S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/30/2018 - 01:15

న్యూఢిల్లీ, జనవరి 29: ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, దేశాభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను ఆర్థిక సర్వే ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దేవ్‌రాయ్ పేర్కొన్నారు. ఆర్థిక సర్వేలో మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వడం స్వాగతించాల్సిన అంశమని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

01/30/2018 - 01:13

ముంబయి, జనవరి 29: భారత్ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం బాగా పుంజుకుంటుందని ఆర్థిక సర్వే వెల్లడించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. ఆర్థిక సర్వే దన్నుగా మార్కెట్లలో కొనుగోళ్లు పుంజుకొని కీలక సూచీలు మళ్లీ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలకు చేరాయి.

01/30/2018 - 01:16

హైదరాబాద్, జనవరి 29: అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయాలకు ‘ప్రపంచస్థాయి హోదా’ ట్యాగ్ ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇటువంటి ట్యాగ్ దక్కితే వాటికి యూజీసీ నిధులు పెరగడమేగాక, ప్రపంచంలో ఏ దేశం నుండైనా విద్యార్థులను ఆహ్వానించేందుకు, విదేశీ వ్యవహారాల విభాగాలను తెరిచేందుకు వీలు కలుగుతుంది.

01/30/2018 - 01:09

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రస్తుతం ఉన్న స్టాక్ మార్కెట్ విలువ నిలదొక్కుకోవాలంటే కార్పొరేట్ కంపెనీల ఆదాయాలతో పాటు ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఎంతో అవసరమని, ఈ రెండూ లేకుంటే స్టాక్ మార్కెట్ విలువలో దిద్దుబాటును తోసిపుచ్చజాలమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.

01/30/2018 - 01:08

వరంగల్, జనవరి 29: మేడారం సమ్మక్క, సారాలమ్మ జాతరను దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్‌శాఖ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొన్నినెలలుగా అమలు చేస్తున్న బెల్లం అమ్మకాలపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేయటంతో నాటుసారా తయారీదారులు ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుంటున్నారు. వ్యాపారుల నుంచి భారీమొత్తంలో బెల్లం కొనుగోలు చేసి రహస్య ప్రదేశాలలో నిలువ చేసుకుంటున్నారు.

01/30/2018 - 01:07

విజయవాడ, జనవరి 29: అరకు వ్యాలీ ఇన్‌స్టంట్ కాఫీ సేవించి, రుచి చూసి ఆస్వాదించి గిరిజనులను ఆదుకోవాలని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. వెలగపూడి సచివాలయం 3వ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్‌తో కలిసి ఆయన అరకు వ్యాలీ ఇన్‌స్టంట్ కాఫీ 2గ్రాములు, 10గ్రాముల ప్యాకెట్లను మార్కెట్‌కు విడుదల చేశారు.

01/30/2018 - 01:04

కరీంనగర్, జనవరి 29: ఎరువుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఎలాగోలా సాగును వెల్లదీస్తున్న కర్షకులకు పెరగబోయే ఎరువుల ధరలు మరింత బారం కానున్నాయి.

01/29/2018 - 01:41

న్యూఢిల్లీ, జనవరి 28: ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పైనే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే మదుపరుల చూపంతా ఉంది. బడ్జెట్‌లో వెల్లడయ్యే ప్రభుత్వ నిర్ణయాలను బట్టి తమ పెట్టుబడులకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని మదుపరులు భావిస్తున్నారు.

01/29/2018 - 01:40

హైదరాబాద్, జనవరి 28: తెలంగాణ రవాణా శాఖ ఎం-వాలెట్ రూపంలో అందిస్తున్న సేవలకు మరింత మెరుగులు దిద్దేందుకు నిర్ణయించింది. మొబైల్ అప్లికేషన్ ఎం-వాల్లెట్ ద్వారా అందిస్తున్న సేవలకు మరిన్ని సేవలను జోడించి తన సేవలను డిజిటలైజేషన్ చేసేందుకు కసరత్తు చేస్తోంది.

01/29/2018 - 01:39

కోల్‌కతాలో ఆదివారం నిర్వహించిన వింటేజ్ కార్ ర్యాలీ చూపరులను ఆకట్టుకుంది. కొత్త కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కార్లను తీర్చిదిద్ది ప్రదర్శనలో ఉంచారు. యువత సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోయారు.

Pages