S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/27/2018 - 01:09

న్యూఢిల్లీ, జనవరి 26: రానున్న బడ్జెట్‌లో ఆహార తయారీ రంగానికి, గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేయనున్నారా? ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు అలాగే అంచనా వేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల విలువను మరింత పెంచడానికి, గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలను పెంచడానికి ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై ఎక్కువగా కేంద్రీకరిస్తుందని ఈ కంపెనీలు భావిస్తున్నాయి.

01/27/2018 - 01:08

హైదరాబాద్, జనవరి 26: పరిశ్రమలకు విద్యుత్ కనెక్షన్ల మంజూరులో సరళీకరణ విధానాలు అనుసరించినందుకు, దరఖాస్తు చేసిన రోజే అనుమతి ఇచ్చినందుకు తెలంగాణ సదరన్ పవర్ డిస్కాంకు అవార్డు లభించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో సదరన్ డిస్కాం సిఎండి రఘుమారెడ్డి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ఈ అవార్డు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

01/27/2018 - 01:06

న్యూఢిల్లీ, జనవరి 26: స్నాప్‌డీల్‌కు చెందిన లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ వుల్కాన్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కిశోర్ బియానికి చెందిన ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ కొనుగోలు చేయబోతోంది. రూ. 35 కోట్లకు వుల్కాన్‌ను కొనుగోలు చేస్తున్నట్టు ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కిశోర్ బియాని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

01/27/2018 - 01:04

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో నిర్దేశించిన లక్ష్యం కంటే 12 శాతం తక్కువగా బ్యాం కులు రైతులకు రుణాలు ఇచ్చిన ఘటన పునరావృతం కాకుండా జిల్లా స్థాయిలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులను రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 12 శాతం జిల్లాల్లో 75 శాతం కంటే తక్కువగా , ఎనిమిది జిల్లాల్లో 100 శాతం కంటే తక్కువగా రైతులకు ఖరీఫ్ సీజన్‌లో రుణాలు ఇచ్చారు.

01/27/2018 - 01:02

హైదరాబాద్, జనవరి 26: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న మహానగరవాసుల కష్టాలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం ఇప్పటికే పలు ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన మెట్రోరైలును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవటంతో పాటు రెండో దశపై కూడా ప్రభుత్వం కాస్త ముందుగానే దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మెట్రోరైలు రెండో దశ డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) రూపకల్పనకు కసరత్త మొదలైంది.

01/27/2018 - 01:00

హైదరాబాద్, జనవరి 26: రాష్ట్ర, దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సింగరేణి సంస్థ రానున్న ఐదేళ్లలో భారీ విస్తరణకు సిద్దమవుతోందని సింగరేణి కాలరీస్ సిఎండి ఎన్.శ్రీధర్ అన్నారు. 2022 నాటికి 850 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 2500 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక లక్ష్యంగా ప్రణాళికను అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు.

01/27/2018 - 00:59

కొత్తగూడెం, జనవరి 26: సింగరేణి సంస్థ 2024 నాటికి 85 మిలియన్ టన్ను ల బొగ్గు ఉత్పత్తి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగరేణి కాలరీస్ డైరెక్టర్ (పా) పవిత్రన్‌కుమార్ తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

01/26/2018 - 01:00

ముంబయి, జనవరి 25: ఆరు రోజుల పాటు సాగిన దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డు పరుగుకు గురువారం బ్రేక్ పడింది. కీలక సూచీలయిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ రెండూ కూడా గురువారం రికార్డు గరిష్ట స్థాయిల నుంచి పడిపోయాయి. ఇటీవలి కాలంలో ధరలు బాగా పెరిగిన షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల సూచీలు దిగజారాయి.

01/26/2018 - 00:58

ముంబయి, జనవరి 25: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటి (ఎంపీసీ) తన ఏప్రిల్ సమీక్షా సమావేశంలో కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందా? అవుననే అంటోంది ఒక విదేశీ బ్రోకరేజ్ సంస్థ. భారత్‌లో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదకర పరిస్థితులు ముగిసి పోయినందున రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్‌లో జరిగే సమీక్షా సమావేశంలో కీలక వడ్డీ రేట్లను 0.25 తగ్గిస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్‌లోని విశే్లషకులు పేర్కొన్నారు.

01/26/2018 - 00:56

హైదరాబాద్, జనవరి 25: దావోస్‌లో తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావు పర్యటన ఫలవంతమైంది. వివిధ కంపెనీలతో మంత్రి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలను స్థాపించడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయి.

Pages