్లించాల్సింది కేవలం 5వేల కోట్ల రూపాయలేనని వెల్లడించారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు తాను ఎంతగా ప్రయత్నించినా అత్యుత్సాహంతో వ్యవహరించి బాకీలు తీర్చేందుకు తనకు ఉన్న అన్ని మార్గాలనూ మూసేశారని ఆరోపించారు.

02/21/2018 - 06:44

అమలాపురం, ఫిబ్రవరి 20: చేనేతకు పేరొందిన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామానికి చెందిన నల్లా సత్యానందం, ఈశ్వరి దంపతులు 364 గజాల నేత చీరను రూపొందించారు. సాధారణ చీర ఆరు గజాల వరకు ఉంటుంది. అయితే ఈ దంపతులు 364 గజాల చీరను నేసి, సంచలనం సృష్టించారు. మంగళవారం చీరను ధోనీ నుండి వెలిపి మడత పెట్టారు.

02/21/2018 - 06:43

ముంబయి, ఫిబ్రవరి 20: భారీ కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మరో గట్టి దెబ్బ తగిలింది. ప్రఖ్యాత ఆర్థిక విశే్లషణ, పరిశోధక సంస్థలు మూడీస్, ఫిచ్ పీఎన్‌బీకి ఇచ్చిన రేటింగ్, గ్రేడింగ్‌లను తగ్గించే దిశగా అడుగులు వేశాయి. కుంభకోణం దరిమిలా స్టాక్‌మార్కెట్‌లో షేర్ల విలువ పడిపోయి భారీ నష్టాలను ఎదుర్కొంటున్న పీఎన్‌బీకి తాజా పరిణామాలు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టనున్నాయి.

02/21/2018 - 06:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశంలో భారీ కుంభకోణాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్తలు విజయ్‌మాల్యా, లలిత్ మోదీలను వెనక్కి రప్పించేందుకు తీసుకుంటున్న చర్యలకోసం చేస్తున్న వ్యయం వివరాలను బహిర్గతం చేయలేమని కేంద్ర దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తమకు సమాచార హక్కు చట్టం వర్తించదని తెలిపింది.

02/21/2018 - 06:41

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20:డాలర్‌తో రూపా యి మారకం విలువ తగ్గడం, పీఎన్‌బీ కుంభకోణంపై చురుకుగా సాగుతున్న విచారణ నేపథ్యంలో మదుపరులు జాగ్రత్తపడటంతో దేశీయ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టాల్లోనే ముగిశాయి. మం గళవారం లావాదేవీలు లాభాల దిశగా ప్రారంభమైనప్పటికీ సాయంత్రానికి నష్టాలనే మిగిల్చాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మూడునెలల కనిష్ఠానికి, 64.88కు తగ్గిపోవడంతో భారీ నష్టాలు ఏర్పడ్డాయి.

02/20/2018 - 02:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ప్రముఖ బ్రాండ్ ‘రొటొమాక్’ పెన్నుల తయారీ సంస్థ ప్రమోటర్ విక్రమ్ కొఠారీపై అన్నివైపుల నుంచి ఉచ్చు బిగుస్తోంది. కొఠారీపై అటు సీబీఐ, ఇటు ఈడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాయి. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొంది ఎగవేసినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేయగా హవాలా మోసాలకు పాల్పడ్డారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది.

02/20/2018 - 02:55

ముంబయి, ఫిబ్రవరి 19: దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ, సోమవారం గందరగోళం మధ్య నష్టాలను నమోదు చేశాయి. సెనె్సక్స్ 236 పాయింట్లు కోల్పోయి రెండు నెలల కనిష్టస్థాయికి అంటే 33,775 స్థాయికి పడిపోయింది. మరోవైపు బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్ల పతనం ఇంకా కొనసాగింది. పీఎన్‌బీ షేర్ల విలువ 52 వారాల కనిష్ఠానికి పడిపోగా టాటాస్టీల్స్ 5.82 శాతం మేరకు షేర్లను కోల్పోయింది.

02/20/2018 - 02:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19:పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.11,400 కోట్ల కుంభకోణానికి సంబంధించి సీబీఐ, ఈడీ వంటి సంస్థల నిఘా, దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకోవడంతో స్టాక్‌మార్కెట్‌లో ఆటుపోట్లు కొనసాగుతున్నాయి. ప్రధానంగా నీరవ్‌మోదీకి చెందిన ‘గీతాంజలి జెమ్స్’ షేర్ల విలువ గణనీయంగా పతనమైంది.

02/20/2018 - 02:50

న్యూఢిల్లీ/ముంబయి, ఫిబ్రవరి 19: పీఎన్‌బీలో భారీ కుంభకోణానికి పాల్పడిన కేసులో ముంబయిలోని ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11,400 కోట్ల కుంభకోణం కేసులో భాగంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ వరుసగా ఐదోరోజూ తనిఖీలు నిర్వహించింది.

02/20/2018 - 02:42

గోపాలపురం, ఫిబ్రవరి 19: వినూత్న పంటల సాగుకు పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఇప్పుడు మరో సరికొత్త పంట సాగుకు తెరతీశారు. ‘పోయిన చోటే వెతుక్కోవాలి’ అనే నానుడిని నరనరాన వంటపట్టించుకున్న పశ్చిమ రైతాంగం పొగాకు సాగు విస్తీర్ణం తగ్గించాలని ప్రభుత్వం చేస్తున్న సూచనలతో మెల్లమెల్లగా ఇతర పంటలవైపు దృష్టిమళ్లిస్తున్నారు.

Pages