S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/31/2018 - 22:40

విజయవాడ, జనవరి 31: సినిమా టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని బుధవారం సచివాలయంలో జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రోడ్డు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు సమావేశంలో పాల్గొన్నారు.

01/31/2018 - 22:39

విజయవాడ, జనవరి 31: హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజేస్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లోని తమ ఉత్పత్తి యూనిట్లల్లో సౌరశక్తిని వినియోగించుకోనుంది. ఇందుకు అవసరమైన సౌర విద్యుత్ కోసం హైదరాబాద్‌లోని గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ వైబ్రేంట్ ఎనర్జీతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలోని అమీన్‌పూర్, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, శ్రీకాళహస్తిలో హెచ్‌సీసీబీకి యూనిట్లు ఉన్నాయి.

01/31/2018 - 22:39

రాజమహేంద్రవరం, జనవరి 31: ప్రభుత్వాలు విధించే వివిధ రకాల పన్నులను వసూలుచేసే శాఖలకు సాధారణంగా వసూళ్ల లక్ష్యాలను నిర్దేశించడం చూస్తుంటాం. కానీ జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి అపరాధ రుసుం వసూలుకు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించడం వివాదాస్పదమవుతోంది.

01/31/2018 - 22:38

విజయవాడ, జనవరి 31: కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు ఎక్కువగా ఉంటాయన్న ఆశాభావాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో విభజన వల్ల ఇబ్బంది పడుతున్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సి ఉందన్నారు.

01/31/2018 - 22:37

అమరావతి, జనవరి 31: పంట పండించే రైతులకు తక్కువ ధర లభించడంలో వినిమయం కంటే ఉత్పత్తి ఎక్కువగా రావడం, తృణధాన్యాల సాగు వైపు కాకుండా సాంప్రదాయ ఉత్పత్తులను సాగు చేయడం ప్రధాన కారణంగా నిలుస్తోందని కమిషనర్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ (సీఏపీసీ) చైర్మన్ ప్రొఫెసర్ విజయ్‌పాల్ శర్మ అభిప్రాయపడ్డారు.

01/31/2018 - 01:00

న్యూఢిల్లీ, జనవరి 30: ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో తన నికర లాభాన్ని దాదాపు రెండింతలు పెంచుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో పాటు చమురు శుద్ధి లాభాలు పెరగడం వల్ల ఈ సంస్థ నికర లాభాలు క్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే బాగా పెరిగాయి. 2017 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో ఐఓసీ రూ.

01/31/2018 - 00:59

ముంబయి, జనవరి 30: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ సమీపిస్తున్న తరుణంలో ధరలు హెచ్చు స్థాయిలో ఉన్న షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు వెనుకపట్టు పట్టడం కూడా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

01/31/2018 - 00:57

భీమవరం, జనవరి 30: ఆక్వా రంగానికి సంబంధించిన కోర్సులు అభ్యసించే రాష్ట్ర విద్యార్థులకు లండన్‌కు చెందిన స్టెరింగ్ యూనివర్సిటీ పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పిస్తోంది. అంతర్జాతీయంగ పేరొందిన విశ్వవిద్యాలయాల్లో స్టెర్లింగ్ యూనివర్శిటీ నాలుగో స్థానంలో ఉంది. మూడేళ్ల కాలవ్యవధి కలిగిన ఈ కోర్సును రెండేళ్ల పాటు భారత్‌లో, ఒక సంవత్సరం లండన్‌లో చేయాల్సివుంటుంది.

01/31/2018 - 00:51

హైదరాబాద్, జనవరి 30: జిఎస్‌టి మినహాయింపుతోనే మనుగడ సాధ్యమవుతుందని విద్యాసంస్థల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌పై యాజమాన్యాలు దృష్టిసారించాయి. కేంద్రం జిఎస్‌టి సహా పలు రాయితీలను ప్రకటిస్తే విద్యాసంస్థలు మనుగడ సాగిస్తాయని, లేకుంటే రానున్న రోజుల్లో విద్యాసంస్థలను నడపడం కష్టమేనని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.

01/31/2018 - 00:49

విశాఖపట్నం, జనవరి 30: విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య పెరుగుతున్నందున పాస్‌పోర్ట్ సేవలను మరింతగా విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోస్ట్ఫాసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలను (పీఓపిఎస్‌కె)లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అదీ పాస్‌పోర్ట్ ప్రధాన కార్యాలయాలకు అనుసంధానం చేస్తూ వీటిని నిర్వహించేందుకు రంగం చేస్తోంది.

Pages