S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/02/2018 - 00:53

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా పన్నులు చెల్లించేవారికి పట్టంకట్టిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. 2006లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నిజాయితీగా పన్ను చెల్లించేవారికి సరైన ప్రాధాన్యత, గౌవరం ఇవ్వాలన్నదేనని స్పష్టం చేశారు.

02/02/2018 - 00:51

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రతిపాదించిన 2018-19 వార్షిక బడ్జెట్ లోతుగా పరిశీలిస్తే ప్రతి రూపాయిలో 19 పైసలు అప్పుల ద్వారానే లభిస్తుందన్న విషయం స్పష్టమవుతోంది. వడ్డీ చెల్లింపులపై 18 పైసలు వెచ్చించనుంది. ఆదాయంగా వచ్చిన ప్రతి రూపాయలో 70 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారానే లభిస్తుంది. ఇక ఖర్చుల విషయానికి వస్తే పన్నుల్లో, సుంకాల్లో రాష్ట్రాల వాటా 24 పైసలు.

02/02/2018 - 00:47

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: పార్లమెంటులో 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మేక్‌ఇన్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. కేంద్రం ఇటీవలే జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చినందున ధరలపై బడ్జెట్ ప్రభావం తక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు.

02/02/2018 - 04:12

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్ను శ్లాబుల్లోగాని, రేట్లలోగాని ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ప్రస్తుతంమున్న రవాణా అలవెన్స్‌లు, ఇతర వైద్యపరమైన ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌కు బదులుగా 40వేల రూపాయలను ప్రామాణిక మినహాయింపుగా ప్రతిపాదిస్తున్నట్టు ఆయన వివరించారు. దీనివల్ల దాదాపు 8వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వంపై భారం పడుతుంది.

01/31/2018 - 22:44

ముంబయి, జనవరి 31: మరో 24 గంటల్లో పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న తరుణంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించి కొనుగోళ్లకు దూరంగా ఉండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ కీలకమైన 36,000 పాయింట్ల స్థాయికన్నా దిగువన ముగిసింది.

01/31/2018 - 22:43

న్యూఢిల్లీ, జనవరి 31: మైనింగ్ కంపెనీ వేదాంత లిమిటెడ్ నికర లాభం మూడో త్రైమాసికంలో 1.8 శాతం పెరిగింది. 2017 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 2,173 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వేదాంత లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో రూ. 2,133 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

01/31/2018 - 22:42

న్యూఢిల్లీ, జనవరి 31: సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్‌ఓ) బుధవారం 2015-16 ఆర్థిక సంవత్సర స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును 8 శాతం నుంచి 8.2 శాతానికి సవరించింది. 2016-17 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటును మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా 7.1 శాతంగానే ఉంచింది. వాస్తవ జీడీపీ 2016-17లో రూ. 121.96 లక్షల కోట్లు, 2015-16లో రూ.

01/31/2018 - 22:42

పాల్వంచ, జనవరి 31: రూ.5,500 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్మిస్తున్న కేటీపీఎస్ 7వ దశలో బుధవారం చేసిన లైటప్ విజయవంతమైంది. అనుకున్న సమయానికంటే ముందుగానే నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న బాయిలర్ విభాగంలో టీఎస్ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కంప్యూటర్ ద్వారా లైటప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

01/31/2018 - 22:41

అమరావతి, జనవరి 31: రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమలు పెట్టడానికి అనుకూలతతో పాటు విస్తారమైన మార్కెట్ అవకాశాలు రాష్ట్రంలో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి తెలిపారు.

01/31/2018 - 22:41

పోలవరం, జనవరి 31: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం గోదావరి నదికి అడ్డుకట్టవేసే పనులను బుధవారం ప్రారంభించారు. మొత్తం 1427 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో భూమిలోపల నిర్మించే డయాఫ్రం వాల్ ఇప్పటివరకు 929 మీటర్ల మేర నిర్మాణం పూర్తయ్యింది. మిగిలిన 498 మీటర్ల నిర్మాణం కోసం గోదావరి నదికి అడ్డుకట్ట వేస్తున్నారు.

Pages