S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/29/2018 - 01:36

సింహాచలం, జనవరి 28: వర్షం నీరు వృథా కాకుండా కాపాడుకోవడం కోసం ఇంజక్షన్ వెల్స్ విధానం ఎంతో ఉపయోగపుడుతుందని, భూగర్భ జలాలను వృద్ధి చేసుకోవడంలో ఈ విధానం మంచి ఫలితాన్నిస్తుందని సహజ అసోసియేట్స్ ప్రతినిధి సాయికృష్ణ, జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కో ఆర్డినేటర్ సౌమిత్రి అన్నారు. ఇంజక్షన్ వెల్స్ విధానాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా సింహాచలం దేవస్థానం ప్రయోగాత్మంగా నిర్మించింది.

01/29/2018 - 01:34

తిరుపతి, జనవరి 28: వ్యవసాయరంగంలో ఆంధ్రప్రదేశ్ 25.6 శాతం అభివృద్ధి సాధించి మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం తిరుపతి ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.

01/29/2018 - 01:33

న్యూఢిల్లీ, జనవరి 28: బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)లోని టాప్ టెన్ పెద్ద కంపెనీలలో తొమ్మిది సంస్థల మొత్తం మార్కెట్ విలువ గురువారంతో ముగిసిన వారంలో రూ. 97,931.85 కోట్లు పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) గరిష్ఠ లాభాలతో ముందంజలో నిలిచాయి.

01/29/2018 - 01:31

హైదరాబాద్, జనవరి 28: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలంలోని కందివనం గ్రామ ప్రజలు 15 ఏళ్లుగా అనారోగ్యం పాలవుతున్నారు. షాద్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కందివనం ప్రజలు గతంలో ఆరోగ్యంగా ఉండేవారు. 15 ఏళ్ల కింద ఈ గ్రామం పక్కనే ‘ఓం శివ శక్తి’ పేరుతో స్పాంజ్‌ఐరన్ ఫ్యాక్టరీ ఏర్పాటయింది. ఈ పరిశ్రమ ఏర్పాటు తర్వాత ప్రజల ఆరోగ్యానికి ముప్పువాటిల్లుతోంది.

01/28/2018 - 00:33

న్యూఢిల్లీ, జనవరి 27: వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను సేకరించేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా టెలికం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ ప్రభుత్వాన్ని కోరింది. ‘ఐడియా కంపెనీలోకి వంద శాతం ఎఫ్‌డీఐలను సేకరించేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ)కు దరఖాస్తు చేయడం జరిగింది’ అని ఆ కంపెనీ శుక్రవారం సాయంత్రం ఒక ‘ఇనె్వస్టర్ ప్రజెంటేషన్’లో తెలిపింది.

01/28/2018 - 00:32

ముంబయి, జనవరి 27: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో వారం పుంజుకున్నాయి. ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 538.86 పాయింట్లు పుంజుకొని, 36,050.44 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 11,069.65 పాయింట్ల వద్ద స్థిరపడింది.

01/28/2018 - 00:30

హైదరాబాద్, జనవరి 27: పరిశోధనలతో మరింత ప్రగతి సాధ్యం అవుతుందని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ‘డెవలపింగ్ ఆర్ అండ్ డి ఇన్ ఇండియా’ అనే అంశంపై జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ, పరిశోధనా రంగానికి ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం పరిశోధనా సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు మరింత చొరవ తీసుకోవాలని అన్నారు.

01/28/2018 - 00:28

కాకినాడ, జనవరి 27: విదేశాలకు రొయ్యల ఉత్పత్తిలోను, అన్ని రకాల ఆక్వా ఉత్పత్తుల టర్నోవర్‌లోను తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన దేవీ ఫిషరీస్ సంస్థ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. మత్స్య సంపద ఎగుమతుల రంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు దేవీ ఫిషరీస్‌కు 2016-17 సంవత్సరానికి గాను మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్మెంట్ అధారిటీ (ఎంపెడా) రెండు జాతీయ అవార్డులను ప్రదానం చేసింది.

01/28/2018 - 00:23

హైదరాబాద్, జనవరి 27: విజయా డెయిరీ ఉత్పత్తులను అమ్మేందుకు వెయ్యి విక్రయ కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అధికారులను ఆదేశించారు. పశుసంవర్థక తదితర అనుబంధ రంగాలపై ఉన్నతాధికారులతో సచివాలయంలో శనివారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విజయా డెయిరీ ఉత్పత్తుల పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ మేరకు విక్రయాలను పెంచుకోవాలన్నారు.

01/28/2018 - 00:21

విజయవాడ, జనవరి 27: మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆసియాలోనే అతి పెద్ద బిందు సేద్య ప్రాజెక్ట్ కర్నాటకలోని భాగల్‌కోట్ జిల్లా రాంతాల్ మరోళాలో ఆదివారం ప్రారంభం కానుంది. కృష్ణా భాగ్య జల నిగమ అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టును మేఘా సంస్థ చేపట్టి పూర్తిచేసింది. ప్రాజెక్టును కర్నాటక జలవనరులశాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఆదివారం ప్రారంభించనున్నారు.

Pages